E-Paper
Advertisement

Anil Ravipudi: గట్టిగా అనుకోండి అయిపోద్ది.. ఆ స్టార్ హీరో సినిమా పై అనిల్ కామెంట్స్!

Anil Ravipudi: గట్టిగా అనుకోండి అయిపోద్ది.. ఆ స్టార్ హీరో సినిమా పై అనిల్ కామెంట్స్!
Advertisement

Anil Ravipudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయ మెరుగని దర్శకుల జాబితా తీస్తే ముందు రాజమౌళి పేరు ఉంటుంది అనంతరం అనిల్ రావిపూడి పేరు ఉంటుంది. కథ రచయితగా పనిచేస్తున్న అనిల్ రావిపూడి(Anil Ravipudi) పటాస్ సినిమా ద్వారా దర్శకుడుగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన అనంతరం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా ప్రతి ఏడాది ఒక్కో సినిమాని విడుదల చేస్తూ సూపర్ సక్సెస్ అందుకుంటున్న అనిల్ రావిపూడి ఏడాది సంక్రాంతి సందర్భంగా చిరంజీవి(Chiranjeevi)తో మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

నాగార్జునతో అనిల్ రావిపూడి..

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీ విడుదల అయిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబడుతోంది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అనిల్ రావిపూడి కెరియర్ కి సంబంధించి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. అనిల్ రావిపూడి ఇప్పటివరకు వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక మిగిలింది అక్కినేని నాగార్జున మాత్రమే ఈ నేపథ్యంలోనే అక్కినేని అభిమానులు కూడా నాగార్జునతో ఓ సినిమా చేసి సక్సెస్ ఇవ్వాలంటూ డిమాండ్లు చేస్తున్నారు.

గట్టిగా అనుకోండి అయిపోతుంది..

Advertisement

మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్స్ నుంచి ఇదే ప్రశ్న ఎదురయింది. ఇప్పటికే స్టార్ హీరోలైన వెంకటేష్ చిరంజీవి బాలకృష్ణ గారితో సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. దీంతో ఈ హీరోల అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి నాగార్జున గారితో సినిమా ఎప్పుడు చేస్తున్నారు అంటూ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు అనిల్ రావిపూడి సమాధానం చెబుతూ.. గట్టిగా అనుకోండి తధాస్తు దేవతలు ఉంటారు. తధాస్తు అంటే తప్పకుండా నాగర్జున గారితో సినిమా కూడా అయిపోతుంది అంటూ మాట్లాడారు.

బిగ్ బాస్ హోస్ట్ గా..

Advertisement

ఇలా అనిల్ రావిపూడి గట్టిగా అనుకోండి అంటూ చెప్పడంతో అతి త్వరలోనే నాగార్జున అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా రావడం ఖాయం అంటూ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగార్జున హీరోగా ఇప్పటివరకు 99 సినిమాలలో నటించారు. త్వరలోనే తన 100 వ సినిమాకి సంబంధించిన ప్రకటన రాబోతోంది. ఈ సినిమా నాగార్జున కెరియర్ లోనే ఎంతో స్పెషల్ గా ఉండబోతున్న నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలబడుతుంది. ఇక ఇటీవల ఈయన హీరోగా సినిమాలు చేయకపోయినా రజనీకాంత్ నటించిన కూలీ, ధనుష్ నటించిన కుబేర సినిమాలో కీలక పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఇలా సినిమాలతో పాటు బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా నాగార్జున బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: Anil Ravipudi:  అనిల్ రావిపుడికి గిఫ్ట్ గా ఫామ్ హౌస్.. జాక్ పాట్ కొట్టేసిన డైరెక్టర్?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×