Travis Head On Psl: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) చివరి అంకానికి చేరుకుంది. రేపు ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లాహోర్ లోని గడాఫీ స్టేడియం ( Lahore, Gaddafi Stadium) వేదికగా జరగనుంది. ఈ ఫైనల్స్ లో మార్నస్ లాబుషాగ్నే ( MARNUS LABUSCHAGNE ) ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ కింగ్స్ మెన్, బాబర్ ఆజం కెప్టెన్ గా వ్యవహరిస్తున్న పెషావర్ జల్మీ ( Peshawar Zalmi) జట్లు తలపడతాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ పై వివాదాస్పద పోస్ట్ పెట్టాడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్. హైదరాబాద్ కింగ్స్ మెన్ జట్టు కెప్టెన్ మార్నస్ లాబుషాగ్నే చాలా స్ట్రాంగ్ అని… అతడి కష్టం వల్ల ఫైనల్ దాకా చేరుకున్నారని ప్రశంసల వర్షం కురిపించారు ట్రావిస్ హెడ్. పిఎస్ఎల్ ( PSL) టోర్నమెంట్ లో ఫైనల్ దాకా వెళ్లడం అద్భుతమే అని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ తరుణంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటును ఉద్దేశించి హెడ్ పోస్ట్ పెట్టడంపై సన్ రైజర్స్ హైదరాబాద్, ఇండియన్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. వెంటనే SRH నుంచి ట్రావిస్ హెడ్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో మరో అరాచకం.. డబ్బులు లేక ఆంటీలతో క్లీన్ చేయిస్తున్నారు, దొంగల్లా దూరేస్తున్నారు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) నేపథ్యంలో హైదరాబాద్ కింగ్స్ మెన్ ఫైనల్స్ కు చేరిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ యునైటెడ్ జట్టును చిత్తుగా ఓడించిన హైదరాబాద్… ఫైనల్స్ లోకి దూసుకువెళ్లింది. మార్నస్ లాబుషాగ్నే ( MARNUS LABUSCHAGNE ) కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఈ జట్టు.. ఫైనల్ కు చేరడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కెప్టెన్ మార్నస్ లాబుషాగ్నే పై ప్రశంసల వర్షం కురిపించాడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడుతున్న ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లాబుషాగ్నేను ప్రశంసించడం పట్ల ఇండియన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాకిస్తాన్ ( Pakistan) కోసం ఆడే ఎవడిని కూడా సపోర్ట్ చేయకూడదని పోస్టులు పెడుతున్నారు. ఒకవేళ పాకిస్తాన్ కు అనుకూలంగా ఏ ఒక్కరు ఉన్న వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇక మార్నస్ లాబుషాగ్నేపై ప్రశంసల వర్షం కురిపించినందుకు ట్రావిస్ హెడ్ పై ( Travis Head) కూడా వేటువేయాలని పోస్టులు వైరల్ చేస్తున్నారు. వెంటనే హైదరాబాద్ జట్టు నుంచి ట్రావిస్ హెడ్ ను కావ్య పాప తొలగించాలని కోరుతున్నారు. లేకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrishers hyderabad team) జట్టును బాయ్ కాట్ ( SRH Boycott) చేస్తామని హెచ్చరిస్తున్నారు.
Also Read: Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండగా రొమాన్స్..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైరల్
Travis Head's comment on a PSL Instagram post about Marnus Labuschagne. ❤️ pic.twitter.com/PBKEwhilOw
— Sheri. (@CallMeSheri1_) May 2, 2026