E-Paper
Advertisement

Raju Weds Rambai : నా చేయి ఏమైందని అడుగుతున్నారు, ఎమోషనల్ అయిపోయిన రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్ 

Raju Weds Rambai : నా చేయి ఏమైందని అడుగుతున్నారు, ఎమోషనల్ అయిపోయిన రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్ 
Advertisement

Raju Weds Rambai : బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు ఎంతటి స్థాయి సక్సెస్ అందుకుంటున్నాయి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజుల్లో చిన్నాపెద్ద సినిమాలు అని కాకుండా ఒక మంచి కథ ఉంటే అదే పెద్ద సినిమా అయిపోతుంది. మామూలు బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలు ఈరోజు కోట్లు కొల్లగొడుతున్నాయి. రీసెంట్ టైమ్స్ లిటిల్ హార్ట్స్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. సాయిలు కంపాటి దర్శకుడుగా పరిచయమైన రాజు వెడ్స్ రాంబాయి సినిమాకి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం రెస్పాన్స్ మాత్రమే కాకుండా కమర్షియల్ గా కూడా ఈ సినిమా సక్సెస్ సాధించింది.

ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సాయిలు కంపాటి. మొదటి సినిమాతోనే ఒక అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. చాలామంది ప్రముఖ దర్శకులు ఇతనిని వెట్రిమారన్, పా రంజిత్, మారి సెల్వరాజ్ వంటి ప్రముఖు దర్శకులతో పోలుస్తున్నారు. ఇక డైరెక్టర్ వీడియోలు కూడా ఇంస్టాగ్రామ్ లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే చాలామంది సాయిలు కుడి చేతికి ఏమైంది అని కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు. అసలు ఏం జరిగింది అని సంఘటనను బయటపెట్టాడు దర్శకుడు సాయిలు.

కుడి చేతికి ఏమైంది 

Advertisement

సాయిలు జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉందా అని ఒక ప్రముఖ జర్నలిస్ట్ అడిగితే. ఉంది అని చెప్పి ఈ విషయం గురించి చెప్పాడు. చాలామంది కామెంట్స్ లో అన్నా రైట్ హ్యాండ్ కి ఏమైంది అని అడుగుతూ ఉంటారు. నా చిన్నప్పుడు ఒక పవర్ షాక్ వలన ఇలా అయిపోయింది. అప్పుడు దాకా నా చేయి చాలా మస్తుగుండే. అందరిలాగానే చాలా బాగుండేది.

స్కూల్ చదువుకుంటున్న టైం లో 2004 ఆ టైంలో ఇలా జరిగింది. ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది అప్పుడు నుంచి నేను దీనిని కాపాడుకోవడమే నా పని అయిపోయింది. అంతకుముందు నేను కొంచెం బానే ఉండేవాడిని. ఇప్పుడేంటంటే దీన్ని కాపాడుకోవడం కోసం ఎవరు దీని గురించి ఎత్తొద్దు అని చెప్పి, ఇది కాపాడుకోవడమే నా పని అయిపోయింది అని సాయిలు చెప్పాడు.

వాళ్ల కోసం క్లారిటీ 

Advertisement

అయితే దీని గురించి ప్రస్తుతం ఎవరూ మాట్లాడట్లేదు అందరూ సక్సెస్ గురించే మాట్లాడుతున్నారు అని సదర్ జర్నలిస్ట్ అనగా, కొంతమందికి క్లారిటీ ఇవ్వాలి కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్పాను అని సాయిలు చెప్పాడు. అలానే ఆ సినిమా షూటింగ్లో జరిగిన పలు ఆసక్తికరమైన సంఘటనలు సాయిలు రివీల్ చేశాడు.

కొన్ని సినిమాలుకు కేవలం ప్రశంసలు మాత్రమే వస్తాయి. కానీ ప్రశంసలతో పాటు కలెక్షన్లు కూడా తీసుకొచ్చే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. అటువంటి సినిమాలలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఒకటి. ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం చాలా మందికి విపరీతంగా షాక్ ఇచ్చింది. మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపించింది. ఈ సినిమాతో చైతన్య జొన్నలగడ్డకు మంచి పేరు వచ్చింది. వెంకన్న అనే పాత్రతో చాలామందిని షాక్ కు గురి చేశాడు చైతన్య.

Also Read: Actress Mirchi Madhavi: ఆ డైరెక్టర్ కమిట్మెంట్ అడిగాడు, చెప్పు తీసుకొని కొడతా అని చెప్పా

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×