E-Paper
Advertisement

Yuvraj singh: ఓడిపోవడానికి భయపడకండి.. ‘బిగ్ అకాడమి’ ప్రారంభోత్సవంలో విద్యార్థులకు యువరాజ్ సింగ్ సూచనలు

Yuvraj singh: ఓడిపోవడానికి భయపడకండి.. ‘బిగ్ అకాడమి’ ప్రారంభోత్సవంలో విద్యార్థులకు యువరాజ్ సింగ్ సూచనలు
Advertisement

Yuvraj singh: “ఓడిపోవడానికి ఎప్పుడూ భయపడకండి.. ఓటమి నుంచే గెలుపు విలువ తెలుస్తుంది. నా సక్సెస్ స్టోరీ కూడా ఎన్నో అపజయాల సమాహారమే..” అంటూ ప్రముఖ క్రికెటర్, బిగ్ అకాడమీ బ్రాండ్ అంబాసిడర్ యువరాజ్ సింగ్ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. హైదరాబాద్‌లోని నోవాటెల్ వేదికగా జరిగిన ‘బిగ్ అకాడమీ’ (Big Academy) ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.

విద్యార్థులను ఉద్దేశించి యువరాజ్  మాట్లాడుతూ.. “ఫెయిల్ అవ్వడం తప్పు కాదు (It is OK to fail). వైఫల్యం చెందకపోతే ఎలా గెలవాలో మీకు తెలియదు. నా ప్రయాణం కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ పునాదుల మీద సాగింది. ఆ అపజయాల నుంచే నా సక్సెస్ స్టోరీ బయటకు వచ్చింది. అందుకే ఓటమికి భయపడకండి.. మీ వంతు అత్యుత్తమ ప్రయత్నం (Give your best) చేయండి.” అని యువీ సూచించారు.

Advertisement

జీవితంలో ఒత్తిడి సర్వసాధారణమని యువరాజ్ అన్నారు. “మీరు చదువుతున్నా, ఆడుతున్నా లేదా ఉద్యోగం చేస్తున్నా.. ప్రెజర్ (Pressure) అనేది కచ్చితంగా ఉంటుంది. దాన్ని జయించడానికి ఉన్న ఏకైక మార్గం ‘ప్రాక్టీస్’. మీరు చిత్తశుద్ధితో సాధన చేస్తే ఫలితాలు కచ్చితంగా వస్తాయి.” అని తెలిపారు.

తల్లిదండ్రుల గురించి ప్రస్తావిస్తూ.. “మీ చదువుల కోసం మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. మీరు ఏ పని చేసినా దాన్ని ఆస్వాదిస్తూ (Enjoy what you are doing), మనసు పెట్టి చేయండి. లేదంటే ఆ పని చేయొద్దు.” అని విద్యార్థులకు హితవులికారు.

Advertisement

బిగ్ అకాడమీ ద్వారా విద్యార్థులకు మంచి జరగాలని, ఎడ్యుకేషన్, టెక్నాలజీలో ఈ సంస్థ వచ్చే 20 ఏళ్ల పాటు అద్భుతాలు సృష్టించాలని యువరాజ్ సింగ్ ఆకాంక్షించారు.

Read Also:  హైదరాబాద్‌లో ‘బిగ్ అకాడమీ’ గ్రాండ్ లాంచ్.. యువరాజ్ సింగ్ సందడి!

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×