E-Paper
Advertisement

Bigg Boss 9 Winner: బిగ్‌ బాస్‌లో చరిత్ర సృష్టించిన కామనర్‌.. కళ్యాణ్‌ పడాలదే టైటిల్‌?

Bigg Boss 9 Winner: బిగ్‌ బాస్‌లో చరిత్ర సృష్టించిన కామనర్‌.. కళ్యాణ్‌ పడాలదే టైటిల్‌?
Advertisement

Bigg Boss 9 Title Winner: మరికొద్ది గంటల్లో బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు ఎండ్‌ పడనుంది. ప్రస్తుతం ఈ ఫీనాలే ఎపిసోడ్‌ టీవీ ప్రసారం అవుతుంది. ఉత్కంఠ సాగుతున్న ఈసీజన్‌లో విన్నర్‌ ఎవరూ, టైటిల్‌ కొట్టుకుపోయేది ఎవరా ఆడియన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. ఈసారి సరికొత్తగా సామాన్యులకు ఎంట్రీ ఇచ్చింది బిగ్‌ బాస్‌ టీం. అగ్నీ పరీక్ష ద్వారా ఆరుగురు సామాన్యులను సెలబ్రిటీలకు పోటీ హౌజ్‌లోకి పంపించారు. అయితే ఏదో ఆడియన్స్‌ అటెన్షన్‌, షో పాపులారిటీ కోసమే సామాన్యులు తీసుకువచ్చారంటూ మొదట్లో అభిప్రాయాలు వెల్లువెత్తాయి.

సామాన్యుడిదే పై చేయి

Advertisement

ముందు కూడా సామాన్యులను సెలబ్రిటీలను ముందు తక్కువ చేస్తారనే టాక్‌ కూడా వచ్చింది. కానీ, అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. పోను పోను సామాన్యులే సెలబ్రిటీలను డామినేట్‌ చేసేలా షో నడిపించారు. మొత్తానికి రణరంగంగా సాగిన ఈ సీజన్‌కు నేటితో ఎండ్‌ కార్డు పడబోతుంది. ఈ సీజన్‌ టైటిల్‌ రేసులో సెలబ్రిటీలో తనూజ, కామనర్‌ నుంచి కళ్యాణ్‌ పడాల మధ్య పోటీ జరుగుతుంది. మొత్తానికి ఈసారి సెలబ్రిటీపై సామాన్యుడే పైచాయి సాధించేలా ఉన్నాడు. సోషల్‌ మీడియా టాక్‌, ఓటింగ్‌లో కళ్యాణ్‌ పడాల టాప్‌లో ఉన్నాడు. దీంతో ఈ సీజన్‌ టైటిల్‌ కళ్యాణ్‌ గెలిచేందుకు ఎక్కువ అవకాశం కనిపించింది. 

Also Read: Bigg Boss 9 Finale: రూ. 15 లక్షల సూట్‌కేస్‌తో డిమోన్‌ బయటకు.. ఇక టాప్‌2 వీరిద్దరే!

Advertisement

టైటిల్ గెలిచిన కళ్యాణ్

సోషల్ మీడియా బజ్‌ ప్రకారం బిగ్‌ బాస్‌9 టైటిల్‌ కళ్యాణ్‌ దే అంటున్నారు. అదే నిజమై ఈ సీజన్ విన్నర్ గా బిగ్ బాస్ లో చరిత్ర స్రష్టించిన కామనర్ కళ్యాణ్ పడాల నిలిచాడు. కాగా  కాసేటి క్రితమే టైటిల్‌ విన్నర్‌ షూటింగ్‌ పూర్తయ్యిందని తేలుస్తోంది. ఇందులో కళ్యాణ్‌ టైటిల్‌ గెలవగా.. తనూజ రన్నర్‌గా నిలిచింది. కాగా టాప్‌ 5లో కళ్యాణ్‌ పడాల, తనూజ, డిమోన్‌ పవన్‌, ఇమ్మాన్యుయేల్‌, సంజనలు ఉన్నారు. వీరిలో టాప్‌ 5 లీస్ట్‌లో ఉన్న సంజన హౌజ్ నుంచి బయటకు వచ్చింది. టాప్‌ 4లో ఇమ్మాన్యుయేల్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. ఇక టాప్‌ 3లో ఉన్న డిమోన్‌ పవన్‌ రూ. 15 లక్షల సూట్‌కేస్‌తో హౌజ్‌ని వీడాడు. టాప్‌ 2లో తనూజ, కళ్యాణ్‌లు టైటిల్ పోరులో నిలిచారు. ఈ రేసులో కళ్యాణ్‌ గెలిచి టైటిల్‌ అందుకున్నట్టు స్ట్రాంగ్‌ వినిపిస్తున్న టాక్‌. దీంతో టైటిల్‌ గెలుస్తుందనుకున్న తనూజ.. రన్నర్‌గా నిలిచింది.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×