E-Paper
Advertisement

Virosh wedding: విరోష్ వెడ్డింగ్ ఉదయ్ పూర్ లో ల్యాండ్ అయిన వేద పండితులు..

Virosh wedding: విరోష్ వెడ్డింగ్ ఉదయ్ పూర్ లో ల్యాండ్ అయిన వేద పండితులు..
Advertisement

Virosh wedding: రష్మిక మందన్న విజయ్ దేవరకొండ మరికొన్ని గంటలలో ఒక్కటి కాబోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టకుండా ఏకంగా పెళ్లి గురించి అధికారకంగా తెలియజేశారు . గత ఏడాది అక్టోబర్ నెలలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే ఉదయ్ పూర్ లో వివాహపు వేడుకలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత రాత్రి సంగీత్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఇక నేడు హల్దీ మెహేంది వేడుకలు కూడా ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీ విజయ్ దేవరకొండ రష్మిక మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారు. వీరి వివాహపు వేడుక ఇరువురి సాంప్రదాయాల పద్ధతిలో జరగబోతున్నాయి.

ఉదయ్ పూర్ చేరుకున్న పండితులు…

మన హిందూ సాంప్రదాయ ఆచారాల ప్రకారం విజయ్ దేవరకొండ రష్మిక మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారు. హిందూ సాంప్రదాయాల పెళ్లి అంటే వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ పెళ్లి తంతు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ తమ పెళ్లి కోసం హైదరాబాద్ నుంచి పండితులను ఉదయ్ పూర్ పిలిపించారని తెలుస్తోంది. ఇప్పటికే వేద పండితులు ఉదయ్ పూర్ లో ల్యాండ్ అయ్యారు. ఇలా ఉదయ్ పూర్ ఎయిర్ పోర్టులో వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హిందూ సాంప్రదాయంగా విరోష్ వెడ్డింగ్..

Advertisement

ఇక విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు కూడా 26వ తేదీ రెండు సార్లు పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఉదయం విజయ్ దేవరకొండ సాంప్రదాయ ఆచారాల ప్రకారం వీరి వివాహతంతో జరగగా అదే రోజు సాయంత్రం రష్మిక కుటుంబ ఆచారాల నేపథ్యంలో వీరి పెళ్లి వేడుక జరగబోతుందని తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ 26వ తేదీ ఉదయం 8 గంటల సమయంలో రష్మిక మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారని తెలుస్తోంది. ఇక రష్మిక విజయ్ దేవరకొండ గీతగోవిందం సినిమా ద్వారా జంటగా వెండితెరపై సందడి చేశారు.

విరోష్ వెడ్డింగ్ లో ముఖేష్ అంబానీ?

Advertisement

ఈ సినిమా ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ జంట మళ్లీ డియర్ కామ్రేడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాల సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. ఇలా ఈ ప్రేమ కాస్త పెళ్లి పీటలు ఎక్కుతూ పెళ్లి బంధంతో వీరిద్దరూ ఒకటి కాబోతున్నారు. ఇక ఈ పెళ్లి వేడుకలో భాగంగా ఇప్పటికే పలువురు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు దర్శకులు హాజరవుతున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా అనంత్అంబానీ, అనిల్ అంబానీ కుటుంబ సభ్యులకు కూడ ఉదయపూర్ లో కనిపించిన సంగతి తెలిసిందే. అత్యంత సన్నిహితుల సమక్షంలో మాత్రమే ఈ పెళ్లి వేడుక జరగబోతోంది ఇక మార్చి 4వ తేదీ వీరి వివాహ రిసెప్షన్ ఎంతో ఘనంగా జరగబోతుంది. ఈ వివాహ రిసెప్షన్లో భాగంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మాత్రమే కాదు రాజకీయ నాయకులు,అభిమానులు కూడా హాజరు కాబోతున్నారు. ఇక ఈ వివాహ రిసెప్షన్ కి సంబంధించి ఆహ్వాన పత్రికలను కూడా అంద చేశారు.

Also Read: Vijay Rashmika sangeet: విజయ్ రష్మిక సంగీత్..ఫోటో గ్యాలరీతో లవ్ స్టోరీని బయటపెట్టారుగా?

Related News

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

Big Stories

Advertisement
×