Anil Ravipudi: చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు(MSVPG Film). చిరంజీవి నయనతార హీరో హీరోయిన్లుగా వెంకటేష్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఇలా ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు అనిల్ రావిపూడి దర్శకత్వంలో 9 సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాగా ఈ తొమ్మిది సినిమాలు కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి.
మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో మెగా అభిమానులు చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి చిత్ర నిర్మాతలు సాహు గారిపాటి, సుస్మిత కొణిదెలతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఇటీవల ఒక సినిమా సక్సెస్ అయ్యింది అంటే దర్శకుడికి నిర్మాతలు పెద్ద ఎత్తున ఖరీదైన గిఫ్టులు ఇస్తున్న సంగతి తెలిసిందే. మరి అనిల్ రావిపూడి గారికి మీరేమి ఇవ్వబోతున్నారు అంటూ యాంకర్ సాహుగారపాటి(Sahu Garipati)ని అడిగారు.
ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అండి. డైరెక్టర్ నాకు కొత్త కారు కొనిస్తారు అంటూ తెలియచేశారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా యుఎస్ ప్రీమియర్లు వన్ మిలియన్ దాటితే మీకు కారు కొనిస్తాను అంటూ అనిల్ రావిపూడి నాతో చెప్పారు. ఇప్పుడు అవి దాటాయి అందుకే ఆయన నాకు కారు కొనిస్తారు అంటూ సాహు గారపాటి ఈ సందర్భంగా తెలియజేశారు. మెగా అభిమానులు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. బాస్ సినిమాకు వన్ మిలియన్ ప్రీమియర్లు రాకపోవడమేంటన్న అనవసరంగా కారు బొక్క పెట్టుకున్నావు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
నాగార్జునతో అనిల్ రావిపూడి..
మరి అనిల్ రావిపూడి చెప్పిన విధంగానే నిర్మాతకు కారు కొనిస్తారా? లేదంటే సినిమా మంచి సక్సెస్ కావడంతో నిర్మాతల చేతులు మీదుగా డైరెక్టర్ ఖరీదైన కారుని గిఫ్టుగా అందుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇక అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాతో కూడా మంచి సక్సెస్ కొట్టడంతో ఈయన తదుపరి హీరో ఎవరు అనే విషయంపై చర్చలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలోనే అక్కినేని అభిమానులు నెక్స్ట్ నాగార్జునతో సినిమా చేసి మరో హిట్ అందించండి అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇప్పటివరకు చిరంజీవి ,వెంకటేష్, బాలకృష్ణతో సినిమా చేసే సక్సెస్ కొట్టిన అనిల్ రావిపూడి నాగార్జునతో కూడా సినిమా చేయాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు మరి అనిల్ తన పదవ సినిమా ఏ హీరోతో చేయబోతున్నారో అనేది తెలియాల్సి ఉంది.
Also Read; Kalki Part 2 Update: రాజా సాబ్ రిలీజ్.. కల్కి 2 పనులలో బిజీగా ప్రభాస్.. షూటింగ్ ఎప్పుడంటే?