E-Paper
Advertisement

CM Revanth vs Lionel Messi: సీఎం రేవంత్ అదిరిపోయే గోల్.. మెస్సీ చప్పట్లు

CM Revanth vs Lionel Messi:  సీఎం రేవంత్ అదిరిపోయే గోల్.. మెస్సీ చప్పట్లు
Advertisement

CM Revanth vs Lionel Messi: హైదరాబాద్ లో ఫుట్ బాల్‌ దిగ్గజం లియోనల్ మెస్సీ పర్యటన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ లియోనల్ మెస్సీ మధ్య మ్యాచ్ కూడా జరిగింది. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా నిర్వహించారు. అయితే సింగరేణి ఆర్ఆర్ జట్టు తరఫున బరిలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి పెనాల్టీ షూట్ ఔట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెనాల్టీ షూట్ ఔట్ లో అదిరిపోయే గోల్ కొట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ గోల్ చూసిన మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డిని అభినంధిస్తూ చప్పట్లు కొట్టి ప్ర‌శంసించారు. అనంతరం ఫుట్ బాల్‌ దిగ్గజం లియోనల్ మెస్సీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి కలిసి స్టేడియంలో కలియ తిరుగుతూ ఫ్యాన్స్ కు ఉత్సాహం తెప్పించారు.

Also Read: T20 World Cup 2026: అదంతా ఫేక్‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్ర‌సారాల‌పై ICC అదిరిపోయే ప్ర‌క‌ట‌న‌, 2027 వ‌ర‌కు ఢోకా లేదు

సీఎం రేవంత్ మనమడితో మెస్సీ ఫుట్‌బాల్

Advertisement

ఉప్పల్ అంతర్జాతీయ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ లియోనెల్ మెస్సీ ( CM Revanth vs Lionel Messi) మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనవడితో దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ మ్యాచ్ ఆడాడు. ప్లేయర్లందరితో సరదాగా లియోనెల్ మెస్సీ గడుపుతున్న సందర్భంగా, తన మనవడిని గ్రౌండ్ లోకి తీసుకువచ్చాడు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం బంతిని లియోనెల్ మెస్సీ వైపు తరలిస్తూ అద్భుతంగా ఆడాడు సీఎం రేవంత్ రెడ్డి మనవడు. అటు లియోనెల్ మెస్సీ కూడా రివర్స్ షాట్ ఆడుతూ అందరిని ఆకట్టుకున్నాడు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మనమడు, లియోనెల్ మెస్సీ మధ్య జరిగిన ఈ ఆసక్తికర సంఘటనను ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు.

ఉప్ప‌ల్ మ్యాచ్ విజేత ఎవ‌రంటే ?

ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ( Uppal International Cricket Stadium )  శనివారం జరిగిన ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ లో లియోనెల్ మెస్సీ జట్టు ఓడిపోయింది. లియోనెల్ మెస్సీ జ‌ట్టుపై 3-0 గోల్స్ తేడాతో సింగరేణి ఆర్ఆర్ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టడం జరిగింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక గోల్ కొట్టారు. ఈ మ్యాచ్ అనంతరం విన్నర్ తో పాటు ఓటమిపాలైన రన్నరప్ జట్లకు ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి తో పాటు రాహుల్ గాంధీ ట్రోఫీలు అందించారు. ఈ ట్రోఫీలు అందించిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీకి పదవ నెంబర్ జెర్సీ ని గిఫ్ట్ గా ఇచ్చాడు లియోనెల్ మెస్సీ.

Advertisement

Also Read: Messi Meets Revanth: నేడే రేవంత్ రెడ్డి వ‌ర్సెస్‌ మెస్సీ మ్యాచ్‌…షెడ్యూల్ ఇదే,ఒక్క‌ ఫోటోకు రూ.10 లక్షలు

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×