Anil Ravipudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయమెరుగని దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఉన్నారు. ఇప్పటివరకు ఈయన తన సినీ కెరియర్ లో తొమ్మిది సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ తొమ్మిది సినిమాలు ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈయనకు ఇండస్ట్రీలో భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది ప్రతి ఒక్క హీరో కూడా అనిల్ రావిపూడితో సినిమా చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో కలిసి మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు మంచి సక్సెస్ కావడంతో అనిల్ రావిపూడి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటు సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అనిల్ రావిపూడి తన కాలేజీ చదివే రోజులను గుర్తు చేసుకున్నారు. ఈయన విజ్ఞాన్ వడ్లమూడి కాలేజీలో చదివిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తనతో పాటు టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రముఖ రాజకీయ నాయకుడు కేటీఆర్ కూడా అదే కాలేజీలో చదివారని తెలియజేశారు. మేమంతా ఓకే కాలేజీలో కలిసి చదువుకున్నామనే విషయాన్ని బయట పెట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఈ ముగ్గురిలో ఒకరు పొలిటికల్ లీడర్ కాగా మరొకరు పాన్ ఇండియా స్టార్ హీరో, మరొకరు స్టార్ డైరెక్టర్ గా కొనసాగడం విశేషం. ఇక కాలేజీలో అనిల్ రావిపూడి అల్లరి గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా జూనియర్ ఎన్టీఆర్ అనిల్ రావిపూడితో కలిసి చదువుకున్నారనే విషయం మాత్రం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక అనిల్ రావిపూడి సినీ కెరియర్ విషయానికి వస్తే చిరంజీవితో సూపర్ సక్సెస్ అందుకున్న ఈయన వచ్చే ఎడాది సంక్రాంతికి మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం అనే విషయాన్ని తెలియజేశారు.
వెంకటేష్ తో అనిల్ రావిపూడి సినిమా..
ఇలా వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా అనిల్ రావిపూడి సినిమా ఉంటుందనే విషయాన్ని తెలియజేయడంతో ఈయన తదుపరి సినిమా ఏ హీరోతో ఉండబోతుందనే విషయంపై ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి నాగార్జునతో చేయబోతున్నారంటూ వార్తలు రాగా వెంకటేష్ తోనే సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ చేయబోతున్నారంటూ కూడా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి అనిల్ రావిపూడి తదిపరి సినిమా ఏ హీరోతో ఉండబోతోంది అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.
Also Read: Rajinikanth Biopic: ఫైనల్లీ తెరపైకి రజనీకాంత్ బయోగ్రఫీ.. గుడ్ న్యూస్ చెప్పిన సౌందర్య!