E-Paper
Advertisement

OTT Movie : అమ్మాయి మిస్సింగ్ తో అరాచకం… సీను సీనుకో ట్విస్టు… ఈ సస్పెన్స్ థ్రిల్లర్ క్లైమాక్స్ కిరాక్

OTT Movie : అమ్మాయి మిస్సింగ్ తో అరాచకం… సీను సీనుకో ట్విస్టు… ఈ సస్పెన్స్ థ్రిల్లర్ క్లైమాక్స్ కిరాక్
Advertisement

OTT Movie : ఇన్వెస్టిగేటివ్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఇష్టపడని మూవీ లవర్స్ ఉండరేమో. ఊహించని ట్విస్టులతో ఆద్యంతం ఆసక్తికరమైన కథనంతో, ఎంగేజింగ్ గా ఉంటూ ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి ఈ జానర్లో ఉండే సినిమాలు. మీరు కూడా ఈ జానర్ అంటే క్రేజీగా ఫీల్ అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. మరి ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో ఉంది? అనే వివరాల్లోకి వెళ్తే…

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

డెనిస్ విల్లెన్యూవ్ దర్శకత్వం వహించిన ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ Prisoners (2013). తమ పిల్లల గురించి పేరెంట్స్‌కు వచ్చే భయంకరమైన కలలా ఉంటుంది ఈ మూవీ. హ్యూ జాక్మన్, జేక్ గిల్లెన్‌హాల్, వయోలా డేవిస్, మరియా బెల్లో, టెరెన్స్ హోవార్డ్, పాల్ డానో, మెలిస్సా లియో వంటి స్టార్ కాస్ట్‌తో ఈ సినిమాను మేకర్స్ అద్భుతంగా తీర్చిదిద్దారు. IMDbలో 8.రేటింగ్ ఉన్న ఈ మూవీ థ్రిల్లర్ ప్రియులకు మస్ట్ వాచ్. ప్రస్తుతం ఈ మూవీ Amazon Prime Videoలో రెంట్ బేసిస్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also :  ఆ అడవిలోకి అడుగు పెట్టే మగాడికి ఆడ దెయ్యం ఫిదా… 2 గంటల 29 నిమిషాల ఫ్యాంటసీ థ్రిల్లర్

కథలోకి వెళ్తే…

స్టోరీ పెన్సిల్వేనియాలో మొదలవుతుంది. కెల్లర్ డోవర్ (హ్యూ జాక్మన్) కుటుంబం థాంక్స్‌ గివింగ్ డిన్నర్‌కు తమ స్నేహితులు బర్చ్ ఫ్యామిలీ ఇంటికి వెళ్తారు. అక్కడ ఆడుకుంటున్న టైమ్ లో కెల్లర్ ఆరేళ్ల కూతురు అన్నా, ఆమె ఫ్రెండ్ జాయ్ అకస్మాత్తుగా అదృశ్యమవుతారు. చుట్టు పక్కల అంతా వెతికినా కూడా ఎక్కడా దొరకకపోవడంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. డిటెక్టివ్ లోకీ (జేక్ గిల్లెన్‌హాల్) ఈ కేసును దర్యాప్తు చేస్తాడు. వాళ్ళకి దొరికే ఏకైక క్లూ ఒక పాత RV వ్యాన్. దాన్ని డ్రైవ్ చేసిన అలెక్స్ జోన్స్ (పాల్ డానో) అనే యువకుడిని అనుమాతుడిగా పట్టుకుంటారు. కానీ ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో అలెక్స్‌ను వదిలేస్తారు. దిక్కుతోచని స్థితిలో కెల్లర్ కేసును తన చేతుల్లోకి తీసుకుంటాడు. డిటెక్టివ్ వదిలేసిన ఆ కుర్రాడిని కిడ్నాప్ చేసి, తన కూతురు ఎక్కడ ఉందో చెప్పమంటూ టార్చర్ చేస్తాడు.

Advertisement

మరోవైపు లోకీ ఇతర సస్పెక్ట్స్‌ను ట్రాక్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే షాకింగ్ సీక్రెట్స్‌ సీక్రెట్స్ బయట పెడతాడు. ఆ సీక్రెట్స్ ఏంటి? చివరికి కెల్లర్ కు కూతురు కొరికిందా? ఇంతకీ ఆమెను కిడ్నాప్ చేసింది ఎవరు? అనేడి తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. రోజర్ డీకిన్స్ సినిమాటోగ్రఫీ, డెస్పరేట్ ఫాదర్ పాత్రలో హ్యూ జాక్మన్ నటన అద్భుతంగా ఉంటాయి. ఇప్పటిదాకా ఈ మూవీని చూడకపోతే వెంటనే ఓ లుక్కేయండి మరి.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×