Samantha Comeback : ఏ మాయ చేశావే అంటూ టాలీవుడ్‌లో అడుగెట్టిన ఈ అమ్మడు నిజంగానే మాయ చేసేసింది. అలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా దశాబ్దం పాటు సౌత్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది. ఏ సినిమా చూసినా సామే అన్నట్టుగా ఉండేది. అలా హీరోయిన్స్ అందరిలో క్వీన్‌గా వెలిగిపోయిన ఈ చెన్నై చిన్నది, ఇప్పుడు ఒక సరైన హిట్ కోసం చకోర పక్షిలా ఎదురుచూడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ‘ఓ బేబీ’ అంటూ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసి ఏడేళ్లు గడుస్తున్నా, ఇప్పటికీ ఆ మ్యాజిక్ రిపీట్ కాకపోవడం గమనార్హం.
వరుస డిజాస్టర్స్
‘ఓ బేబీ’ తర్వాత సమంత చాలా ప్రయోగాలే చేసింది. ‘జాను’ అంటూ క్లాసిక్ రీమేక్‌ను టచ్ చేసి చేతులు కాల్చుకుంది. ఇక విజయ్ దేవరకొండతో కలిసి చేసిన ‘ఖుషీ’లో కెమిస్ట్రీ పండినా, కమర్షియల్‌గా అది ‘పర్లేదు’ అన్న టాక్ దగ్గరే ఆగిపోయింది తప్ప సూపర్ హిట్ కాలేకపోయింది.ఇక ‘యశోద’, ‘శాకుంతలం’ అంటూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తన మార్కెట్ పెంచుకోవాలని చూసిన ప్రతిసారీ బాక్సాఫీస్ వద్ద దెబ్బలు గట్టిగానే తగిలాయి. మరోవైపు పర్సనల్ లైఫ్‌లో డైవోర్స్, హెల్త్ ఇష్యూస్ వంటి ప్రాబ్లమ్స్‌తో బాగానే సఫర్ అయింది. మొత్తానికి మునుపటి క్రేజ్, చరిష్మా లేకుండా పోయింది.
‘మా ఇంటి బంగారం’ పెద్ద సవాల్
అయితే ఇవన్నీ ఇలా ఉండగానే గతేడాది చివర్లో రాజ్ నిడిమోరుతో సడన్‌గా పెళ్లి పీటలెక్కి ఒక్కసారిగా అందరికీ పెద్ద షాకే ఇచ్చింది సమంత. అయితే పెళ్లి తర్వాత ఆమె కెరీర్ గ్రాఫ్ మారుతుందని భావించిన వారికి ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ పెద్ద సవాల్‌గా కనిపిస్తోంది.రెండేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమాని సోషల్ మీడియాలో సెటైర్లు కూడా గట్టిగానే పడుతున్నాయి.“ఎన్ని రోజులు ఆ పాత నందిని రెడ్డి సెంటిమెంట్‌తోనే బండి లాగిస్తారు సామ్?” అంటూ పెదవి విరుస్తున్నారు కొందరు నెటిజన్లు.
also read :పర్ఫెక్ట్ మామిడి పండును ఎలా ఎంచుకోవాలో తెలుసా? అసలైన ట్రిక్స్ ఇవే!
ఈ ‘ఖిచిడీ’ వర్కవుట్ అవ్వకపోతే
సమంత నిర్మాతగా మారి తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పై తీస్తున్న ‘మా ఇంటి బంగారం’ టైటిల్ వినగానే 80ల నాటి ఫ్యామిలీ డ్రామా గుర్తొస్తోంది. ఇందులో ఆమె మధ్యతరగతి మహిళగా కనిపిస్తూనే యాక్షన్ చేస్తుందట.అంటే ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ స్ఫూర్తితో ఇంకో ప్రయోగం చేస్తున్నారా? లేక కొత్తగా ఏదైనా చూపిస్తారా? అన్నది ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న. ఒకవైపు యాక్షన్, మరోవైపు సెంటిమెంట్.. ఈ ‘ఖిచిడీ’ వర్కవుట్ అవ్వకపోతే సమంత కెరీర్‌కు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశాలే ఎక్కువ.
మే 15న రిలీజ్ కావడానికి రెడీ
ఇక ఈ సినిమా మే 15న రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది. ఒకవైపు యంగ్ హీరోయిన్ల పోటీ, మరోవైపు ఆడియన్స్ టేస్ట్ మారిపోవడం సమంతకు ఒకరకంగా మైనస్ అనే చెప్పాలి.హిట్ కోసం ఏడేళ్లు వేచి చూడటం అంటే అది చిన్న విషయం కాదు. నందిని రెడ్డి కాంబినేషన్ మీద ఉన్న నమ్మకం ఒక్కటే ఆమెను గట్టెక్కించాలి. లేదంటే మాత్రం నెట్టింట్లో పోస్టులకే సమంత పరిమితం కావాలి.
మరి ఈ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ దగ్గర అసలు బంగారంలా మెరుస్తుందా? లేదా మునుపటి సామ్ మళ్లీ తిరిగొస్తుందా లేదా అన్నది మే 15నే తేలిపోవాలి!
also read :పిచ్చెక్కిస్తున్న రాఖీ సావంత్.. ప్రియాంక చోప్రాను టార్గెట్ చేస్తూ ‘కుర్రాళ్ల’పై షాకింగ్ కామెంట్స్!