Ram Pothineni-Andhra Kng Taluka: గత కొన్ని సంవత్సరాలుగా రామ్ పోతినేని కి సరైన హిట్ సినిమా లేదు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ చేసిన ఏ సినిమా కూడా ఊహించిన స్థాయిలో ఆడలేదు. మరోవైపు ఆ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా సక్సెస్ లేదు. వీరిద్దరూ కలిసి డబల్ ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేశారు అది కూడా మొదటి రోజే తేలిపోయింది.
అయితే ఈ రోజుల్లో ఒక సినిమాకి మంచి మౌత్ టాక్ వచ్చింది అంటే కలెక్షన్లు మెరుగు పడటం అనేది కామన్ గా జరుగుతుంది. అది చిన్న సినిమా అయినా కూడా, సినిమా బాగుంది అని టాక్ వస్తే కలెక్షన్లు ఏ రేంజ్ లో వస్తాయి అని మరోసారి ప్రూవ్ చేసింది రాజు వెడ్స్ రాంబాయి సినిమా. ఆ సినిమా రెండవ వారంలో కూడా తన స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్ వద్ద చూపిస్తుంది. రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈరోజుల్లో సినిమాకి పాజిటివ్ టాక్ రావడం అనేదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అయితే ఆ పాజిటివ్ టాక్ ని మనం ఎలా వాడుకున్నాం అనేది అసలైన టాస్క్. కిరణ్ అబ్బవరం నటించిన కే రాంప్ సినిమాకి మొదట పాజిటివ్ టాక్ రాలేదు.
కానీ హీరో శ్రీరాములు థియేటర్లోకి వెళ్లి సినిమా చూసి అక్కడ ప్రేక్షకులతో ఇంట్రాక్ట్ అవ్వడం వలన ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. ఆ తర్వాత విపరీతంగా పాజిటివ్ టాక్ మొదలైంది. ఇక రామ్ నటించిన ఆంధ్ర కింగ్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఆ పాజిటివ్ టాక్ ను చిత్ర యూనిట్ ఉపయోగించుకోవడంలో విఫలమైంది. ఈ సినిమాకి సంబంధించి సక్సెస్ ప్రెస్ మీట్ కూడా పెట్టారు కానీ హీరో హీరోయిన్ లేకపోవటం అనేది వెలితిగా అనిపించింది. సినిమా ఇక్కడ రిలీజ్ అయిన తరుణంలో ఇక్కడ బిజినెస్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఇండియా ప్రేక్షకులను వదిలేసి అమెరికా వెళ్లి సినిమాను ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ పాజిటివ్ టాక్ ఉన్నా కూడా హీరో అభిమానులకు అందుబాటులో లేకపోవడంతో మెరుగైన కలెక్షన్లు రావడం లేదు.
ఒకవేళ రామ్ పోతినేని ఇక్కడ ఉన్నట్లయితే కొన్ని థియేటర్లకు వెళితే అక్కడ ఆడియన్స్ రియాక్షన్స్ చూసి వాళ్లతో ఇంట్రాక్ట్ అవుతూ మాట్లాడితే ఇంకా సినిమా గురించి పబ్లిక్ అవుతుంది. చాలామంది థియేటర్ కు రావడానికి కూడా ఇష్టపడతారు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ కలెక్షన్లు మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కొంతమేరకు అంచనాలను నిలబెట్టుకుని గాని రామ్ కు కమర్షియల్ సక్సెస్ ఇచ్చిందా అని అడిగితే మాత్రం డౌటే. ఏదేమైనా అమెరికాలో ప్రమోషన్స్ కంటే కూడా రామ్ పోతినేని మరియు భాగ్యశ్రీ దిగిన ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. కొంతమంది వీళ్లు సినిమా ప్రమోషన్ కి వెళ్ళారా ప్రీ వెడ్డింగ్ షూట్ కి వెళ్ళారా అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు.