E-Paper
Advertisement

The Pitt Season 2 on OTT : మోస్ట్ అవైటింగ్ ఇంటెన్స్ మెడికల్ డ్రామా షురూ… ఇండియాలో ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?

The Pitt Season 2 on OTT : మోస్ట్ అవైటింగ్ ఇంటెన్స్ మెడికల్ డ్రామా షురూ… ఇండియాలో ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?
Advertisement

The Pitt Season 2 on OTT : మెడికల్ డ్రామాగా రూపొందిన ‘ది పిట్’ అనే సిరీస్ అన్నీ వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అంతేకాదు 2025లో పలు కేటగిరీలలో ఎమ్మీ అవార్డులను గెలుచుకుని, అందరూ నోరెళ్ళబెట్టేలా చేసింది. దీంతో అందరి దృష్టి సీజన్ 2ప పడింది. ఎట్టకేలకు ఎంతగానో ఎదురు చూసిన ఏ సిరీస్ భారతదేశంలో విడుదలైంది. మరి సెకండ్ సీజన్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్ట్రీమింగ్ విషయంలో మేకర్స్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి ? అన్నది తెరపై చూడాల్సిందే.

‘ది పిట్ సీజన్ 2’ (The Pitt Season 2) మొదటి ఎపిసోడ్ జనవరి 9 నుండి Jio Hotstarలో స్ట్రీమింగ్ అవుతుంది. మిగిలిన పద్నాలుగు ఎపిసోడ్‌లు భారతదేశంలో ఇప్పటి నుంచి ప్రతి శుక్రవారం ఒక ఎపిసోడ్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశారు. 2026 ఏప్రిల్ 17న ‘ది పిట్ సీజన్ 2’ చివరి ఎపిసోడ్ రిలీజ్ కానుంది. అన్ని ఎపిసోడ్‌లలో పదిహేను గంటల షిఫ్ట్‌ను కవర్ చేశారు మేకర్స్. కాబట్టి ప్రతి ఎపిసోడ్‌ రన్ టైమ్ ఒక గంట వ్యవధి ఉంటుంది. ‘పిట్ సీజన్ 2’లో సీజన్ 1లో ఉన్న నటినటులే ఉన్నారు. నోహ్ వైల్, షాన్ హటోసీ, కేథరీన్ లానాసా, పాట్రిక్ బాల్, టేలర్ డియర్డెన్, ఇసా బ్రియోన్స్, ఫియోనా డౌరిఫ్, గెర్రాన్ హోవెల్, సుప్రియ గణేష్, షబానా అజీజ్ ప్రధాన పాత్రాధారులు.

సీజన్ 3పై హింట్

Advertisement

జనవరి 7న లాస్ ఏంజిల్స్‌లోని DGA థియేటర్‌లో సీజన్ 2 ప్రీమియర్ జరిగింది. ఈ సందర్భంగా ‘ది పిట్ సీజన్ ‘3’ గురించి మేకర్స్ ప్రకటించారు. అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయాన్ని మాత్రం సస్పెన్స్ లో ఉంచారు. అయితే 2027లో ఈ సిరీస్ వస్తుందని అనుకుంటున్నారు. కాగా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న రెండు సీజన్లు కూడా తెలుగులో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటిదాకా ఈ సిరీస్ ను చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి.

Read Also : 7 రోజుల్లో 440 కోట్లను కొల్లగొట్టే కథ… ఆండ్రియాను ఇలాంటి పాత్రలో అస్సలు ఊహించలేరు భయ్యా

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

సీజన్ 2 ఎపిసోడ్ 1లో స్టోరీ జూలై 4న ఉదయం 7 గంటల నుండి ఉదయం 8 గంటల షిఫ్ట్ గురించి ఉంటుంది. మొదటి గంటతో ప్రారంభమవుతుంది కథ. నోహ్ వైల్ పాత్ర డాక్టర్ రాబీ పిట్స్‌బర్గ్ ట్రామా మెడికల్ సెంటర్‌లో బిజీగా ఉండే వెయిటింగ్ రూమ్ ‌కు వెళతాడు. గాయపడిన రోగులకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అయితే సామూహిక కాల్పుల సమయంలో ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు డాక్టర్ రాబీ మెంటల్ గా డిప్రెషన్ కు గురవుతాడు. హోలీడే తీసుకోవడానికి ముందు చివరగా ఆయన ఒకసారి ERలోకి వెళ్ళి చూస్తాడు. ఎమర్జెన్సీ టైమ్ లో అక్కడ పరిస్థితులను చక్కబెట్టడానికి, ట్రీట్మెంట్ ఇవ్వడానికి తన బదులు మరో డాక్టర్ అల్-హషిమి ఇప్పటికే అక్కడికి వచ్చారని తెలుసుకుంటారు.

డాక్టర్ మైఖేల్ ‘రాబీ’ రోబినావిచ్, అతని టీం సీజన్ 1లో ఎన్నో క్లిష్ట సమయాలను ఎదుర్కొన్నారు. కానీ ఈసారి జూలై 4 కొత్తగా ఉండబోతోంది. ఈ షో గురించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పిట్ ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలపై దృష్టి పెడతాడు. అస్తవ్యస్తంగా ఉండే ఎమర్జెన్సీ గదిలో ప్రాణాలను కాపాడడంలో ఆయన ఒక్క నిమిషం కూడా వృధా చేయడు. పిట్స్‌బర్గ్ ట్రామా మెడికల్ సెంటర్ వైద్యులు, నర్సులు, ఆసుపత్రి నిర్వాహకులు, కేర్ టేకర్లతో పాటు మరి కొంతమంది ప్రాణాలను కాపాడటానికి ఒకరి తర్వాత మరొకరు సమయానుకూలంగా ప్రయత్నిస్తారు. క్షణక్షణం ఉత్కంఠ భరితంగా ఉండే ఈ సిరీస్ ను మెడికల్ డ్రామాలు ఇష్టపడే వారు అస్సలు మిస్ అవ్వొద్దు.

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×