E-Paper
Advertisement

Anupam Kher: యువతకు అనుపమ్ ఖేర్ వార్నింగ్.. ఇప్పటికైనా మార్పు వస్తుందా?

Anupam Kher: యువతకు అనుపమ్ ఖేర్ వార్నింగ్..  ఇప్పటికైనా మార్పు వస్తుందా?
Advertisement

Anupam Kher: నేషనల్ అవార్డ్ విన్నర్, వెండితెరపై వందలాది పాత్రలతో మెప్పించిన అనుపమ్ ఖేర్ తాజాగా యువతకు ఒక ‘స్వీట్ వార్నింగ్’ ఇచ్చారు. తనను ‘అంకుల్’ అని పిలిస్తే అస్సలు నచ్చదని, పిలవాలనుకుంటే ‘ఏకే’ లేదా ‘అనుపమ్ గారు’ అని పిలవాలని ఆయన కోరారు. తన బట్టతలపై వచ్చే విమర్శలను చిరునవ్వుతో తిప్పికొట్టే ఈ సీనియర్ నటుడు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఆఫర్లను ఎందుకు తిరస్కరించారో చెబుతూ పంచుకున్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం..

నన్ను అంకుల్ అనకండి:

అనుపమ్ ఖేర్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టారు. నేటి యువత తనను ‘సర్’ లేదా ‘అంకుల్’ అని పిలవడం తనకు నచ్చదని ఆయన స్పష్టం చేశారు. “నన్ను అంకుల్ అని పిలిచి వేరు చేయకండి. నాకు సినిమా నుంచి ఏఐ, సైన్స్ వరకు అన్ని విషయాల గురించి చర్చించడం ఇష్టం. నన్ను ఏకే (AK) లేదా అనుపమ్ గారు అని పిలవండి చాలు” అంటూ యువతకు చిన్నపాటి క్లాస్ పీకారు. వయసు పెరిగినా ఆలోచనల్లో ఎప్పుడూ కుర్రాడిలా ఉండటానికే ఆయన ఇష్టపడతారని ఈ మాటలతో అర్థమవుతోంది.

హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌కు నో.. నో!:

Advertisement

ఇక అనుపమ్ ఖేర్ బట్టతల ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చింది. అయితే ఎంతోమంది డాక్టర్లు ఆయన దగ్గరకు వచ్చి, ఉచితంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తామని, తలపై వెంట్రుకలు వచ్చేలా చేస్తామని ఆఫర్లు ఇచ్చారట. కొంతమంది అయితే ఇందుకోసం డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు. కానీ అనుపమ్ మాత్రం వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించారు. తనకు ఉన్నదే అందమని, ప్రకృతి సిద్ధంగా వచ్చిన దానిని మార్చుకోవడం ఇష్టం లేదని ఆయన ఖరాకండిగా చెప్పేశారు. తన వ్యక్తిత్వాన్ని వదులుకోవడానికి ఆయన అస్సలు ఇష్టపడరు.

కొడుకు సికందర్‌తో ఆ వింత అనుభవం:

తన జుట్టుకు సంబంధించి గతంలో జరిగిన ఒక సరదా సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. ఒకసారి అనుపమ్ ఖేర్ ప్రశాంతంగా న్యూస్‌పేపర్ చదువుతుండగా, అందులో ఒక హెయిర్ ఆయిల్ యాడ్ వచ్చింది. ఆయన దానిని గమనించకపోయినా, పక్కనే ఉన్న ఆయన కొడుకు సికందర్ మాత్రం.. తండ్రి ఆ యాడ్ చూసి బాధపడుతున్నాడేమో అని కంగారు పడ్డాడట. వెంటనే “నాన్న, దాని గురించి ఆలోచించకు” అని అనడంతో అనుపమ్ నవ్వుకున్నారట. ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన ఈ విషయాన్ని చెబుతూ ఆయన నవ్వులు పూయించారు.

Advertisement

ALSO READ:Bollywood: ఇండస్ట్రీలో విషాదం.. మనీష్ మల్హోత్రాకి మాతృ వియోగం

‘ఘోస్లా 2’తో మళ్ళీ ముందుకు:

సినిమాల విషయానికి వస్తే, 2006లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ‘ఖోస్లా కా ఘోస్లా’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఘోస్లా 2’ సిద్ధమవుతోంది. ప్రశాంత్ భాగియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ మరోసారి తన విలక్షణ నటనను చూపించబోతున్నారు. ఇక ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ఆగస్టు 28న విడుదల కానుంది. కామెడీ మరియు ఎమోషన్స్ కలగలిసిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సీనియర్ నటుడిగా ఇప్పటికీ తనదైన ముద్ర వేస్తూ, కొత్త తరానికి పోటీ ఇస్తున్నారు ఈ విలక్షణ నటుడు. ఇక వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని అనుపమ్ ఖేర్ నిరూపిస్తున్నారు. తనను అంకుల్ అని పిలవద్దని ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మరి ఇప్పటికైనా యువత తన పిలుపును మార్చుకుంటుందో లేదో చూడాలి.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×