E-Paper
Advertisement

Anirudh Ravichander: ఎంఎస్‌ సుబ్బలక్ష్మి బయోపిక్‌కు అనిరుద్ మ్యూజిక్, గౌతమ్ నిర్ణయం కరెక్టేనా?

Anirudh Ravichander: ఎంఎస్‌ సుబ్బలక్ష్మి బయోపిక్‌కు అనిరుద్ మ్యూజిక్, గౌతమ్ నిర్ణయం కరెక్టేనా?
Advertisement

Anirudh Ravichander: ‘మళ్లీ రావా సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు గౌతం. ఆల్మోస్ట్ సుమంత్ కెరియర్ అయిపోయింది అనుకునే తరుణంలో ఆ క్యూట్ లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. దర్శకుడుగా విపరీతమైన పేరు గౌతమ్ కు ఆ సినిమా తీసుకుని వచ్చింది. గౌతం తీసిన జెర్సీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నాని నటించిన ఆ సినిమా ఇప్పటికీ కూడా చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేస్తుంది. ఎమోషనల్ డైలాగ్స్ రాయడంలో గౌతమ్ నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసిన సినిమా జెర్సీ.

Advertisement

నాని కెరియర్ లో కూడా ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత నాని కొన్ని సినిమాలను ఎంచుకునే విధానం కూడా కంప్లీట్ గా మారిపోయింది. అటువంటి గౌతమ్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అంటే అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయాయి. విజయ్ దేవరకొండ హీరోగా కింగ్డమ్ అనే సినిమా చేశాడు గౌతమ్. ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.

మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్

అజ్ఞాతవాసి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంగీత దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనిరుద్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. గురూజీ గురూజీ అనుకుంటే గుణపం దించాడు అని చాలామంది త్రివిక్రమ్ ను కామెంట్ చేశారు. అనిరుద్ మ్యూజిక్ పైన కూడా అప్పట్లో చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఆ తరువాత జెర్సీ సినిమాతో అనిరుద్ మంచి పేరును సాధించుకున్నాడు. జెర్సీ సినిమా సక్సెస్ అయిన తర్వాత పెట్ట సినిమాలోని రజనీకాంత్ నా పని అయిపోయింది అనుకున్నారా అని అర్థం వచ్చి పిక్ కూడా ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. అప్పటినుంచి గౌతమ్ కి, అనిరుద్ కి మధ్య మంచి బాండింగ్ కుదిరింది. ఇక గౌతమ్ చేయబోయే అన్ని సినిమాలకు అనిరుద్ సంగీత దర్శకుడుగా ఉండబోతున్నట్లే తెలుస్తుంది.

Advertisement

Also Read: Bigg Boss 9 Winner: బిగ్‌ బాస్‌లో చరిత్ర సృష్టించిన కామనర్‌.. కళ్యాణ్‌ పడాలదే టైటిల్‌?

బయోపిక్ కి న్యాయం చేస్తాడా?

ప్రముఖ గాయని ఎమ్మెస్ సుబ్బలక్ష్మి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని బయోపిక్ సినిమా గౌతమ్ తీయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించి అనిరుద్ రవిచంద్రన్ కు సంగీతం అందిస్తారు. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ అంటే ఖచ్చితంగా సినిమాలో సంగీతం కీలకపాత్ర వహిస్తుంది. అయితే ఆ బయోపిక్ కి అనిరుద్ న్యాయం చేస్తాడా అనే ఆలోచనలు కూడా చాలా మందిలో మొదలయ్యాయి. అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో వాయిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ బయోపిక్ కు సంబంధించి మెలోడీస్ కీలకపాత్ర వహిస్తాయి అయితే వాటిని ఎలా డీల్ చేస్తాడు అనే క్యూరియాసిటీ కూడా చాలామందికి ఉంది.

Related News

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

Big Stories

Advertisement
×