E-Paper
Advertisement

కొరటాల బాలయ్య కోసం అనిరుద్ ఫిక్స్.. తమన్ ను పక్కన పెట్టేశారా?

కొరటాల బాలయ్య కోసం అనిరుద్ ఫిక్స్.. తమన్ ను పక్కన పెట్టేశారా?
Advertisement

NBK 112: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆఖండ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ ఈ సినిమా వద్ద కాస్త నిరాశ ఎదుర్కొన్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఈయన వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నారు .ప్రస్తుతం గోపీచంద్ మలినేని (Gopi Chand Malineni)దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది ఈ సినిమాతో సమాంతరంగా మరో సినిమా షూటింగ్ పనులలో కూడా బాలకృష్ణ బిజీ కాబోతున్నట్లు సమాచారం. ఇటీవల బాలకృష్ణ తన 112 వ సినిమాని కొరటాల డైరెక్షన్లో చేయబోతున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

తమన్ ను పక్కన పెట్టిన బాలయ్య..

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమా బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మాణంలో నిర్మాణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలయ్యకు అనుగుణంగా కొరటాల శివ అద్భుతమైన కథను సిద్ధం చేశారని ఈ సినిమా కథ విన్నటువంటి బాలయ్య వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇక ఇటీవల ఈ సినిమాని అధికారకంగా ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ కూడా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం.

బాలయ్య కోసం రంగంలోకి అనిరుద్..

Advertisement

సాధారణంగా బాలకృష్ణ సినిమా అంటే అందరికీ ఎస్ఎస్ తమన్ (S.S Thaman)గుర్తుకు వస్తారు. ఇప్పటికే తమన్ బాలకృష్ణ కాంబినేషన్లో ఆరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బాలయ్య సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా తమన్ మారిపోయారు కానీ కొరటాల సినిమా విషయంలో మాత్రం తమన్ ను పూర్తిగా పక్కన పెట్టేసారని తెలుస్తోంది. బాలకృష్ణ కొరటాల సినిమా కోసం మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ (Anirudh Ravichandran)రంగంలోకి దించబోతున్నట్లు సమాచారం. కొరటాల డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవర సినిమాకు అనిరుద్ సంగీతం అందించారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య సినిమాకి కూడా అనిరుద్ సంగీతం అందించబోతున్నట్లు సమాచారం.

కొరటాల అంటే దేవిశ్రీ ఉండాల్సిందే..

Advertisement

సాధారణంగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే కచ్చితంగా దేవిశ్రీప్రసాద్ కొరటాల సినిమాకు దర్శకత్వం వహించాల్సిందే ఈయన డైరెక్షన్ లో వచ్చిన మిర్చి, శ్రీమంతుడు ,భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ వంటి సినిమాలకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు అయితే ప్రస్తుతం ఈయన హీరోగా సినిమా పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో అనిరుద్ దేవర సినిమా కోసం పనిచేశారు. ఇప్పుడు బాలకృష్ణ సినిమాకు కూడా అనిరుద్ బాణీలు అందించబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన వెల్లడి కాబోతుందని తెలుస్తోంది. ఇలా అనిరుద్ రంగంలోకి దిగడంతో తమన్ తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో రాబోతున్న సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

Also Read: రీ రిలీజ్ కు సిద్ధమైన రవితేజ కృష్ణ…ఆయన వల్లే కృష్ణ సాధ్యమైందన్న డైరెక్టర్?

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×