Getup Sreenu: గెటప్ శ్రీను జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం వెండి తెర సినిమాలలో నటిస్తూ ఏమాత్రం తీరికలేకుండా గడుపుతున్నారు. వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న గెటప్ శ్రీను (Getup Sreenu)మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఇటీవల గెటప్ శ్రీను మేము కాపులం(Memu copulam) అనే సిరీస్ విషయంలో పెద్ద ఎత్తున వివాదంలో నిలిచారు. ఈ టైటిల్ పెట్టడంతో వివాదం చెలరేగింది. ఇటీవల గెటప్ శ్రీను జాఫర్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో సంచలనగా మారింది.
గెటప్ శ్రీను నాగబాబు వంటి తదితరులు నటిస్తున్న సిరీస్ కు మేము కాపులం అనే టైటిల్ పెట్టినట్టు ఈయన తెలియచేయగా జాఫర్ స్పందిస్తూ ఈ టైటిల్ కరెక్ట్ కాదేమో అంటూ ప్రశ్నించారు. కులం పేరుతో సినిమాలు చేయడం ఏంటి ?ఇలాంటి టైటిల్స్ సమాజానికి ఏమి సందేశాన్ని ఇస్తున్నారు? ఈ టైటిల్ నాకు నచ్చలేదు? అంటూ జాఫర్ మొహం మీద చెప్పడంతో వెంటనే గెటప్ శ్రీను ఈ ఇంటర్వ్యూ నుంచి తాను వెళ్ళిపోతాను అంటూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోవడంతో ఈ వీడియో సంచలనంగా మారింది. ఇలా మేము కాపులం అనే టైటిల్ చుట్టూ తిరుగుతున్న ఈ వివాదానికి తెరపడిందని తెలుస్తోంది.
నిజానికి జీ తెలుగులో ప్రసారం కాబోయే ఈ సిరీస్ కి సంబంధించిన టైటిల్ మేము కాపులం కాదని క్లారిటీ ఇచ్చారు. ఈ సిరీస్ అసలు టైటిల్ “మేము COP లం” అని పెట్టినట్టు పేర్కొన్నారు. COP అంటే ఇంగ్లీషులో పోలీస్ అని అర్థం వస్తుంది. ఈ సిరీస్ మొత్తం ఇన్వెస్టిగేషన్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇలాంటి టైటిల్ పెట్టినట్టు గెటప్ శ్రీను క్లారిటీ ఇచ్చారు. ఈ సిరీస్ మొత్తం పోలీసుల చుట్టూ తిరుగుతుందని పోలీసులు తమ విధులలో భాగంగా ఎదుర్కొనే ఇబ్బందులను చూపించబోతున్నట్లు తెలిపారు. ఇలా ఈ రెండు పేర్లు పలకడానికి ఒకే విధంగా ఉండటతో మేము COP లం టీమ్ ఈ విషయాన్ని పబ్లిసిటీ కోసం చాలా చాకచక్యంగా వాడుకొని మేము కాపులం అంటూ ప్రమోషన్లను నిర్వహిస్తూ వారి సిరీస్ కి కావాల్సినంత బజ్ క్రియేట్ చేసుకున్నారు.
టైటిల్ వివాదానికి తెర పడినట్లే..
ఇక నిన్నటి నుంచి ఈ టైటిల్ వివాదానికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్లు సైతం రెండు భాగాలుగా విడిపోయి ఈ టైటిల్ విషయంలో విమర్శలు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా వార్ ప్రకటించారు. ఇలా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న నేపథ్యంలో టీం క్లారిటీ ఇచ్చారు.. ఇక ఈజ్ సిరీస్ లో గెటప్ శ్రీను పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సిరీస్ కు సంబంధించి ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటించబోతున్నట్టు సమాచారం.
Also Read: కొరటాల బాలయ్య కోసం అనిరుద్ ఫిక్స్.. తమన్ ను పక్కన పెట్టేశారా?