E-Paper
Advertisement

Andrea Jeremiah: పిశాచి 2 లో నగ్న సన్నివేశాలు.. ఎట్టకేలకు నోరువిప్పిన బోల్డ్ బ్యూటీ

Andrea Jeremiah: పిశాచి 2 లో నగ్న సన్నివేశాలు.. ఎట్టకేలకు నోరువిప్పిన బోల్డ్ బ్యూటీ
Advertisement

Andrea Jeremiah:కోలీవుడ్ హీరోయిన్ కమ్ సింగర్ ఆండ్రియా జెర్మియా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు సినిమాల వలన ఎంత గుర్తింపు తెచ్చుకుందో తెలియదు కానీ, వివాదాల వలన, రిలేషన్స్ వలన మాత్రం చాలా గుర్తింపు అందుకుంది. ముఖ్యంగా అనిరుధ్ తో ప్రేమాయణం, సుచీ లీక్స్ లో వీరిద్దరి ముద్దు ఫోటోలు బయటకు రావడం అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇక అవేమి పట్టించుకోని ఆండ్రియా ఒకపక్క హీరోయిన్  గా.. ఇంకోపక్క సింగర్ గా తన పని తాను చేసుకుంటూ పోతుంది.

ఇక అనిరుధ్ తరువాత ఒక పెళ్ళైన వ్యక్తితో రిలేషన్ పెట్టుకున్నాను అని, అది తనను  ఎంతో బాధించిందని చెప్పి మరో షాక్ ఇచ్చింది. అతనితో బ్రేకప్ తరువాత తాను సింగిల్ గా.. ఎంతో హ్యాపీగా ఉన్నట్లు తెలిపింది. ఇక ఈ మధ్యనే మాస్క్ సినిమాతో ఆండ్రియా మంచి హిట్ ను అందుకుంది. ఇక ప్రస్తుతం సింగర్ గా  పలు ప్రదర్శనలు ఇస్తూ బిజీగా ఉంది. అయితే ఆమె నటించిన పిశాచి 2 సినిమా ఇప్పటికీ రిలీజ్ కు నోచుకోలేదు. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా తెలియదు.

Advertisement

డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆండ్రియా నగ్న సన్నివేశాల్లో నటించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. సగం సీన్స్ లో ఆమె ఒంటిపై  దుస్తులు లేకుండానటించినట్లు రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై మిస్కిన్ స్పందించాడు కానీ, ఆండ్రియా స్పందించలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె పిశాచి 2 లో ఆమె నటించిన నగ్న సన్నివేశాల గురించి స్పందించింది.

“పిశాచి 2 లో నగ్న సన్నివేశాలు ఉన్నాయని ముందు మిస్కిన్ నాకు చెప్పారు. నేను ఆయనను నమ్మాను. కానీ, ఆయన చాలా మెచ్యూర్డ్.చాలా సీన్స్ అలాంటివి రాశారు కానీ, షూట్ చేయలేదు. నా స్కర్ట్ ని లాగమని చాలామంది చెప్పారు. కానీ, మిస్కిన్ అలా చేయలేదు. అంతా వారు అనుకొనే విధానంలో ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా కనిపించాలని తీశారు. కానీ, వాటిని తరువాత సినిమాలో తొలగించారు. సినిమాలో శృంగార సన్నివేశాలు ఉంటాయి.. కానీ నగ్నంగా కనిపించేవి ఉండవు ” అని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆండ్రియా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×