E-Paper
Advertisement

Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమాకు క్రేజీ టైటిల్..వీడు మళ్ళీ మొదలెట్టాడురా బాబు!

Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమాకు క్రేజీ టైటిల్..వీడు మళ్ళీ మొదలెట్టాడురా బాబు!
Advertisement

Anil Ravipudi: సంక్రాంతి హిట్ మిషన్, సంక్రాంతి మెజీషియన్ అంటూ ఎన్నో బిరుదులు అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా అనిల్ రావిపూడి కెరియర్ లో ఇప్పటివరకు 9 సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాగా ఈ తొమ్మిది సినిమాలు కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి పదవ సినిమాపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.. అనిల్ రావిపూడి పదవ సినిమా ఎవరితో చేయబోతున్నారనే విషయంపై ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

అనిల్ రావిపూడి సినిమాకు క్రేజీ టైటిల్..

మరి కొద్ది రోజులలో అనిల్ రావిపూడి పదవ సినిమాకి సంబంధించి అధికారక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈయన నాగార్జునతో తన పదవ సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే నాగార్జునతో కాదని తిరిగి వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా సీక్వెల్ చేయబోతున్నారంటూ కూడా వార్తలు బయటకు వచ్చాయి. మరి అనిల్ రావిపూడి ఏ హీరోతో తన పదో సినిమాని చేయబోతున్నారనేది తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన పదవ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

టైటిల్ వింటే తిట్టుకోవడం ఖాయం..

Advertisement

నా 10వ సినిమాకి ఐడియా క్రాక్ చేసాను. టైటిల్ కూడా ఫిక్స్ అయిపోయాను… చాలా విచిత్రమైన టైటిల్ అది. ఈ సినిమాకు హీరో ఎవరు అనేది ఫిక్స్ అవ్వలేదు కానీ.. టైటిల్ మాత్రం ఫిక్స్ అయ్యానని, ఈ టైటిల్ క్రేజీగా ఉండబోతుందని అనిల్ రావిపూడి తెలిపారు. టైటిల్ అనౌన్స్ మెంట్ నుండే.. వీడు మళ్లీ మొదలెట్టాడురా బాబు అని అందరూ తిట్టుకోవడం ఖాయం. ఇక ఆ సినిమా కూడా 2027 సంక్రాంతి పండుగ సందర్భంగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియజేశారు. దీంతో అనిల్ రావిపూడి పదో సినిమాపై ఇప్పటికే భారీగా హైప్ పెరిగిపోయింది.

సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం…

Advertisement

అనిల్ రావిపూడి తన పదవ సినిమా సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ సినిమా ద్వారా రాబోతున్నారని ఈ సినిమాకు “సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం” అనే టైటిల్ పెట్టబోతున్నారు అంటూ ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. మరి ఈయన పదవ సినిమాని ఇదే టైటిల్ తో అనౌన్స్ చేయబోతున్నారా? లేదంటే మరో కొత్త సినిమాని ప్రకటించబోతున్నారా? అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. ఇక అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవితో చేసిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ కావడంతో అనిల్ రావిపూడి పై టాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Aamir Khan: మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన అమీర్ ఖాన్

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×