E-Paper
Advertisement

Star Actor: పాకెట్ మనీ కావాలంటే భార్యను అడగాల్సిందే.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్!

Star Actor: పాకెట్ మనీ కావాలంటే భార్యను అడగాల్సిందే.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్!
Advertisement

Star Actor: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు అనిల్ కపూర్ (Anil Kapoor)కూడా ఒకరు. ప్రముఖ నిర్మాత బోణీ కపూర్ సోదరుడుగా అనిల్ కపూర్ అందరికీ ఎంతో సుపరిచితమే. ఈ విధంగా అనిల్ కపూర్ నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. త్వరలోనే అనిల్ కపూర్ నటించిన సుబేదార్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు.

నా ఇంట్లోనే నాకు అభిమానులు లేరు..

ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా అనిల్ కపూర్ తనుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అనిల్ కపూర్ మాట్లాడుతూ తనుకు వివాహం జరిగి 41 సంవత్సరాలు అయినప్పటికీ తనకు పాకెట్ మనీ కావాలి అంటే తన భార్యను అడుగుతాను అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నా ఇంట్లో నాకు ఎవరు అభిమానులు లేరు.నేను ఈరోజు ఇంటి నుండి బయలుదేరుతుండగా, నేను ట్రైలర్ లాంచ్ కి వెళ్తున్నానని చెప్పగానే ఆమె ఏ సినిమా అంటూ నన్ను ప్రశ్నించింది. కనీసం నేను ఏ సినిమాలలో నటిస్తున్నాననే విషయం కూడా తన భార్యకు తెలియదని అనిల్ కపూర్ తెలిపారు.

భార్యను అడిగి డబ్బు తీసుకుంటా..

Advertisement

తాను షూటింగ్ కు వెళ్లాలనుకున్న లేదా పని నిమిత్తం బయటకు వెళ్లాలనుకున్న నా భార్య నుంచి డబ్బులు అడిగి తీసుకుంటానని చెప్పడంతో అభిమానులు విభిన్న రీతులో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో.. పెళ్లి జరిగి కూడా 40 సంవత్సరాలు అవుతుంది అలాంటిది ఈయన పాకెట్ మనీ కోసం భార్యను అడగడం ఏంటి అంటూ అభిమానులు కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది తమ సినిమా వ్యవహారాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో డబ్బుల విషయంలో పెద్దగా పట్టింపులు ఉండవని చెప్పాలి.

ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో అనిల్ కపూర్..

Advertisement

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి కూడా తన పాకెట్లో ఎప్పుడు డబ్బులు పెట్టుకోరని ఆయన బయటకు వెళ్తే మనమే బిల్ పే చేయాల్సి ఉంటుందని ఆయన భార్య రమ రాజమౌళి కూడా ఓ సందర్భంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి బాటలోనే అనిల్ కపూర్ కూడా పాకెట్ మనీ కూడా తన భార్య నుంచే తీసుకుంటారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అనిల్ కపూర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన పలు బాలీవుడ్ సినిమాలతో పాటు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న డ్రాగన్ సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.

Also Read: Virosh wedding: విరోష్ వెడ్డింగ్ ఉదయ్ పూర్ లో ల్యాండ్ అయిన వేద పండితులు..

Related News

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×