E-Paper
Advertisement

AA22 Update : అట్లీ – అల్లు అర్జున్ మూవీలో మరో హీరోయిన్.. డైరెక్టర్ ప్లాన్ అదుర్స్..

AA22 Update : అట్లీ – అల్లు అర్జున్ మూవీలో మరో హీరోయిన్.. డైరెక్టర్ ప్లాన్ అదుర్స్..
Advertisement

AA22 Update : టాలీవుడ్ స్టార్ హీరో ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప తర్వాత భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు.. కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఆట్లీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్ 22 వ మూవీగా తెరకెక్కుతుంది.. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా కొనసాగుతుంది. ఈ మూవీ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా కాస్టింగ్ గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. తాజాగా మరో న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. ఈ మూవీలో మరో హీరోయిన్ నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇప్పుడు మరో హీరోయిన్ నటిస్తుందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది.. మరి ఆ హీరోయిన్ ఎవరు అన్నది ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

అల్లు అర్జున్ కు జోడిగా మరో హీరోయిన్.. 

అల్లు అర్జున్ సినిమాలో నటించాలని చాలా మంది హీరోయిన్లు ఆశ పడుతున్నారు. ఇప్పుడు నటిస్తున్న మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఈ ప్రాజెక్టులో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో దీపికా పదుకోన్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ నటిస్తున్నారు. అనుష్క శర్మ ఎంట్రీతో ఇప్పుడు ఐదుగురు హీరోయిన్లు అయ్యారు. ఆమెకు ఇది ఒక పవర్ ఫుల్ కమ్ బ్యాక్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంతమంది స్టార్ హీరోయిన్లను ఒకే సినిమాలో నటింపజేయడంపై నెటిజన్ల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. బాలీవుడ్ లో ఒక మార్కెట్ కోసమే అక్కడ హీరోయిన్లను తీసుకుంటున్నారా అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా కూడా ఐదుగురు హీరోయిన్లు ఒకే సినిమాలో కనిపించడం అంటే మామూలు విషయం కాదు.. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.

Advertisement

Also Read: కేశవ, కన్నాకు నిజం చెప్పేసిన మహా.. ఇంట్లోంచి వెళ్లేందుకు రెడీ.. కన్నీళ్లు పెట్టుకున్న కన్నా…

బన్నీ పాత్ర చుట్టూనే కథ.. 

బన్నీ గతంలో నటించిన పుష్ప మూవీ అతనికి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఇక పుష్ప 2 మూవీ దానికి మించి అంచనాలను రీచ్ అయింది.. గతంలో చేసిన సినిమాల రికార్డులను ఈ రెండు సినిమాలు తుడిచి పెట్టేసాయి.. ఇప్పుడు రాబోతున్న సినిమాపై ఆయన అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. భారీ బడ్జెట్ తో పాటుగా డిఫరెంట్ స్టోరీ తో రాబోతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో కూడా డిమాండ్ పెరుగుతుంది. ​సినిమా ఎంత భారీ తారాగణంతో రూపొందుతున్నప్పటికీ, అందరి కళ్లు అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్‌పైనే ఉంటాయని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. డైరెక్టర్ అట్లీ హీరోల పాత్రలను ఎలివేట్ చేయడంలో దిట్ట కాబట్టి, బన్నీ పాత్ర చుట్టూనే కథ తిరుగుతుందని స్పష్టమవుతోంది.. ఒకవైపు షూటింగ్ జరుగుతున్న సరే ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల గురించి ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. త్వరలోనే ఈ మూవీలో నటించబోతున్న కాస్టింగ్గురించి ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×