E-Paper
Advertisement

Krithi Shetty : టైం పాస్ కోసం వెళితేలో లక్కీగా… ఫస్ట్ మూవీ ఛాన్స్‌పై కృతి శెట్టి ఓపెన్

Krithi Shetty : టైం పాస్ కోసం వెళితేలో లక్కీగా… ఫస్ట్ మూవీ ఛాన్స్‌పై కృతి శెట్టి ఓపెన్
Advertisement

Krithi Shetty: కృతి శెట్టి ఉప్పెన సినిమా(Uppena) ద్వారా బేబమ్మగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు అనంతరం తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న  కృతి శెట్టి(Kriti Shetty) అనుకున్న స్థాయిలో సినిమాల ద్వారా సక్సెస్ అందుకోలేకపోయారు దీంతో ఈమెకు తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో కోలీవుడ్ బాట పట్టారు. ఇలా కోలీవుడ్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ..

ఇక త్వరలోనే కృతి శెట్టి ప్రదీప్ రంగనాథన్ హీరో హీరోయిన్లుగా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 18వ తేదీ విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా కృతి శెట్టి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఉప్పెన సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అసలు ఈ సినిమాలో తనకు అవకాశం ఎలా వచ్చిందో ఇన్నాళ్లకు తెలియజేశారు.

టైంపాస్ కోసం వెళ్తే ఉప్పెనలో ఛాన్స్..

Advertisement

కృతి శెట్టి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి రాకముందు పలు అడ్వర్టైజ్మెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఉప్పెన సినిమాకు ముందు ఈమె ఒక వాణిజ్య ప్రకటన కోసం ఆడిషన్ కి వెళ్ళారట. అయితే తనని తిరిగి ఇంటికి తీసుకు వెళ్లడానికి తన తండ్రి రావడం ఆలస్యం కావడంతో టైం పాస్ కోసం పక్కనే ఉన్న ఒక స్టూడియోలోకి వెళ్లినట్లు తెలిపారు.. అక్కడికి వెళ్లడంతో తనకు సినిమా ఆడిషన్ జరుగుతుందని స్పష్టమైందని ఇక తనని చూడగానే మీకు నటనపై ఆసక్తి ఉందా? అని అడగడమే కాకుండా తన ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నారని తెలిపారు .అయితే ఆరోజు తను వాళ్ళ అమ్మ ఫోన్ నెంబర్ ఇచ్చి ఇంటికి వెళ్లిపోయినట్లు కృతి శెట్టి తెలిపారు.

కోలీవుడ్ సక్సెస్ ఇచ్చేనా?

Advertisement

ఇలా ఫోన్ నెంబర్ ఇచ్చిన రెండు రోజులకే తనకు డైరెక్టర్ బుచ్చిబాబు(Bucchi Babu) గారి నుంచి ఫోన్ కాల్ వచ్చిందని అలా ఆడిషన్ కి వెళ్లడంతో ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా  ఛాన్స్ వచ్చింది అంటూ అసలు విషయం వెల్లడించారు. ఏదో టైం పాస్ కోసం అక్కడికి వెళ్తే హీరోయిన్  ఛాన్స్ రావడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కృతి శెట్టి తెలుగులో సుమారు అరడజనుకు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక తెలుగులో ఇటీవల సక్సెస్ అందుకోని నేపథ్యంలో కోలీవుడ్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి సక్సెస్ వస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: Sailu Kampati: రాజు వెడ్స్ రాంబాయి ఎఫెక్ట్..చిరుతో ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×