E-Paper
Advertisement

చైనా ఎంట్రీతో మారిన యుద్ద ముఖచిత్రం.. తెరవెనుక ఏం జరిగింది?

చైనా ఎంట్రీతో మారిన యుద్ద ముఖచిత్రం.. తెరవెనుక ఏం జరిగింది?
Advertisement

China Diplomacy: ఇరాన్-అమెరికా యుద్ధం జరిగినంత కాలం, టెహ్రాన్ కీలక మిత్రదేశాల్లో ఒకటైన చైనా.. నిశ్శబ్ద పాత్ర పోషించింది. కానీ, చైనా రహస్య దౌత్యం, చివరి నిమిషంలో జోక్యం వల్లే.. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో.. పాకిస్థాన్ పాత్రధారి అయితే.. దాని వెనకున్న సూత్రధారిగా, అసలైన శక్తిగా చైనా అవతరించింది.

తెరవెనుక పావులు..

అంతర్జాతీయ దౌత్యంలో పైకి కనిపించేదొకటి! తెర వెనక జరిగేదొకటి! ఇరాన్‌-అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలోనూ అదే రిపీటైంది. ప్రపంచం మొత్తానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించినట్లు కనిపిస్తున్నా.. తెరవెనుక పావులు కదిపి, ఒప్పంది ఓ కొలిక్కి తెచ్చింది మాత్రం చైనానే! కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోతే.. రాత్రికి రాత్రే ఓ నాగరికత మొత్తం అంతమైపోతుందని హెచ్చరించారు ట్రంప్. అయినాసరే, ఇరాన్ వెనక్కి తగ్గలేదు. అమెరికాతో అన్ని రకాల దౌత్య సంబంధాలను తెంచుకున్నట్లు ప్రకటించింది. యుద్ధం తీవ్ర రూపం దాల్చడం ఖాయమనుకుంటున్న సమయంలో.. ఆశ్చర్యకర నిర్ణయం బయటకొచ్చింది. ట్రంప్ హెచ్చరించిన 10 గంటల తర్వాత.. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. చమురు రవాణాకు కీలక మార్గమైన.. హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు కూడా ఇరాన్ అంగీకరించింది. మరి.. ఆ 10 గంటల్లో ఏం మారింది? చివరి నిమిషంలో జోక్యం చేసుకున్న చైనా.. ఈ ఒప్పందు కుదిరేందుకు ఏం చేసింది?

చర్చల వెనుక చైనా..

Advertisement

నెలరోజులకు పైగా సాగిన యుద్ధంలో, చైనా సైలెంట్‌గానే అన్నీ నిశితంగా గమనిస్తూ వస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్.. మద్దతు కోసం చైనాని సంప్రదించిన తర్వాతే.. డ్రాగన్ ఈ వ్యవహారంలోకి ఎంటరైంది. ఇదే.. చైనాకు శాంతిదూత పాత్ర పోషించే అవకాశాన్ని కల్పించింది. ఇప్పుడు, కాల్పుల విరమణ ఒప్పందం వెనుక చైనాయే కీలక మార్గనిర్దేశక శక్తి అని తెలిసేలా చేసింది. చర్చల వెనుక చైనా ఉందని.. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అన్నారు. కానీ, అధికారిక ప్రకటనలో మాత్రం బీజింగ్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం.. పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఫీల్డ్ మార్షల్ ఆసీమ్ మునీర్ పేర్లని మాత్రమే ప్రస్తావించారు. సీజ్‌ఫైర్‌కి సంబంధించిన పూర్తి ఘనతని పాకిస్థాన్‌‌కే కట్టబెట్టే ప్రయత్నం చేశారు. కానీ, ఈ ప్రాసెస్‌లో పాక్ కేవలం పాత్రధారి మాత్రమేనని, సూత్రధారి డ్రాగనే అని అంటున్నారు. ఇస్లామబాద్ కంటే తీవ్రస్థాయిలో బీజింగ్ సంబంధిత పక్షాలతో చర్చలు జరిపారంటున్నారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ.. ఇజ్రాయెల్, రష్యా, గల్ఫ్ దేశాలతో అనేకసార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు చైనా తెలిపింది.

Also read: కూటమిలో కాకరేపుతున్న జమ్మలమడుగు రాజకీయం.. ఆదినారాయణ రెడ్డి అసలు స్కెచ్ అదేనా..!

నౌకలకు రూట్ క్లియర్..

Advertisement

కాల్పుల విరమణ ఎపిసోడ్‌లోకి చైనా ఎందుకు ఎంట్రీ ఇచ్చిందనే అనుమానం అందరిలోనూ తలెత్తింది. కానీ, ఈ శాంతి చర్చల వల్ల చైనాకు అనేక అడ్వాంటేజెస్ ఉన్నాయ్. ఆ దేశ ఇంధన అవసరాలను 25 శాతం తీర్చే హర్మూజ్ జలసంధిలో చైనా నౌకలకు రూట్ క్లియర్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ సప్లై నిరాటంకంగా కొనసాగుతుంది. 80 శాతానికి పైగా ఇరాన్ చమురును.. చైనా చౌకగా కొనుగోలు చేస్తోంది. యుద్ధం తీవ్రరూపం దాల్చి ఆ సప్లై ఆగిపోతే.. చైనా ఇంధన భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే, ఈ చర్చల ప్రక్రియలో ముందు నుంచి డ్రాగన్ యాక్టివ్‌గా ఉంది. మిత్రదేశమైన ఇరాన్‌పైనా ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలో టర్కీ, ఈజిప్ట్ దేశాల సాయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

మూడేళ్ల క్రితం..

కొన్ని దశాబ్దాలుగా.. పశ్చిమాసియా రాజకీయాలను అమెరికానే శాసిస్తోంది. అయితే, ఈ మధ్యకాలంలో.. ఈ రీజియన్‌లో చైనా కూడా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. ఇరాన్‌తోనే కాదు.. సౌదీ అరేబియా సహా ఇతర ఇస్లామిక్‌ దేశాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంటోంది. మూడేళ్ల క్రితం సౌదీ అరేబియా-ఇరాన్‌ మధ్య సయోధ్య కుదిర్చి అందరినీ ఆశ్చర్యపరిచింది డ్రాగన్. ఇప్పుడు కూడా తన మిత్రదేశం పాకిస్థాన్‌ను ముందు పెట్టి, తెర వెనక మంత్రాంగం నడిపింది. పశ్చిమాసియాలో అమెరికా రాజకీయ ఆధిపత్యానికి గండి కొడుతూనే.. సొంత ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి డ్రాగన్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

Storey By: Anup Big Tv

Also read: హుజురాబాద్ డంపింగ్ యార్డ్ వద్ద బయటపడ్డ బిగ్ ఫైట్.. మీరిక మారరా..?

Related News

టంగ్ స్లిప్ప‌వుతుందా? ఓట‌మిని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారా? జ‌నాల‌ను కించ‌ప‌రిచేలా ఈ మాట‌లేలా?

ఆది నుంచి త‌ప్పట‌డుగులే.. వివాదాలే ఆమె దారి? ఇదీ కొండా సురేఖ వైఖరి!

ఇకపై అసమ్మతి గళాలకు బ్రేకులు… పరిపాలన పై రేవంత్ సర్కార్ మరింత పట్టు..

రేవంత్ నాయకత్వాన్ని బలపరిచేలా అధిష్టానం అడుగులు! ఢిల్లీ పెద్ద‌ల‌తో స‌త్సంబంధాల సంకేతాలు..!

సీఎంగా రేవంత్ ఉన్నంతకాలం కేసీఆర్ అసెంబ్లీకి రారు.. కేటీఆర్ క్లారిటీ!

లీ క్వాన్ యూ ఎవరు? కేసీఆర్‌ను ఆయనతో పోల్చిన కేటీఆర్‌.. అసలు కథ ఇదే!

మేమొచ్చినా.. వెంట‌నే హామీలు అమ‌లు చేయ‌లేం.. ! కుదురుకోవ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుందేమో..? ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేటీఆర్ కామెంట్స్‌..

ఎంపీ ధర్మపురి అరవింద్‌కు బిగ్ షాక్.. తిరగబడ్డ సొంత పార్టీ నేతలు!

Big Stories

Advertisement
×