E-Paper
Advertisement

అనిల్ రావిపూడికి ‘రామాయణం’ పిచ్చి.. అటు వెంకటేష్, ఇటు యానిమేషన్.. అసలు ఏం జరుగుతోంది?

అనిల్ రావిపూడికి ‘రామాయణం’ పిచ్చి.. అటు వెంకటేష్, ఇటు యానిమేషన్.. అసలు ఏం జరుగుతోంది?
Advertisement

Anil Ravipudi: అనిల్ రావిపూడి …ఒకటి కాదు రెండు కాదు పటాస్ (2015),సుప్రీమ్ (2016),రాజా ది గ్రేట్ (2017),ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్ (2019),సరిలేరు నీకెవ్వరు (2020),ఎఫ్ 3 (2022),భగవంత్ కేసరి (2023)సంక్రాంతికి వస్తున్నాం (2024)మన శంకర వరప్రసాద్ (2025) అంటూ ఏకంగా తొమ్మిది సినిమాలతో  సాలిడ్ సక్సెస్ చూడటంతో హిట్స్ కి కేరాఫ్ అయిపోయాడు. అయితే ఇదే ఊపులో మరిన్ని కమర్షియల్ సినిమాలని వెనకేసుకోవాల్సిన అనిల్ ఇపుడు కెరీర్ ని రిస్క్ లో వేసుకుంటున్నాడన్న టాక్ వినిపిస్తుంది.

కలిసొచ్చిన వెంకీ, లైఫ్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ కాంబోలో మల్టీ స్టారర్

Advertisement

అవును .. నిజానికి అచ్చొచ్చిన జానర్లో కలిసొచ్చిన వెంకీ, లైఫ్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ కాంబోలో ఓ నవ్వుల మల్టీ స్టారర్ ని మొదలెట్టేస్తున్నాడు అన్న వార్త అఫీషియల్ గా వచ్చేసింది, ఇక ఈ సినిమా వచ్చే పొంగల్ దంగల్ లో దిగుతుంది అన్న క్లారిటీ కుడా ఇచ్చేశాడు. దీంతో ఇంకేం వచ్చే సంక్రాంతికి మరోసారి నవ్వల వానలో తడవొచ్చు అని మురిసిపోయారంతా.అయితే ఇదిలా ఉండగానే తాజాగా ఇప్పుడు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసి ‘యానిమేషన్ రామాయణం’ కోసం తిరుగుతున్నాడన్న వార్తలు ఫిలిమ్ సర్కిల్స్ లో తెగ సర్క్యులేట్ అవుతున్నాయ్.

ఫుల్ ఫామ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి ఫైనల్

Advertisement

దీనికి తోడు ఈ యానిమేషన్ రామాయణం కోసం ‘హనుమాన్’, ‘మిరాయ్’ సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరిని ఫైనల్ చేశారన్న వార్తలు వినిపిస్తుంటే అనిల్ ఫోకస్ మల్టీస్టారర్ సినిమా మీద కన్నా ఈ యానిమేషన్ సినిమా మీదే ఎక్కువగా ఉందా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.దీంతో మల్టీ స్టారర్ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చక చక పూర్తి చేసి జూన్ కల్లా సెట్స్ పైకి వెళ్లాల్సిన అనిల్, ఇప్పుడు యానిమేషన్ టీమ్స్‌తో సీక్రెట్ గా సిట్టింగ్స్ వేస్తున్నాడన్నకామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

also read:అక్కినేని కాంపౌండ్‌లోకి మళ్ళీ సమంత? విడాకుల తర్వాత కూడా సుప్రియ కోసం ఇలా! నెట్టింట రచ్చ లేపుతున్న సామ్ పోస్ట్!

క్రేజ్ అంతా బూడిదలో కలవడం ఖాయం

మరో వైపు ఇప్పటికే బాలీవుడ్‌లో రణబీర్ కపూర్ ‘రామాయణ్’ పై భారీ అంచనాలున్న సంగతి తెల్సిందే. అలాంటిది ఈ సమయంలో ఈ  యానిమేషన్ వెర్షన్ గోలెందుకు హ్యాపీగా పట్టున్న కామెడీ సినిమాలు చేసుకోకుండా అంటూ హెచ్చరిస్తున్నారు ట్రేడ్ పండిట్స్. అయితే ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ టచ్ చేయని ఒక క్రేజీ చాప్టర్ ని ఇందుకోసం అనిల్ ఎంచుకున్నాడని హైప్ వస్తున్నా.. తేడా కొడితే ఉన్న క్రేజ్ అంతా బూడిదలో కలవడం ఖాయం. బహుశా మహావతార్ నరసింహ  సక్సెస్ ఇచ్చిన జోష్ వల్ల అనిల్ ఇలాంటి సినిమాపై మనసు పడుతున్నాడేమో కాబోలు. కాని ఆల్ రెడీ ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ ని మీద ఎత్తుకోవడం ఎందుకన్నది వెంకీ ఫ్యాన్స్ ని వేదిస్తున్న ప్రశ్న.

కాంబో ఇమేజ్ డామేజ్ అయినట్టే

ఇక ఇప్పటికే వెంకీ, కళ్యాణ్ రామ్ ల సినిమా 2027 సంక్రాంతికి అని అనౌన్స్ చేశారు కూడా. ఇలాగే అనిల్ యానిమేషన్ రామాయణ అంటూ చక్కర్లు కొడితే సినిమా పొంగల్ రేసు నుండి తప్పుకోవాల్సిందే.అదే జరిగితే మాత్రం కాంబో ఇమేజ్ డామేజ్ అయినట్టే.మరి ‘డ్రీమ్ ప్రాజెక్ట్’ అంటూ అనిల్ చేస్తున్న ఎక్స్పరిమెంట్ కి వెంకీ కళ్యాణ్ రామ్ లు సపోర్ట్ చేస్తారా లేక  అనిల్ తన స్ట్రాటజీని మార్చుకుని మల్టీ స్టారర్ వైపు మొగ్గు చూపుతాడా అన్నది వేచి చూడాలి !

also read:ప్రభాస్‌ను వదలని టెన్షన్.. ‘ఫౌజీ’ షూటింగ్‌లో హడావిడి.. ప్లాన్ రివర్స్ అయితే పరిస్థితి ఏంటి?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×