E-Paper
Advertisement

Anil Ravipudi: మన శంకర వరప్రసాద్ గారు.. 20 ఏళ్ల తర్వాత ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్.. డైరెక్టర్ కామెంట్స్

Anil Ravipudi: మన శంకర వరప్రసాద్ గారు.. 20 ఏళ్ల తర్వాత ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్.. డైరెక్టర్ కామెంట్స్
Advertisement

Anil Ravipudi-MSVPG: సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టి ఫుల్ బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లో భారీ బజ్ ఉన్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంతో తెరకెక్కతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కి ఈ మూవీ సిద్దమౌతుంది. షూటింగ్ తోపాటు మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు అనిల్. 

ఫస్ట్ సింగిల్ భారీ రెస్పాన్స్

Advertisement

ఇక మధ్య మధ్యలో మూవీ అప్డేట్స్ వదులుతూ హైప్ పెంచుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ గారు మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ వదిలాడు. మొదటి నుంచి ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. చిరు బర్త్ డే సందర్భంగా వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ మరింత బజ్ పెరిగింది. ఆ తర్వాత వచ్చిన ఓ మీసాల పిల్ల పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. రోజుకో అప్డేట్ మూవీపై బజ్ పెరుగుతుంది. ముఖ్యంగా ఇందులో చిరు లుక్ మెగా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇస్తుంది.

వింటేజ్ చిరు చూడబోతున్నారు..

ఇందులో వింటేజ్ చిరు చూడబోతున్నామంటూ అభిమానులంత తెగ మురిసిపోతున్నారు. అలాంటి ఫ్యాన్స్ అనిల్ రావిపూడి ఇచ్చిన అప్డేట్ మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. తాజా ఓ ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ.. ‘మెగాస్టార్ చిరంజీవి నుంచి ఫ్యాన్స్ ఆశించిన ఫ్యామిలీ జానర్ వచ్చి చాలా కాలం అవుతుంది. అప్పట్లో చిరు నటించిన చట్టబ్బాయి,’రౌడీ అల్లుడు’, ‘దొంగ మొగుడు’, ‘యముడికి మొగుడు’ వంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఆడియన్స్ ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో యాక్షన్ తో పాటు కామెడీ కూడా హైలెట్ గా నిలిచాయి. చిరు నుంచి ఇలాంటి సినిమాలు వచ్చి రెండు దశాబ్ధాలు పైనే అవుతున్నాయి.

Advertisement

Also Read: Ram Pothineni : రామ్ ఆ తప్పు చేయడం వల్లనే, ఆంధ్ర కింగ్ కు తక్కువ కలెక్షన్లు

20 ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి సినిమా..

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటైర్టైనర్స్ వచ్చి రెండు డికెడ్స్ అవుతున్నాయి. ఇప్పుడు అలాంటి జానర్ లో మన శంకరవరప్రసాద్ గారు ఉండనుంది. అంటే 20 ఏళ్ల తర్వాత మెగాస్టార్ మళ్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారుఅంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇందులో విక్టరీ వెంకటేష్కామియో రోల్మరింత ప్రత్యేకంగా ఉండబోతుందట. మొత్తానికి మన శంకర వరప్రసాద్‌తో వచ్చే ఏడాది సంక్రాంతికి అనిల్రావిపూడి మెగా ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పర్ఫెక్ట్పండగ సందడి తీసుకురాబోతున్నారు. 2026 జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగాచిత్రంలో లేడీ సూపర్ స్టార్ట నయనతార హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×