E-Paper
Advertisement

MSVPG: బుక్ మై షోలో గంటలోనే సరికొత్త రికార్డ్.. ఇది కదా మెగా క్రేజ్!

MSVPG: బుక్ మై షోలో గంటలోనే సరికొత్త రికార్డ్.. ఇది కదా మెగా క్రేజ్!
Advertisement

MSVPG:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి (Chiranjeevi ) ఏడు పదుల వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. సంక్రాంతి సందర్భంగా రేపు థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే తాజాగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం అవ్వగా.. అందులో బుక్ మై షో లో ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది.

బుక్ మై షోలో సరికొత్త రికార్డ్..

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో బుక్ మై షోలో ఈ సినిమా మేనియా అన్ స్టాపబుల్ గా సాగుతోంది. కేవలం ఒక్క గంటలోనే ఏకంగా 13వేల టికెట్లు అమ్ముడయ్యి ఈ చిత్రం రికార్డు సృష్టించింది. ఇదిలా ఉండగా మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రీమియర్స్ ప్రారంభం కాబోతుండడంతో బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ మ్యాజిక్ రిపీట్ అవ్వడం ఖాయమని అటు ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. మొత్తానికైతే బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరి కొంత మంది ఇది కదా మెగాస్టార్ మేనియా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా బుక్ మై షో లో చిరంజీవి తన క్రేజ్ నిరూపించుకున్నారని చెప్పవచ్చు.

మన శంకర వరప్రసాద్ గారు సినిమా విశేషాలు..

Advertisement

ఓటమెరుగని దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తొలిసారి చేస్తున్న సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవితో మరో స్టార్ హీరో వెంకటేష్ కలసి నటిస్తున్నారు. అలాగే సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి ఆయన సరసన నటించబోతోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సైరా నరసింహారెడ్డి సినిమా వచ్చింది. అలాగే గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి సోదరి పాత్రలో నటించింది నయనతార. ఇప్పుడు మళ్లీ ఈ జంట తెరపైకి రాబోతుండడంతో అంచనాలు కూడా పెరిగిపోయాయి.

చిరంజీవి సినిమాలో అదిరిపోయే పాట పాడిన మేనకోడలు..

ఇకపోతే ఇప్పటివరకు మెగా కుటుంబం నుండి హీరోలు, నిర్మాతలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే ఇప్పుడు ఈ కుటుంబం నుంచి ఒక ఫోక్ సింగర్ కూడా అడుగు పెట్టింది. ఆమె మెగాస్టార్ చిరంజీవి సోదరి కూతురు. ఆమె ఒక ఫోక్ సింగర్. ఈ సినిమాలో చిరంజీవి కోసం తన గొంతును వినిపించిందని ముఖ్యంగా ఒక అద్భుతమైన పాట పాడిందని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత ఆ పాటను రిలీజ్ చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికైతే మెగాస్టార్ చిరంజీవి మేనకోడలు ఈ సినిమాలో పాట పాడిందని తెలిసి ఆ పాట కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Advertisement

ALSO READ:Samantha MIB: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తగ్గని సమంత జోరు.. టీజర్ ట్రైలర్ రికార్డ్!

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×