E-Paper
Advertisement

ఉద్యోగం కోల్పోయారా? పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చు?

ఉద్యోగం కోల్పోయారా? పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చు?
Advertisement

Lost Job PF Withdraw: లేఆఫ్ లేదా అనుకోని కారణాలతో ఉద్యోగం కోల్పోతే.. ఒక్కసారిగా ఆందోళన మొదలవుతుంది. ఇంటి రెంట్, నెలవారీ ఖర్చులు, పిల్లల చదువులు.. ఇలా అన్నీ భారమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది చేసే ఆలోచన పీఎఫ్ ఖాతా అమౌంట్ విత్ డ్రా. అనుకోని పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) విత్ డ్రా నిబంధనలను సులభతరం చేసింది. ఈపీఎఫ్ఓ ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతా నుంచి నిధులను విత్ డ్రా చేసుకోవడానికి నిబంధనలను సులభతరం చేస్తూ, విత్ డ్రా సంఖ్యను తగ్గించింది. EPFO విత్ డ్రా నిబంధనలను 13 నుంచి 3 వర్గాలకు తగ్గించింది.

ప్రత్యేక పరిస్థితులు

అత్యవసర అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు.. ఈ మూడు కారణాలతో చందాదారులు పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగం కోల్పోవడంతో.. నిరుద్యోగం కారణంగా చేసే విత్ డ్రా ‘ప్రత్యేక పరిస్థితులు’ వర్గం కిందకు వస్తుంది. ఒకవేళ మీరు ఉద్యోగం కోల్పోయినా లేదా కంపెనీ మిమ్మల్ని తొలగించినా, EPFO విత్ డ్రా నిబంధనల ప్రకారం నిరుద్యోగి మొదటి సంవత్సరంలో పాక్షికంగా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్‌లోని 75% వరకు వెంటనే విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే అప్పటికీ ఉద్యోగం రాకపోతే.. మిగిలిన 25% మొత్తాన్ని 12 నెలల తర్వాత తీసుకోవచ్చు. విత్‌డ్రా లిమిట్ లో ఉద్యోగి వాటా, వడ్డీతో పాటు యజమాని వాటా కూడా ఉంటుంది.

75 శాతం విత్ డ్రా

Advertisement

పీఎఫ్ లో 75% మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతించేందుకు కారణం.. సభ్యులు ఒకసారే తమ పొదుపు మొత్తాన్ని కోల్పోకూడదనే ఉద్దేశం. పదేపదే డబ్బు విత్‌డ్రా చేసుకోవడం వల్ల, తక్కువ జీతాలన్న కార్మికులు 8.25% చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రయోజనాలను పొందలేకపోయారు. దీంతో పదవీ విరమణ చివరిలో సామాజిక భద్రతను కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్ పై వడ్డీ రేటు 8.25%గా ఉంది. అందుకే, చందాదారుల చెల్లింపులలో 25% పీఎఫ్ ఖాతాలోనే ఉండాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. దీని ఉద్దేశం, పీఎఫ్ సభ్యులకు ఒక పటిష్టమైన పదవీ విరమణ నిధి ఉండాలనే కారణం.

100% పీఎఫ్ విత్ డ్రా ఎప్పుడు?

25% కనీస నిల్వతో సహా మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్‌ను మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు. 55 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత పదవీ విరమణ, శాశ్వత వైకల్యం, పని చేయలేకపోవడం, ఉద్యోగం కోల్పోవడం, స్వచ్ఛంద పదవీ విరమణ లేదా శాశ్వతంగా దేశాన్ని విడిచి వెళ్లడం వంటి పరిస్థితులలో పూర్తి పీఎఫ్ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. చందాదారుడు ఎంప్లాయి పింఛన్ పథకం (EPS) ఖాతాలో జమ అయిన మొత్తాన్ని, 10 సంవత్సరాల సర్వీసు పూర్తికాకముందే.. ఆ 10 ఏళ్లలో ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. అయితే, పదవీ విరమణ తర్వాత పింఛనుకు అర్హత పొందాలంటే, ఒక సభ్యుడు స్థిరమైన చెల్లింపులతో కనీసం 10 ఏళ్ల పాటు EPS సభ్యత్వాన్ని కలిగి ఉండాలి.

Advertisement

Also Read: ఈపీఎఫ్ వడ్డీ రేటులో మార్పుల్లేవ్.. డబ్బులు ఖాతాల్లో జమ ఎప్పుడంటే?

Related News

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

కొత్త ఉద్యోగంలో చేరారా? మీ PF ఖాతాలో ఈ 5 వివరాలు తప్పనిసరిగా చూడండి

Big Stories

Advertisement
×