E-Paper
Advertisement

Anil ravipudi: ఫ్లాప్ హీరోలకి అండగా అనిల్ రావిపూడి.. మరో సక్సెస్ వచ్చినట్టేనా?

Anil ravipudi: ఫ్లాప్ హీరోలకి అండగా అనిల్ రావిపూడి.. మరో సక్సెస్ వచ్చినట్టేనా?
Advertisement

Anil ravipudi:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫార్ములా తెలిసిన డైరెక్టర్గా అనిల్ రావిపూడి (Anil ravipudi) పేరు దక్కించుకున్నారు.. తన చిత్రాలతో వరుస సక్సెస్ లు తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న హీరోలను సక్సెస్ ట్రాక్ ఎక్కించడంలో కూడా దిట్ట అని ప్రూవ్ చేసుకుంటున్నారు. అందుకే అనిల్ రావిపూడితో సినిమా అంటే సక్సెస్ పక్కా అనే భరోసా కూడా ఇప్పుడు హీరోలలో కలుగుతోంది. అందులో భాగంగానే గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడ్డ కళ్యాణ్ రామ్ తో పటాస్ సినిమా చేసి ఆయన ఖాతాలోకి మంచి విజయాన్ని చేరవేయడమే కాకుండా ఆయనను సక్సెస్ ట్రాక్ ఎక్కించారు అనిల్ రావిపూడి.

ఫ్లాప్ హీరోలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన అనిల్ రావిపూడి..

పైగా అనిల్ రావిపూడికి పటాస్ సినిమా మొదటి సినిమా అయినప్పటికీ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే కళ్యాణ్ రామ్ కి కొత్త లైఫ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత రవితేజతో రాజా ది గ్రేట్ సినిమా చేశారు. అప్పటికే ఆయన దాదాపు 6 సినిమాలతో డిజాస్టర్ లను చవిచూసి ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ సినిమా చేసి ఊపిరి ఇచ్చారు అని చెప్పవచ్చు. అలాగే వెంకటేష్, వరుణ్ తేజ్ లకి కూడా ఎఫ్2 కంటే ముందే వరుస ఫ్లాప్ లు వారిని వెంటాడాయి. ఇక వారికి కూడా ఈ చిత్రంతో మంచి విజయం లభించింది. తర్వాత వెంకటేష్ 2024లో తన 75 వ చిత్రంగా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో సైంధవ్ సినిమా చేశారు. అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ ను చవిచూసింది. దీంతో సక్సెస్ కోసం ఎదురుచూసిన వెంకటేష్ తో గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసి మరో భారీ విజయాన్ని ఆయన ఖాతాలో చేర్చారు అనిల్ రావిపూడి.

మెగాస్టార్ కి కూడా అండగా నిలిచిన డైరెక్టర్..

Advertisement

ఇకపోతే యంగ్ హీరోలు, సీనియర్ హీరోలతో పాటు మెగాస్టార్ చిరంజీవికి కూడా మంచి విజయాన్ని అందించారు. చివరిగా భోళాశంకర్ సినిమాతో డిజాస్టర్ చూసిన చిరంజీవితో ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు సినిమా చేశారు అనిల్ రావిపూడి. వెంకటేష్ ఇందులో కీలక పాత్రలో నటించారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అలా కామెడీ మాత్రమే కాకుండా సామాన్య ప్రేక్షకులు కోరుకునే వినోదాన్ని పక్కాగా డెలివరీ చేయడం అనిల్ రావిపూడికి ఉన్న అతిపెద్ద బలం అనే చెప్పాలి.

త్వరలో మరో కొత్త ప్రాజెక్టు..

మొత్తానికైతే చేసింది అనిల్ రావిపూడి తక్కువ సినిమాలే అయినా ఫ్లాపుల్లో ఉన్న హీరోలను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తూ వారికంటూ మంచి విజయాలను అందిస్తూ.. సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నారు. ఏది ఏమైనా ఫ్లాప్ హీరోలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అనిల్ రావిపూడి త్వరలో మరో కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు అని తెలుస్తోంది.

హీరోలకే కాదు నిర్మాతలకి కూడా అండగా..

Advertisement

అనిల్ రావిపూడి హీరోలకే కాదు నిర్మాతలకు కూడా ఇప్పుడు లాభాలను అందిస్తున్నారు. అందులో భాగంగానే దిల్ రాజుకి కూడా వరుసగా భారీ లాభాలను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా అనిల్ రావిపూడి టాప్ హిట్ సినిమాలన్నీ కూడా దిల్ రాజు ప్రొడక్షన్లో వచ్చినవే కావడం గమనార్హం. అలా హీరోలకే కాకుండా నిర్మాతలకి కూడా లాభాలను అందిస్తూ పేరు ఉన్న దర్శకుడిగా దూసుకుపోతున్నారు అనిల్ రావిపూడి.

ALSO READ:MSVPG: బుక్ మై షోలో గంటలోనే సరికొత్త రికార్డ్.. ఇది కదా మెగా క్రేజ్!

Related News

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

Big Stories

Advertisement
×