E-Paper
Advertisement

Podarillu Today Episode : కేశవ, కన్నాకు నిజం చెప్పేసిన మహా.. ఇంట్లోంచి వెళ్లేందుకు రెడీ.. కన్నీళ్లు పెట్టుకున్న కన్నా…

Podarillu Today Episode : కేశవ, కన్నాకు నిజం చెప్పేసిన మహా.. ఇంట్లోంచి వెళ్లేందుకు రెడీ.. కన్నీళ్లు పెట్టుకున్న కన్నా…
Advertisement

Podarillu Today Episode March 22nd : నిన్నటి ఎపిసోడ్ లో.. కేశవ దగ్గరకు బండి రిపేర్ కు వచ్చిన లాయర్ చక్రీ గురించి నిజం బయట పెట్టేస్తాడు.. తన భార్యతో విడాకులు తీసుకోవాలని నా దగ్గరకు వచ్చారు కానీ నేను ఆధార్ కార్డు లేకుండా విడాకులు ఇవ్వడానికి కుదరదు అని చెప్పడంతో వాళ్ళు వెళ్ళిపోయారు.. మీ అన్నయ్య ఏమో ఆమెతో కలవాలని ప్రయత్నిస్తున్న సరే ఆమె మాత్రం మీ అన్నయ్య నుంచి విడిపోవాలని అనుకుంటుంది. నువ్వు తెలిసిన వాడివి కాబట్టి నీకు ఈ విషయం చెప్పాను అది ఏంటో కనుక్కొని లాయర్ చెప్తాడు. ఇక తర్వాత చక్రీని ఇంటికి తీసుకొని కేశవ వస్తాడు.. లాయర్ ని ఎందుకు కలిశావు అని కేశవ నిలదీసి అడుగుతాడు.. నేను లాయర్ ని కలవడానికి ఒక కారణం ఉంది కదా అని చక్రితో కేశవ అంటాడు.. మీరిద్దరూ విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారా అని కేశవ అడుగుతాడు. ఆ విడాకులు తీసుకోవాలనుకునింది మీ అన్నయ్య కాదు నేను అని మహా చెప్తుంది. ఆ మాట వినగానే కేశవ కి ఫీజులు ఎగిరిపోతాయి.. ఆ తర్వాత ఎంత చెప్తున్నా సరే మాధవ్ మాత్రం నోరు విప్పకుండా ఉంటాడు. ఏంటి మాట్లాడవు నీకు ఈ విషయం తెలీదా ఏంటి అని మాధవా ను కేశవ అడుగుతాడు.

చెప్పు అన్నయ్య నీకు తెలియకుండా నీదంతా జరిగిందా? నువ్వు ఎందుకు ఏదో దాస్తున్నావ్ అని నాకు అనిపిస్తుంది నిజం చెప్పు అని కేశవ ఎంత అడిగినా సరే మాధవ్ మాత్రం నోరు విప్పకుండా మౌనంగా ఉంటాడు. ఇదంతా నీకు తెలిసే జరుగుతుంది కదా అయినా కూడా నువ్వు మౌనంగా ఉన్నావు అంటే దీని వెనక ఏదో ఉంది అని నాకు అర్థం అవుతుంది అని కేశవ మాధవాని అనుమానిస్తాడు. మాధవ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. కేశవ మహా రావడంతో ఇంటికి ఒక కళ వచ్చింది.. ఇన్నాళ్ళకి మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది అని చాలా సంతోషంగా ఉన్నాము. కన్నా ని చూడండి ఎలా ఏడుస్తున్నాడో.. వాడి కోసమైనా నిజం చెప్పొచ్చు కదా అని కేశవ ఎంత అడుగుతున్నా సరే చక్రి మాధవ్ ఇద్దరు కూడా మౌనంగా ఉంటారు. అటు నారాయణ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో ఉండిపోతాడు. తన ఇంటికి వచ్చిన కోడలు వెళ్ళిపోతుందేమో అని భయపడిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి మాత్రం తన పెళ్లి ఎలా జరిగిందన్న విషయాన్ని కేశవతో చెప్పాలని ఫిక్స్ అవుతుంది.. మొత్తానికి మహాలక్ష్మి తన పెళ్లి ఎలా జరిగింది అన్న విషయాన్ని బయట పెట్టేస్తుంది.

అసలు వీళ్ళ పెళ్లి ఎలా జరిగిందన్న విషయాన్ని తెలుసుకుని కేశవ కన్నా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇంత జరిగిన కూడా మాకు ఎందుకు చెప్పలేదు అని మాధవ పై కేశవ సీరియస్ అవుతాడు. అన్ని వేలు పెట్టి ఫంక్షన్ చేశాను కనీసం అప్పుడేనా ఇది సంగతిని చెప్పి ఉంటే సరిపోయేది కదా.. ఒక ఆడపిల్లని ఇలా తీసుకొచ్చి పెట్టడం మంచిది కాదు అని కేశవ కూడా అంటాడు. ఇంక కన్నా ఎమోషనల్ అయిపోతాడు మిమ్మల్ని ఇకమీదట వదినా అని పిలవాలా వద్దా అని అడుగుతాడు. ఏదో ఒక మాయ లాగా మీరు వచ్చి వెళ్తున్నారు తప్ప మాకు ఏ విషయం కూడా ఇప్పటికీ అర్థం కావడం లేదు అని కేశవ అంటాడు.

Advertisement

Also Read :పల్లవి ఫుల్ హ్యాపీ.. అవనిని చంపేందుకు ప్లాన్..కాపాడిన చక్రధర్.. ట్విస్ట్ ఇదే..

మహాలక్ష్మి నిజం చెప్పిన తర్వాత ఇక ఆ ఇంట్లో అందరి మధ్య ఉండలేను అని ఫిక్స్ అవుతుంది. నేను ఇంట్లో నుంచి ఎలాగైనా సరే వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది.. తర్వాత రోజు అందరూ కూర్చొని ఉండగా మహాలక్ష్మి అక్కడికి వచ్చి ఎన్ని రోజులు మీ ఇంటి ఆడపిల్లగా నన్ను చూసుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నేను మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను అని మహాలక్ష్మి చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారని అస్సలు ఊహించలేదు. ఉండమని చెప్పలేను వెళ్లిపొమ్మని చెప్పలేను అని మాధవ అంటాడు. అక్కడితో ప్రోమో పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్లో మహాలక్ష్మి ఇంటి నుంచి బయటకు వెళ్తుందా లేదా అన్నది చూడాలి..

Related News

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

Big Stories

Advertisement
×