E-Paper
Advertisement

ఫ్రిజ్‌లో ఏ ఆహారాన్ని ఏ షెల్ఫ్‌లో పెట్టాలి? 99 % మంది చేసే పొరపాట్లు ఇవే !

ఫ్రిజ్‌లో ఏ ఆహారాన్ని ఏ షెల్ఫ్‌లో పెట్టాలి? 99 % మంది చేసే పొరపాట్లు ఇవే !
Advertisement

Food Storage Tips: ఫ్రిజ్ ప్రతి ఇంట్లోనూ ఒక ముఖ్యమైన వస్తువుగా మారింది. పాలు, కూరగాయలు, పండ్లు, మిగిలిపోయిన ఆహార పదార్థాలు పాడైపోకుండా ఉండటానికి మనం ఫ్రిజ్‌ను వాడుతుంటాము. అయితే.. ఫ్రిజ్‌లో ఆహారాన్ని ఉంచితే అది ఎప్పటికీ సురక్షితంగా ఉంటుందని భావించడం పెద్ద పొరపాటు. ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో సరిగ్గా అమర్చకపోతే.. అది ప్రమాదకరమైన బ్యాక్టీరియాకు నిలయంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్, కడుపునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మీ ఫ్రిజ్ మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేయకుండా ఉండాలంటే ఆహారాన్ని ఎలా నిల్వ చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఫ్రిజ్‌లో ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలి ?

Advertisement

టాప్ షెల్ఫ్ లో ఏం పెట్టాలి?
ఫ్రిజ్ లోపల వేర్వేరు భాగాలలో ఉష్ణోగ్రతలు వేర్వేరుగా ఉంటాయి. ఫ్రిజ్‌లో పై భాగంలో ఉండే షెల్ఫ్స్ లో ఉష్ణోగ్రత చాలా స్థిరంగా ఉంటుంది. అందుకే.. వండాల్సిన అవసరం లేని, నేరుగా తినగలిగే ఆహార పదార్థాలను ఇక్కడ ఉంచాలి. ఉదాహరణకు.. ముందు రోజు వండిన కూరలు, మిగిలిపోయిన అన్నం, పెరుగు, చీజ్,ప్యాక్ చేసిన జ్యూస్ వంటి పదార్థాలను పై అరల్లో నిల్వ చేయాలి. అయితే వీటిని ఎల్లప్పుడూ మూతలు ఉన్న ఎయిర్ టైట్ కంటైనర్లలో మాత్రమే ఉంచాలి.

మిడిల్ , బాటమ్ షెల్ఫ్:
ఫ్రిజ్ మధ్య , కింది అరలలో చల్లదనం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రదేశాలలో పాలు, పాల పదార్థాలు, గుడ్లను నిల్వ చేయడం మంచిది. చాలా మంది గుడ్లను ఫ్రిజ్ డోర్ (తలుపు) లో ఉన్న ట్రేలలో పెడుతుంటారు. కానీ ఫ్రిజ్ తలుపును పదే పదే తీయడం వల్ల అక్కడ ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. ఇది గుడ్లు త్వరగా పాడైపోవడానికి కారణమవుతుంది. కాబట్టి గుడ్లను వాటి కార్టన్ బాక్స్‌తో సహా మధ్య షెల్ప్‌లో పెట్టడం మంచిది. అలాగే నాన్-వెజ్ (మాంసం, చికెన్, చేపలు) వండడానికి ముందు నిల్వ చేయాలనుకుంటే.. కింది అరలోనే ఉంచాలి. దీని వల్ల వాటి నుంచి వచ్చే నీరు కింద పడి ఇతర ఆహార పదార్థాలు కలుషితం కాకుండా ఉంటాయి.

Advertisement

వెజిటబుల్ క్రిస్పర్ ఉపయోగం:
ఫ్రిజ్ అడుగు భాగంలో ఉండే పెద్ద బాక్స్‌ను వెజిటబుల్ క్రిస్పర్ అంటారు. ఇది కూరగాయలు, ఆకుకూరలు , పండ్లలోని తేమ ఆరిపోకుండా తాజాగా ఉంచడానికి డిజైన్ చేయబడింది. అయితే.. కూరగాయలను, పండ్లను ఒకే బాక్స్‌లో కలిపి ఉంచకూడదు. ఆపిల్, మామిడి వంటి పండ్ల నుండి ‘ఇథిలీన్’ వాయువు విడుదలవుతుంది. ఇది పక్కనే ఉన్న ఆకుకూరలు, కూరగాయలు త్వరగా కుళ్ళిపోయేలా చేస్తుంది. కాబట్టి వీటిని విడివిడిగా ప్యాక్ చేసి ఉంచడం మంచిది.

ఫ్రిజ్ డోర్ లో ఏం పెట్టాలి?
రిఫ్రిజిరేటర్‌లోనే అత్యంత వేడిగా ఉండే భాగం ఫ్రిజ్ డోర్. తలుపు తీసిన ప్రతిసారీ బయటి గాలి దీనికి తగులుతుంది. అందుకే.. త్వరగా పాడైపోయే పాలు, గుడ్లు వంటి వస్తువులను ఇక్కడ అస్సలు పెట్టకూడదు. ఫ్రిజ్ డోర్ అరలలో కేవలం ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉండే వస్తువులను మాత్రమే ఉంచాలి. ఉదాహరణకు వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, వివిధ రకాల సాస్‌లు, జామ్‌లు, పచ్చళ్లను ఫ్రిజ్ డోర్ భాగంలో సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు.

జాగ్రత్తలు: 

ఫ్రిజ్‌ను ఎప్పుడూ పదార్థాలతో పూర్తిగా నింపేయకూడదు. లోపల గాలి ప్రసరణ సరిగ్గా జరగకపోతే.. చల్లదనం తగ్గి ఆహారం పాడవుతుంది. నెలకు కనీసం రెండు సార్లు ఫ్రిజ్ లోపలి భాగాలను బేకింగ్ సోడా నీటితో క్లీన్ చేయడం వల్ల బ్యాక్టీరియా, చెక్ వాసన రాకుండా ఉంటాయి. వేడి వేడి అన్నాన్ని లేదా కూరలను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలా చేయడం వల్ల ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రత పెరిగి, పక్కన ఉన్న ఇతర పదార్థాలు కూడా పాడైపోతాయి. వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్దకు చల్లబరిచిన తర్వాతే (కానీ వండిన రెండు గంటల లోపు) ఫ్రిజ్‌లో పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×