E-Paper
Advertisement

Telangana: భారీ కుంభకోణం.. భూభారతి చలాన్ల స్కామ్‌లో రైతులకు నోటీసులు.. ప్రభుత్వం సీరియస్

Telangana: భారీ కుంభకోణం.. భూభారతి చలాన్ల స్కామ్‌లో రైతులకు నోటీసులు.. ప్రభుత్వం సీరియస్
Advertisement

 

Telangana: తెలంగాణలో భూ భారతి స్టాంప్ డ్యూటీ అక్రమాలపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ప్రజలు చెల్లించిన సొమ్మును పక్కదారి పట్టించడంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనగాం సహా పలు జిల్లాల్లో భూభారతిలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో గత ఐదేళ్లలో జరిగిన లావాదేవీలపైనా పూర్తిస్థాయిలో ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆడిట్‌లో మొత్తం 52 లక్షల విలువైన లావాదేవీల్లో మొత్తం 4 వేల,800 లోపాలను అధికారులు గుర్తించారు. రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో 3 వేల లోపాలు ఉన్నట్లు వెల్లడైంది.

Advertisement

అయితే భూభారతి పోర్టల్‌లో సాంకేతిక లోపాలతో అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. మరోవైపు భూ భారతిలో ఆడిటింగ్ విధానం లేకపోవడమే ప్రధాన కారణంగాను గుర్తించారు. దీనిపై సీరియస్‌ అయిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. అక్రమాలకు సంబంధించిన సొమ్ము మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించారు. ఇటు అధికారుల పాత్రపైనా లోతైన విచారణ చేపట్టాలన్నారు. అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టి, కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా భూభారతి అమలులోకి వచ్చినప్పటి నుంచి అన్ని లావాదేవీలపై రాష్ట్రవ్యాప్తంగా ఆడిట్ చేయాలని ఆదేశించారు మంత్రి పొంగులేటి.

ఇదిలా ఉంటే.. జనగామ జిల్లాలో వెలుగు చూసిన భూ భారతి చలాన్ల స్కామ్ ఇప్పుడు సామాన్య రైతుల పాలిట శాపంగా మారింది. రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ ఫీజును కొందరు ఆన్‌లైన్ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వానికి జమ చేయకుండా గోల్‌మాల్ చేయడంతో, ఇప్పుడు ఆ భారాన్ని రైతులపైనే మోపుతున్నారు. తాజాగా జనగామ తహసీల్దార్ 10 డాక్యుమెంట్లకు సంబంధించి 8,55,577 రూపాయల లోటు రుసుమును వెంటనే చెల్లించాలంటూ క్రయవిక్రయదారులకు నోటీసులు జారీ చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Advertisement

భూభారతి చలాన్ల స్కామ్‌లో రైతులకు నోటీసులు

ఈ కుంభకోణం రైతులకు ఊహించని షాక్‌ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ సమయంలో తాము ఆన్‌లైన్ నిర్వాహకులకు పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించామని, వారు చేసిన మోసానికి ఇప్పుడు తాము ఎలా బాధ్యులమవుతామని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఆన్‌లైన్ సెంటర్ల నిర్వాహకులు నకిలీ చలాన్లతో ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించి సొమ్ము కాజేస్తే, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వారి నుంచి రికవరీ చేయాల్సింది పోయి, అమాయక రైతులపై ఒత్తిడి తీసుకురావడం ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు నిర్లక్ష్యానికి బలిపశువులమవుతున్నామంటున్న రైతులు..
అయితే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల పర్యవేక్షణ లోపం వల్లే ఈ అక్రమాలు జరిగాయని స్పష్టమవుతోంది. చలాన్లు సక్రమంగా ఉన్నాయో లేదో అప్పట్లోనే సరిచూసుకోవాల్సిన అధికారులు, ఏళ్ల తర్వాత ఇప్పుడు మేల్కొని రైతులకు నోటీసులు ఇవ్వడం వారి పనితీరుపై విమర్శలకు దారితీస్తోంది. అధికారుల నిర్లక్ష్యానికి, మధ్యవర్తుల ఆగడాలకు బలిపశువులమవుతున్నామని, తమ వద్ద అంత పెద్ద మొత్తంలో డబ్బులు లేవని రైతులు గొల్లుమంటున్నారు.

Also Read: సొంతగడ్డపై సంక్రాంతి సంబరం.. నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు

న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామంటున్న రైతులు.
అలాగే ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని రైతులకు ఊరటనివ్వాలని బాధితులు కోరుతున్నారు. ఈ స్కామ్‌కు బాధ్యులైన ఆన్‌లైన్ సెంటర్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారి ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వ ఖజానాకు మళ్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తాము భారీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతామని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.

Related News

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ముందు.. సీఎంపై చర్యలు తీసుకోవాలి.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ..

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

Big Stories

Advertisement
×