Anil Ravipudi : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి బ్రహ్మరథం పడితే ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయి అని ఆ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది.
గతంలో అలవైకుంఠపురంలో వంటి సినిమాలకు కూడా అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. ఇదంతా కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ వల్లనే. ఇక ప్రస్తుతం అదే టార్గెట్ తో సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు అనిల్ రావిపూడి.
మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో విక్టరీ వెంకటేష్ పాత్ర దాదాపు 20 నిమిషాల పాటు ఉండనుంది. ఈ విషయాన్ని అధికారికంగా అనిల్ రావిపూడి నేడు జరిగిన ఈవెంట్ లో కన్ఫామ్ చేశాడు. ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలని ఒకే చోట చూడటం అనేది ఒక కల అలా చూపించటం నాకు దక్కిన అదృష్టం అంటూ ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు అనిల్.
ఒక జనరేషన్ ను ఊపు ఊపిన స్టార్స్ ఇద్దరు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్. కొన్ని దశాబ్దాలుగా మనం వాళ్ళని చూస్తూ వస్తున్నాం. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీళ్లు నలుగురు కూడా ఇండస్ట్రీకి నాలుగు స్తంభాల లాంటివాళ్ళు వీళ్ళలో ఏ ఇద్దరు అయినా కూడా కలిసి కనిపిస్తే చూడాలి అనే డ్రీమ్ చాలా మందికి ఉంటుంది అది ఈ సినిమాతో నెరవేరుతుంది.
ఒక సినిమాకి విపరీతమైన బజ్ రావాలి అంటే ఆ సినిమాకి సంబంధించిన సాంగ్స్ ముందుగా హిట్ అవ్వాలి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా మంచి హిట్ అయింది అంటే కారణం ఆ సినిమా కంటే ముందు విడుదలైన గోదారి గట్టుపైన రామచిలకవే అనే పాట.
ఇకపోతే ఇప్పుడు ఈ సినిమాలో కూడా మీసాల పిల్ల అనే పాట విపరీతంగా పాపులర్ అయింది. రెండో సాంగ్ శశిరేఖ కూడా దాదాపు 20 మిలియన్స్ పైగా వ్యూ సాధించుకుంది మొత్తానికి ఈ రెండు పాటలకు కలిపి దాదాపు 100 మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి. దీనిని బట్టి ఈ సినిమాకి విపరీతమైన బజ్ క్రియేట్ అయిపోయింది అని చెప్పొచ్చు. ఇక సినిమా ఏ స్థాయి సక్సెస్ సాధిస్తుంది అనేది సంక్రాంతికి తేలుతుంది.
Also Read: Akhanda 2 : ఇండస్ట్రీలోనే అఖండ 2 సినిమాకు నెగిటివిటీ, బయట వాళ్ళ పరిస్థితి ఇదే