E-Paper
Advertisement

Creator Studio: కంటెంట్ క్రియేటర్ల కోసం ఆపిల్ కొత్త స్టోడియో.. ఒకేచోట అన్ని సాఫ్టావేర్ టూల్స్..

Creator Studio: కంటెంట్ క్రియేటర్ల కోసం ఆపిల్ కొత్త స్టోడియో.. ఒకేచోట అన్ని సాఫ్టావేర్ టూల్స్..
Advertisement

Apple Creator Studio| సోషల్ మీడియా, వీడియో కంటెంట్ క్రియేటర్ల కోసం ఆపిల్ కంపెనీ కొత్తగా “క్రియేటర్ స్టూడియో” సర్వీస్ లాంచ్ చేసింది. ఈ సర్వీస్ వివిధ రంగాల్లో పనిచేసే క్రియేటివ్ ప్రొఫెషనల్స్ కోసం రూపొందించారు. క్రియేటివ్ పనులను సులభతరం చేయడమే దీని లక్ష్యం. ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో ఆపిల్ అనేక ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్ టూల్స్ యాక్సెస్ చేయవచ్చు. ప్రతి టూల్‌కు వేర్వేరుగా సబ్‌స్క్రిప్షన్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది గూగుల్ వన్, మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ వంటి సర్వీసుల తరహాలో ఒకే ప్లాన్‌తో అన్ని ప్రీమియం టూల్స్ ఇస్తుంది. సమయం, డబ్బు ఆదా చేయడమే ఆపిల్ ఈ సర్వీస్ లక్ష్యం.

ఆల్-ఇన్-వన్ సబ్‌స్క్రిప్షన్

క్రియేటర్ స్టూడియో ఒకే చెల్లింపుతో పనిచేస్తుంది. నెలవారీ, వార్షిక ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధర 12.99 డాలర్లు (సుమారు రూ. 1,173). సంవత్సరానికి 129 డాలర్లు (సుమారు రూ. 11,643). స్టూడెంట్స్, ఎడ్యుకేటర్లకు డిస్కౌంట్ ప్లాన్లు ఉన్నాయి. వారికి నెలకు 2.99 డాలర్లు (సుమారు రూ. 270) మాత్రమే. సంవత్సరానికి 29.99 డాలర్లు (సుమారు రూ. 2,706). ప్రస్తుతం ఒక నెల ఫ్రీ ట్రయల్ ఇస్తున్నారు. జనవరి 28, 2026 నుంచి సబ్‌స్క్రైబ్ చేయవచ్చు.

క్రియేటర్ స్టూడియోలో ఏ సాఫ్ట్‌వేర్ ఉన్నాయి?

Advertisement

ఈ సర్వీస్‌లో ఆపిల్ ప్రొఫెషనల్ అప్లికేషన్స్ ఉన్నాయి. వీడియో ఎడిటింగ్, ఆడియో ప్రొడక్షన్, డిజైన్ పనులకు ఉపయోగపడతాయి. ఫైనల్ కట్ ప్రోతో ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ చేయవచ్చు. లాజిక్ ప్రోతో అడ్వాన్స్‌డ్ మ్యూజిక్, ఆడియో ప్రొడక్షన్ సాధ్యమవుతుంది. పిక్సెల్‌మేటర్ ప్రోతో ఇమేజ్ ఎడిటింగ్ చేయవచ్చు. మోషన్‌తో మోషన్ గ్రాఫిక్స్ తయారు చేయవచ్చు. కంప్రెసర్ వీడియో, ఆడియో ఎన్‌కోడింగ్‌కు ఉపయోగపడుతుంది. మెయిన్‌స్టేజ్ లైవ్ ఆడియో పెర్ఫామెన్స్ మేనేజ్‌మెంట్‌కు సహాయపడుతుంది. ఇవన్నీ ఒకే చోట దొరుకుతాయి.

డివైస్ కంపాటిబిలిటీ, అందుబాటు

ఫైనల్ కట్ ప్రో, లాజిక్ ప్రో, పిక్సెల్‌మేటర్ ప్రో మాక్.. ఐప్యాడ్‌లలో పనిచేస్తాయి. మోషన్, కంప్రెసర్, మెయిన్‌స్టేజ్ మాక్ కంప్యూటర్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ ఈ టూల్స్‌ను స్మూత్ పర్‌ఫామెన్స్ ఆప్టిమైజ్ చేసింది. ఇంటెలిజెంట్ ఫీచర్లు, ప్రీమియం కంటెంట్ కూడా ఇస్తుంది.

Advertisement

Also Read: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం

క్రియేటర్ స్టూడియో ఎవరికి ఉపయోగకరం

ప్రొఫెషనల్ కంటెంట్ క్రియేటర్లు, ఫ్రీలాన్సర్లు ఈ సర్వీస్‌ను ఉపయోగిస్తే ప్రాజెక్టులు సులభంగా మేనేజ్ చేయవచ్చు. కొత్త క్రియేటర్లు కూడా హై-క్వాలిటీ కంటెంట్ సులభంగా తయారు చేయవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్లు మార్కెటింగ్ వీడియోలు, గ్రాఫిక్స్ చేయవచ్చు. స్టూడెంట్స్ చవక ధరలో ఇండస్ట్రీ-లెవల్ టూల్స్ ఉపయోగించవచ్చు. ఎడ్యుకేటర్లు టీచింగ్ కోసం ఉపయోగించవచ్చు. ఆపిల్ దీన్ని అడోబ్ క్రియేటివ్ క్లౌడ్‌కు పోటీగా తీసుకొచ్చింది.

క్రియేటర్ స్టూడియో ఎందుకు ముఖ్యమైనది?

ఈ సర్వీస్ సబ్‌స్క్రిప్షన్ గందరగోళాన్ని తగ్గిస్తుంది. మొత్తం సాఫ్ట్‌వేర్ ఖర్చు చాలా తగ్గుతుంది. ఆపిల్, క్రియేటివ్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేస్తుంది. క్రియేటర్లు క్రియేటివిటీపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు. ఆపిల్ దీర్ఘకాలిక క్రియేటివ్ యూజర్లను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×