E-Paper
Advertisement

అనిరుధ్, కావ్య మారన్ లవ్ ఎఫైర్.. వైరల్ అవుతున్న క్రేజీ డీటెయిల్స్!

అనిరుధ్, కావ్య మారన్ లవ్ ఎఫైర్.. వైరల్ అవుతున్న క్రేజీ డీటెయిల్స్!
Advertisement

Kavya Anirudh : గ్లామరు ..రూమరు కవలపిల్లలు అన్నట్టుగా ఈ గ్లామర్ ఇండస్ట్రీలో రూమర్స్ ఏ రేంజ్ లో చక్కర్లు కొడతాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. సినిమాల్లో తప్ప బయట ఏ ఇద్దరు సెలెబ్రిటీలు కలిసి కనిపించినా ఎదో ఒక రూమర్ వినిపించడం సహజం.ఇక సినిమా ప్రపంచానికి, కార్పొరేట్ రంగానికి లింక్ పెడుతూ వచ్చే గాసిప్స్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి ఒక క్రేజీ న్యూసే ఇపుడు నెట్టింట్లో మంటలు పెట్టేస్తుంది. అవును.. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న అనిరుధ్ రవిచందర్,సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీని లీడ్ చేస్తూ నేషనల్ వైడ్ గా ఫేమస్ అయిన బిజినెస్ ఉమెన్ కావ్య మారన్, ప్రేమాయణం నడిపిస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. అంతే కాదండోయ్ ..ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ కోలీవుడ్ కోడై కూస్తుంది.

ఇద్దరి మధ్య పరిచయం ఎక్కడ

Advertisement

సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ వారసురాలైన కావ్య, కమర్షియల్ బిజినెస్ వైపు వెళ్లకుండా ఐపీఎల్ టీమ్ మేనేజ్‌మెంట్ బాధ్యతలను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తోంది. క్రికెట్ స్టేడియంలో ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌కి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది కూడా. మరోవైపు, 2012లో వచ్చిన ‘3’ సినిమాతో మ్యూజిక్ సెన్సేషన్‌గా మారిన అనిరుధ్, ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మోస్ట్ వాంటెడ్ కంపోజర్‌గా నిలిచాడు. మరి ఇంతటి క్రేజీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఈ ఇద్దరి మధ్య పరిచయం ఎక్కడ మొదలైందనే క్యూరియాసిటీ చాలా మందిలో కనిపిస్తుంది.

 కావ్య మారన్‌తో అనిరుధ్‌కు స్నేహం

Advertisement

నిజానికి సన్ పిక్చర్స్ బ్యానర్‌పై వచ్చే చిత్రాలకు అనిరుధ్ మోస్ట్ ప్రిఫర్డ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారడమే దీనికి కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘జైలర్’ (2023) సినిమాకు అనిరుధ్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. అంతకుముందు దళపతి విజయ్ ‘బీస్ట్’ (2022), ధనుష్ నటించిన ‘తిరుచిత్రంబలం’ (2022) వంటి చిత్రాలకు కూడా ఆయనే సంగీత దర్శకుడు. ఈ సినిమాల ప్రొడక్షన్ టైమ్‌లో, అలాగే ఆయా చిత్రాల సక్సెస్ మీట్స్ సందర్భంగా జరిగిన ప్రైవేట్ ఈవెంట్స్‌లోనే కావ్య మారన్‌తో అనిరుధ్‌కు స్నేహం ఏర్పడిందని, అది కాస్తా కాలక్రమేణా ప్రేమగా మారిందని ఇన్ సైడ్ ఇండస్ట్రీ టాక్.

also read :దృశ్యం 3 రివ్యూ… జార్జ్‌కుట్టి మైండ్ గేమ్ వర్కౌట్ అయిందా?

సైలెన్స్ వెనుక  బలమైన విషయం 

సాధారణంగా సెలబ్రిటీల లైఫ్‌పై వచ్చే ఇలాంటి వార్తలపై పిఆర్ టీమ్స్ వెంటనే రియాక్ట్ అవుతుంటాయి. కానీ ఈ ఇద్దరి మ్యారేజ్ మ్యాటర్ దేశవ్యాప్తంగా డిస్కషన్ అవుతున్నా.. అటు మారన్ ఫ్యామిలీ కానీ, ఇటు అనిరుధ్ పీఆర్ వర్గాలు కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు, అలాగని కనీసం ఖండించలేదు కూడా. దీంతో ఈ సైలెన్స్ వెనుక ఏదో బలమైన విషయమే ఉందంటూ లీకులు వెతుకుతున్నారు నెటిజన్లు.

పెళ్లి వార్తలపై ఎప్పుడు నోరు విప్పుతుందో

ఇక ప్రస్తుతం 35 ఏళ్ల వయసున్న అనిరుధ్, 33 ఏళ్ల కావ్య.. తమ కెరీర్‌లలో టాప్ పొజిషన్‌లో ఉన్నారనే చెప్పాలి. అనిరుధ్ చేతిలో ప్రస్తుతం రజిని జైలర్ 2 తో పాటు బన్నీ,లోకేష్ ల సినిమాలతో పాటు మరిన్ని బడా సినిమాలు లైన్లో ఉన్నాయి.మరోవైపు కావ్య మారన్ క్రికెట్ అప్‌డేట్స్, బిజినెస్ డీల్స్‌తో బిజీగా గడుపుతోంది.మొత్తానికి ఈ బిజీ షెడ్యూల్స్ మధ్యే ఈ ఏడాది (2026) ఆఖరి నాటికి వీరిద్దరి వెడ్డింగ్ బెల్స్ మోగబోతున్నాయని, అతి త్వరలోనే ఒక గ్రాండ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదా ఎంగేజ్‌మెంట్ వేడుక జరగనుందని ఇన్సైడ్ టాక్. చూడాలి మరి ఈ ‘క్రేజీ కాంబో’ పెళ్లి వార్తలపై ఎప్పుడు నోరు విప్పుతుందో !

also read :తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా!.. కారణం ఏంటంటే?

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×