Anil Sunkara: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా సినిమా టికెట్లు ధర గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో విడుదలవుతున్న సినిమాలకు టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వాలు కూడా అనుమతి తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది సినిమా టికెట్ల ధరలు పెంచడంతో పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నారు. అయితే ఇప్పటికే ఎంతోమంది దర్శక నిర్మాతలు టికెట్ల రేట్లు పెంచడం గురించి మాట్లాడుతూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. తాజాగా నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara)సినిమా టికెట్ల ధరల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనిల్ సుంకర మాట్లాడుతూ.. సాధారణంగా కొన్ని సీజన్ లో ఉల్లిపాయ ధరలు భారీగా పెరుగుతాయి. కాని పెరిగిన ధరల గురించి ఎవరు మాట్లాడరు వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే ఎప్పుడో ఒకసారి పెంచే సినిమా టికెట్ల రేట్ల గురించి పెద్ద ఎత్తున డిబేట్ లు పెట్టి మరి చర్చలు జరుపుతుంటారని అనిల్ సుంకర ఏకంగా సినిమా టికెట్ల ధరలకు ఉల్లిపాయ ధరలకు ముడి పెడుతూ చేసిన ఈ వ్యాఖ్యలపై విభిన్న రీతిలో కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈయన ఏకే ఎటర్టైన్మెంట్ బ్యానర్ ద్వారా ఎన్నో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు .ఇక త్వరలోనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్న సంగతి తెలిసిందే.
ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శర్వానంద్ హీరోగా అబ్బరాజు దర్శకత్వంలో నారీ నారీ నడుమ మురారి (Nari Nari Naduma Murari)అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక సంక్రాంతి బరిలో ఎన్నో సినిమాలు ఉన్నప్పటికీ ఆ సినిమాలకు పోటీ ఇస్తూ శర్వానంద్ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ జోడిగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. జనవరి 15వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
జనవరి 14న ప్రీమియర్లు..
ఇలా జనవరి 15వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమాకు జనవరి 14వ తేదీ సాయంత్రం ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. సినిమా విడుదలకు కొద్ది రోజులు ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేస్తున్నారు . ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే నిర్మాత అనిల్ సుంకర వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా టికెట్ల రేట్లు పెరగడం గురించి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Drugs Case: డ్రగ్స్ కేసు వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన రకుల్ సోదరుడు అమన్!