E-Paper
Advertisement

తమన్నా కాళ్ళు పట్టుకుంటానంటున్న బాలీవుడ్ స్టార్ ..కామెంట్స్ వైరల్

తమన్నా కాళ్ళు పట్టుకుంటానంటున్న బాలీవుడ్ స్టార్ ..కామెంట్స్ వైరల్
Advertisement

Annu Kapoor:నేను గనుక తప్పుగా మాట్లాడితే తమన్నా కాళ్లు పట్టికోవడానికైనా సిద్ధం” అంటున్నాడు బాలీవుడ్ సీనియర్ స్టార్ అన్నూ కపూర్. దీంతో ఈయనగారు తమన్నాని ఏమన్నాడో, అసలు కాళ్లు పట్టుకుంటానని ఎందుకు అంటున్నాడో అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారంతా. ఇంతకీ అన్నూ తమన్నాని ఏమన్నాడో చూద్దాం.

వయసు పెరిగినా బుద్ధి మాత్రం

Advertisement

తమన్నా భాటియా.. పరిచయం అక్కర్లేని పేరు. ఇక ‘ఆజ్ కి రాత్’ అంటూ ‘స్త్రీ 2’ మూవీలో స్టెప్పులేసి యూత్‌కి ముచ్చెమటలు ఎలా పట్టించిందో చెప్పక్కర్లేదు కూడా.అయితే అన్నూ కపూర్ ఈ పాట గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమన్నా చాలా తెల్లగా ఉంటుంది అంటూ కామెంట్స్ చేసుకొచ్చాడు. దీంతో ఒక అమ్మాయి అందాన్ని రంగుతో పోల్చడం ఏంటి, అన్నూ కపూర్‌కి వయసు పెరిగినా బుద్ధి మాత్రం పెరగలేదంటూ ఒక రేంజ్‌లో ఫైర్ అయ్యారు నెటిజన్లు.

ALSO READ :సామ్ ‘బంగారం’ అవుతుందా.. లేక మళ్ళీ ‘బిస్కెట్’ అవుతుందా? ఏడేళ్ల నిరీక్షణకు ఈసారి గ్యారెంటీ ఉందా?!

Advertisement

వావ్ వాటే మిల్కీ బాడీ

ఇక తనని సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేయడంతో కౌంటర్ ఇచ్చాడు అన్నూ కపూర్. తమన్నాని తాను “వావ్ వాటే మిల్కీ బాడీ” అని ఇంగ్లీష్‌లో మెచ్చుకుంటే అందరూ “వావ్ వాటే కాంప్లిమెంట్” అని అనేవాళ్లని, కానీ తను హిందీలో అనడం వల్లే నేనన్న మాట వాళ్లకి వల్గర్‌గా అనిపించిందని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడు.మనం మాట్లాడే భాష మారితే ఓపినియన్ మారిపోతుందా అంటూ సూటిగా క్వశ్చన్ చేశాడు అన్నూ.

కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పడానికైనా సిద్ధం

తన దృష్టిలో ఒకరి అందాన్ని మెచ్చుకోవడం తప్పు కాదని, క్రైమ్ అంతకన్నా కాదని, తన మనసులో అసలు ఎలాంటి తప్పుడు ఆలోచనలు లేవని క్లారిటీ ఇచ్చాడు. పనిలోపనిగా నేను అన్న మాటలు గనుక తమన్నాని బాధ పెట్టితే గనుక ఆమె కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పడానికైనా సిద్ధం అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశాడు.నాకు ఏమాత్రం అహంకారం లేదని, ఇక నా మనసులో తప్పుడు ఆలోచన అసలే లేనప్పుడు క్షమించమని అడగడానికి సిగ్గెందుకు అంటూ ఖరాఖండిగా చెప్పేశాడు అన్నూ కపూర్.

ఎందుకిలా ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నాం

దీంతో అన్నూ కపూర్ చెప్పింది కరెక్ట్ కదా.. ఇంగ్లీష్‌లో అంటే మామూలుగానే రియాక్ట్ అయ్యే మనం, ఇలా హిందీలో అంటే ఎందుకిలా ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నాం అంటూ కొంతమంది సపోర్ట్ చేస్తుంటే, క్లారిఫికేషన్ బాగుంది కాని కాళ్లు పట్టుకుంటానని అనడమే కాస్త అతిగా ఉంది అంటూ మరికొంత మంది నెగెటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక అన్నూ కపూర్ విషయానికి వస్తే ‘మిస్టర్ ఇండియా’ (1987), ‘విక్కీ డోనర్’ (2012), ‘జోలీ ఎల్.ఎల్.బి 2’ (2017), ‘డ్రీమ్ గర్ల్’ (2019), ‘డ్రీమ్ గర్ల్ 2’ (2023) వంటి ఎన్నో సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించి అలరించాడు.

మొత్తానికి తమన్నా అందం పై అన్నూ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.చూడాలి మరి ఈ కాళ్ల కామెంట్స్ పై మిల్కీ బ్యూటీ ఎలా రియాక్ట్ అవుతుందో!

ALSO READ :ఒకే దెబ్బకు రెండు పిట్టలు: అటు చిరు.. ఇటు బాలయ్య.. డింపుల్ క్రేజ్ మామూలుగా లేదుగా!

Related News

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

Big Stories

Advertisement
×