E-Paper
Advertisement

Husband Kills Wife: భార్యను చంపి సెల్ఫీ దిగిన భర్త.. మోసానికి మూల్యం చెల్లించుకున్నావ్ అంటూ క్యాప్షన్..

Husband Kills Wife: భార్యను చంపి సెల్ఫీ దిగిన భర్త.. మోసానికి మూల్యం చెల్లించుకున్నావ్ అంటూ క్యాప్షన్..
Advertisement

Husband Kills Wife: తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలో గగుర్పాటు కలిగించే దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం సాగిస్తోందని భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఆమెను నిర్దాక్షిణ్యంగా హత్య చేసి, అనంతరం ఆమె మృతదేహం పక్కనే కూర్చుని పోలీసులు వచ్చే వరకు అక్కడే ఉండిపోయాడు. అంతకుమించి, భార్య శవంతో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఈ ఘటనలో మరింత కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరునల్వేలి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాలమురగన్ అనే వ్యక్తికి, శ్రీప్రియతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులకు ఒక చిన్న కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంగా శ్రీప్రియకు ఇతర వ్యక్తితో సంబంధం ఉందని బాలమురగన్ తీవ్రంగా అనుమానించేవాడు. ఈ విషయంపై వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు, చెబుతున్నారు. అనుమానంతో బాలమురగన్, భార్యను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడని సమాచారం.

Advertisement

ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాటల తూటాలు కాస్తా చేతుల్లోకి వెళ్లడంతో కోపంతో బాలమురగన్ ఇంట్లో ఉన్న కొడవలిని తీసుకుని శ్రీప్రియపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె ప్రాణాలు పోయే వరకు పలు మార్లు నరికి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్రగాయాలతో రక్తపు మడుగులో శ్రీప్రియ అక్కడికక్కడే మృతి చెందింది.

భార్య మృతి చెందిన తరువాత కూడా బాలమురగన్ అక్కడి నుంచి పరారవ్వలేదు. పోలీసులు వచ్చేంత వరకు ఆమె మృతదేహం పక్కనే కూర్చుని ఉన్నాడు. అంతేకాకుండా, తన మొబైల్ ఫోన్‌తో భార్య శవంతో సెల్ఫీ తీసుకుని, దానిని తన సోషల్ మీడియా స్టేటస్‌గా పెట్టాడు. వంచనకు మరణమే మూల్యం అంటూ క్యాప్షన్ జోడించి ఆ ఫోటోను పోస్ట్ చేయడం స్థానికంగా షాక్‌కు గురి చేసింది. కొద్దిసేపటికే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.

Advertisement

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాలమురగన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి  తరలించారు. ఘటన జరిగిన ఇంటి పరిసరాలను సీజ్ చేసి, ఆధారాలను సేకరిస్తున్నారు. బాలమురగన్‌పై హత్య కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Also Read: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 11 మంది మృతి

ప్రాథమిక విచారణలో వివాహేతర సంబంధంపై అనుమానమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. బాలమురగన్ గత కొంతకాలంగా భార్యను అనుమానిస్తూ మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలమురగన్‌ను కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×