E-Paper
Advertisement

Jana Nayagan Release Date: ఇక ఈ సంక్రాంతి సెలవల్లో విజయ్ సినిమా లేనట్టే.. కోర్టులో ఏమైందంటే..

Jana Nayagan Release Date: ఇక ఈ సంక్రాంతి సెలవల్లో విజయ్ సినిమా లేనట్టే.. కోర్టులో ఏమైందంటే..
Advertisement

Jana Nayagan Release Date: తళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు తన చివరి సినిమాగా రాబోతున్న.. జననాయగన్ సినిమా.. ఇప్పటికీ విడుదల కాకుండా న్యాయపరమైన చిక్కుల్లో ఉంది. మొదట ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ సమస్యల కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. దీంతో అభిమానుల్లో ఆందోళన పెరిగింది.

జననాయగన్ సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వాలంటూ నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ మొదట కీలక ఆదేశాలు ఇచ్చింది. సెన్సార్ బోర్డు సినిమాకు క్లియరెన్స్ ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అంటే CBFC అసంతృప్తి వ్యక్తం చేసింది.

Advertisement

సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ CBFC మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. దీంతో సినిమా విడుదల మరింత ఆలస్యమైంది. తదుపరి విచారణను జనవరి 21కు వాయిదా వేస్తూ మద్రాస్ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉండగా..జననాయగం సినిమా నిర్మాతలు కూడా డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇంకా తేలాల్సి ఉంది. ఇదే సమయంలో CBFC కూడా సుప్రీంకోర్టులో కీలక అడుగు వేసింది. జననాయగం సినిమాపై సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది.

Advertisement

తమ వాదనలు వినకుండ ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని CBFC తన పిటిషన్‌లో కోరింది. అంటే నిర్మాతల పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదనలు కూడా వినాలని స్పష్టం చేసింది. దీంతో ఈ సినిమా వ్యవహారం న్యాయపోరాటంగా మారింది.

దళపతి విజయ్ రాజకీయాల్లోకి వెళ్లనున్న నేపథ్యంలో ఇది ఆయన చివరి సినిమా అని అభిమానులు భావిస్తున్నారు. అందుకే జననాయగం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ సెన్సార్, కోర్టు కేసుల వల్ల సినిమా ఎప్పుడు విడుదల అవుతుందన్నది ఇంకా స్పష్టత రావడం లేదు. జనవరి 21 తర్వాత వచ్చే తీర్పుపై అందరి చూపు నిలుచుంది.

అయితే జనవరి 9 విడుదల కావాల్సిన సినిమా ఏకంగా జనవరి 21 వరకు కూడా విడుదల కాదు అన్న కారికి మాత్రం అభిమానుల్లో వచ్చింది. ఈ క్రమంలో విజయ్ అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ సినిమా మరి ఎన్ని రోజులు పోస్ట్ పోన్ అవ్వడంతో ఈ చిత్రం రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న ఆందోళన అందరిలోనూ మొదలైంది. సంక్రాంతికి వచ్చుంటే సినిమా టాక్ యావరేజ్ గా ఉన్న.. ఈ చిత్రానికి తప్పకుండా బ్లాక్ బస్టర్ వసూళ్లు వచ్చుంటాయి. కానీ ఇప్పుడు జనవరి 21.. అంతే సంక్రాంతి సెలవులు అన్ని అయిపోయిన తరువాత ఈ చిత్రం విడుదలవుతుంది అన్న క్లారిటీ రావడంతో.. ఈ విషయం సినిమా కలెక్షన్స్ పై తప్పకుండా ప్రభావం చూపుతుంది అని భావిస్తున్నారు అందరూ.

ALSO READ: Mana Shankara Vara Prasad Garu: అమెరికాలో మెగాస్టార్ సినిమాకి ఇంత కష్టమా?

Related News

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

హైదరాబాద్‌లో ‘ఒడిస్సీ’ మూవీని ఎంజాయ్ చేయడానికి పెర్ఫెక్ట్ థియేటర్లు ఇవే, స్క్రీన్.. సౌండ్ అదుర్స్!

సెన్సార్ పూర్తి చేసుకున్న నయనతార ‘హాయ్’.. రిలీజ్ డేట్ లాక్!

Big Stories

Advertisement
×