E-Paper
Advertisement

Andhra king Taluka Collections : ‘ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇలా అయితే కష్టమే రామ్..!

Andhra king Taluka Collections : ‘ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇలా అయితే కష్టమే రామ్..!
Advertisement

Andhra king Taluka Collections : టాలీవుడ్ హీరో రామ్ పోతినేని చివరగా డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు.. భారీ అంచనాల నడుమ థియేటర్లోకి వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కాస్త గ్యాప్ తీసుకున్న రామ్ ప్రస్తుతం ఆంధ్రా కింగ్ తాలూకా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ నెల 27 న భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. ఇందులో బ్యూటీ ఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటించింది.. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మహేష్ పి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. రామ్ కెరీర్ లో 22వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మొదటిరోజు పాజిటివ్ టాక్ ని అందుకున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు కూడా భారీగానే వసూల్ చేసినట్లు తెలుస్తుంది. మరి మొదటి రోజు ఈ మూవీ కలెక్షన్లు ఎన్ని కోట్లు రాబట్టిందో ఒకసారి తెలుసుకుందాం..

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ డే కలెక్షన్స్..

రామ్ పోతినేని, మహేష్ పి కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజు పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే అనుకున్న దానికంటే తక్కువే వసూళ్లను అందుకుందని తెలుస్తుంది. ఏరియా వైడ్ ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే.. గుంటూరు రూ. 10 లక్షలు, తూర్పు గోదావరి 11 లక్షలు షేర్ రాబట్టగా కృష్ణ రూ. 20 లక్షలు గ్రాస్ వసూలు చేసింది. ఇక పశ్చిమ గోదావరి రూ. 16.20 లక్షలు సాధించింది. ఇకపోతే హీరో రామ్ నైజాంతో పాటు గుంటూరు రైట్స్ ను కొనుగోలు చేశారు. అయితే ఓవర్సీస్ లో ఆంధ్ర కింగ్ తాలూకా కాస్త బెటర్ గా వసూళ్లను అందుకుందని తెలుస్తుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 7.5 కోట్లను వసూల్ చేసిందని టాక్.. ఈ కలెక్షన్స్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Also Read :ఆంధ్రా కింగ్ తాలూకా సక్సస్‌మీట్ హీరో హీరోయిన్ మిస్… ఇద్దరు ఎక్కడికి వెళ్లారంటే ?

బడ్జెట్ & టార్గెట్..

గతంలో రామ్ ఖాతాలో హిట్ సినిమాలు లేవు.. డబుల్ ఇస్మార్ట్ దెబ్బేసింది. కానీ డైరెక్టర్ మహేష్ పై నమ్మకంతో బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు నిర్మాతలు. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు 70 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. టీజర్, ట్రైలర్లు, పాటలతో పాటు ప్రమోషన్స్ కార్యక్రమాలతో మూవీ ప్రీ బిజినెస్ బాగానే జరిగింది. వరల్డ్ వైడ్‌గా దాదాపు 27 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. గతంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు టార్గెట్ కాస్త ఎక్కువగానే ఉందని బిజినెస్ ను చూస్తే తెలుస్తుంది. 30 కోట్ల షేర్, 60 కోట్ల గ్రాస్ నీ వసూలు చేయాలి.. తెలుగు రాష్ట్రాల్లో 650 స్క్రీన్‌లలో, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లలో 1300 స్క్రీన్లు చొప్పున 1950 స్క్రీన్‌లలో రిలీజ్ చేశారు… సినిమాకు ప్రమోషన్స్ బాగానే చేసినా కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదని తెలుస్తుంది. మొదటి రోజు కేవలం రూ. 8 కోట్లలోపే కలెక్షన్లను రాబట్టడం గమనార్హం. ఒకవైపు మౌత్ టాక్ పాజిటివ్ గా ఉండడంతో ఈ సినిమాకు ఈ వీకెండ్ కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు.. మరి మూవీ బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ రాబడుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×