E-Paper
Advertisement

Anil Ravipudi: ఆ క్షణాలు జీవితంలో మర్చిపోలేను ..  భగవంత్ కేసరి పై అనిల్ కామెంట్స్!

Anil Ravipudi: ఆ క్షణాలు జీవితంలో మర్చిపోలేను ..  భగవంత్ కేసరి పై అనిల్ కామెంట్స్!
Advertisement

Anil Ravipudi: అనిల్ రావిపూడి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల కాగా 11వ తేదీ నుంచి ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి .ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లను కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఈయనకు జననాయగన్ సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ సినిమా అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కూడా బాలయ్య సినిమాని పోలి ఉండడంతో ఇది పక్కా రీమేక్ అని అందరూ భావిస్తున్నారు.

బాలయ్య భగవంత్ కేసరి…

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయం ప్రస్తావనకు రావడంతో అనిల్ రావిపూడి భగవంత్ కేసరి (Bhagavanth Kesari)గురించి ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. అనిల్ రావిపూడి సినిమా అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు అనే సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా మాత్రం యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది పూర్తిగా తన జోనర్ నుంచి బయటకు వచ్చి అనిల్ రావిపూడి ఈ సినిమా చేయడమే కాకుండా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు(National Award) కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

నేషనల్ అవార్డు అందుకోవటం …

Advertisement

ఇలా నేషనల్ అవార్డు రావడం గురించి అనిల్ రావిపూడి స్పందిస్తూ.. తన సినీ కెరియర్ లో ఏ సినిమాకి కష్టపడిన విధంగా భగవంత్ కేసరి సినిమా కోసం కష్టపడ్డానని తెలిపారు. ఈ సినిమా తన జీవితంలో చాలా స్పెషల్ అని , ఈ సినిమాకు ఇలాంటి సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థాంక్స్ తెలిపారు. ఇక ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో చాలా సంతోషం అనిపించిందని ఆ క్షణం ప్రెసిడెంట్ చేతుల మీదుగా నేను నేషనల్ అవార్డు అందుకోవటం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని క్షణాలని అనిల్ రావిపూడి తెలియజేశారు.

వెంకటేష్ క్యామియో ..

Advertisement

ఇలా భగవంత్ కేసరి సినిమా గురించి బాలకృష్ణ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక బాలకృష్ణ నటించిన ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడి చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలనే పెంచేశాయి. ఇక ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో నటుడు విక్టరీ వెంకటేష్ కూడా నటించిన సంగతి తెలిసిందే.

Also Read: MSVPG film: ‘మనదే సంక్రాంతి’ లిరిక్ అందుకే మార్చారా ..ప్రభాస్ చెప్పాకే?

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×