E-Paper
Advertisement

IND VS NZ 4th T20: ఇండియా ముందు భారీ టార్గెట్…అభిషేక్ శ‌ర్మ డ‌కౌట్‌

IND VS NZ 4th T20: ఇండియా ముందు భారీ టార్గెట్…అభిషేక్ శ‌ర్మ డ‌కౌట్‌
Advertisement

IND VS NZ 4th T20: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 4th T20I) మధ్య ఇవాళ నాలుగోవ టి20 జరుగుతున్న సంగతి తెలిసిందే. విశాఖలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ( ACA-VDCA Cricket Stadium, Visakhapatnam) ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సూర్య కుమార్ యాదవ్ మొదట బౌలింగ్ చేయాలని ఎంచుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ లలో ఇండియానే సెకండ్ బ్యాటింగ్ చేసి విజయం సాధించింది. ఇదే ఫార్ములాను ఈ నాలుగవ టి20 లో కూడా అప్లై చేశాడు సూర్య కుమార్ యాదవ్. ఈ నేపథ్యంలోనే మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ఆడి, భారీ స్కోరు సాధించింది న్యూజిలాండ్. ఈ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు సాధించింది న్యూజిలాండ్.

Also Read: Abhishek Sharma vs Chris Gayle: అభిషేక్ శ‌ర్మ వ‌ర్సెస్ క్రిస్ గేల్..ఇందులో ఎవ‌రు రియ‌ల్ “యునివర్సల్‌ బాస్‌ “

చెల‌రేగిన న్యూజిలాండ్…ఇండియా ముందు భారీ టార్గెట్

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 4th T20I) మధ్య జరుగుతున్న నాల్గవ టి20 మ్యాచ్ లో కివిస్ భారీ స్కోర్ చేసిందని చెప్పవచ్చు. నిర్ణీత 20 ఓవ‌ర్లు ఆడిన న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టటానికి 215 పరుగులు సాధించింది.  మూడవ టి20 లో 156 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలో ఫినిష్ చేసింది టీమిండియా. ఈ భయంతో 200కు పైగా టార్గెట్ పెట్టాలని న్యూజిలాండ్ డిసైడ్ అయింది. ఆదిశగానే న్యూజిలాండ్ బ్యాటర్లు మొదటి నుంచి అటాకింగ్ చేశారు. ముందుగా డేవాన్ కాన్వే 44 పరుగులు సాధించగా మరో ఓపెన‌ర్ టీమ్ 62 పరుగులతో రెచ్చిపోయాడు. అటు గ్లెన్‌ ఫిలిప్స్ 24 పరుగులు సాధించగా న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ 39 పరుగులతో రాణించాడు. దీంతో టీమిండియా ముందు 216 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది న్యూజిలాండ్. ఇక ఈ మ్యాచ్ లో అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా బుమ్రా, రవి బిష్టోయ్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

అభిషేక్ శర్మ ( Abhishek Sharma Duck Out) మరోసారి డకౌట్

నాలుగోవ టి20 లో అభిషేక్ శర్మ దుమ్ము రేపుతాడు అనుకుంటే డకౌట్ అయ్యాడు. మొదటి బంతికే సిక్సర్ కోసం ప్రయత్నించిన అభిషేక్ శర్మను మ్యాట్ హెన్రీ ఔట్ చేశాడు. తొలి బంతికే డేవాన్ కాన్వేకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ డక్ అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా డీప్ ట్రబుల్ లో పడింది. అటు అభిషేక్ శ‌ర్మ డ‌కౌట్ కాగానే, మ‌రో వికెట్ కూడా కోల్పోయింది టీమిండియా. సూర్య కుమార్ యాదవ్ 8 బంతుల్లో 8 ప‌రుగులు సాధించి, వికెట్ కోల్పోయాడు.

Advertisement

Also Read: BAN PAK – T20 World Cup: PCB తిక్క కుదిర్చిన ఐసీసీ.. టీ20 ప్ర‌పంచ క‌ప్ లో పాకిస్తాన్ స్థానంలో బంగ్లాదేశ్ ఎంట్రీ ?

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×