E-Paper
Advertisement

Medak Crime: అయ్యో పాపం.. ఎంత పని చేశావ్ దేవుడా…? రోడ్డు ప్రమాదంలో నలుగురు స్పాట్‌డెడ్

Medak Crime: అయ్యో పాపం.. ఎంత పని చేశావ్ దేవుడా…? రోడ్డు ప్రమాదంలో నలుగురు స్పాట్‌డెడ్
Advertisement

Medak Crime: మెదక్ జిల్లాలో పెను విషాదం నెలకొంది. ఓ గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక సంఘటన పెద్ద శంకరంపేట సమీపంలోని 161వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఓటు వేయడానికి వెళ్తుండగా మృత్యువు కబళించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మృతులు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగీ గ్రామానికి చెందిన లింగమయ్య, సాయమ్మ, వారి పిల్లలు మానస, సాయిగా గుర్తించారు. వీరంతా హైదరాబాద్‌లోని లింగంపల్లిలో నివాసం ఉంటున్నారు. స్వగ్రామంలో ఓటు వేసేందుకు తమ ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ఈ కుటుంబం, గమ్యస్థానానికి చేరుకోకముందే రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు వారిని కబళించింది.

Advertisement

ఘటనా స్థలిలో విషాద దృశ్యాలు

అతివేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ప్రమాద ధాటికి నలుగురూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. స్థానికులు గమనించి సమాచారం అందించే లోపే వారు తుదిశ్వాస విడిచారు. మృతదేహాలు రోడ్డుపై పడి ఉన్న తీరు చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఒకే కుటుంబంలోని నలుగురు మరణించడంతో మాగీ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ALSO READ: Pawan Kalyan: ఉదయం విజ్ఞప్తి సాయంత్రానికి రోడ్డు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×