E-Paper
Advertisement

UK Visa Fee Hike: బ్రిటన్ బాదుడు, వీసా ఫీజు 25 శాతం పెంపు.. ఎవరిపై ఎంత భారం?

UK Visa Fee Hike:  బ్రిటన్ బాదుడు, వీసా ఫీజు 25 శాతం పెంపు.. ఎవరిపై ఎంత భారం?
Advertisement

UK Visa Fee Hike: యూనైటెడ్ కింగ్‌డమ్ పర్యాటక, విద్యార్థి సహా అన్ని రకాల వీసా ఫీజులను 6 నుంచి 25 శాతం వరకు పెంచింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 8, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. యూకే హోమ్ ఆఫీస్ ప్రకటనతో.. బ్రిటన్ వెళ్లే వారిపై మరింత భారం పడనుంది. ఇమ్మిగ్రేషన్, నేషనాలిటీ రుసుములు 6 నుంచి 7 శాతం మేర పెంచింది. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ రుసుము అత్యధికంగా 25 శాతం పెంచింది. ఇది 16 పౌండ్ల నుండి 20 పౌండ్ల మేర పెరగనుంది. పాస్‌పోర్ట్ ఛార్జీలను 8 శాతం మేర పెంచారు.

ఏ ఫీజులు పెరిగాయంటే?

ఆరు నెలల విజిటింగ్ వీసా రుసుము 127 పౌండ్ల నుండి 135 పౌండ్లకు, అంటే సుమారు రూ. 17,000కు పెరగనుంది. స్టూడెంట్ వీసా ఫీజులను 524 పౌండ్ల నుంచి 558 పౌండ్ల (రూ.16824)కు పెంచింది. వర్క్ వీసా ఛార్జీలను కూడా అన్ని కేటగిరీలలో సమరించింది. విదేశీయులకు మూడు సంవత్సరాల వరకు ఉండే స్కిల్డ్ వర్కర్ వీసా ఛార్జీ 769 పౌండ్ల నుండి 819 పౌండ్లకు( రూ.1,02,470) పెంచింది. అయితే మూడేళ్లకు పైగా ఉండే దరఖాస్తులకు 1,519 పౌండ్ల నుండి 1,618 పౌండ్లకు( రూ.2,02,437) పెరగనుంది. ఇప్పటికే యూకేలో ఉన్న వారికి మూడేళ్ల వరకు ఫీజు 885 పౌండ్ల నుండి 943 పౌండ్లకు, మూడేళ్ల పైగా ఉంటే వీసా రుసుము 1,751 పౌండ్ల నుంచి 1,865 పౌండ్లకు పెరుగుతుంది. ఆరోగ్య, సంరక్షణ వీసా ఫీజులను కూడా పెంచింది. మూడేళ్ల కాలానికి రుసుములు 304 పౌండ్ల నుంచి 324 పౌండ్లకు పెరగగా, మూడేళ్లకు పైబడిన దరఖాస్తులకు 590 నుండి 628 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది.

పౌరసత్వం మరింత ఖర్చు

Advertisement

తాత్కాలికంగా పని చేసేందుకు వెళ్లే వారిపైనా వీసా ఛార్జీ భారం పడనుంది. ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ వీసాతో సహా ఈ వీసాల ఛార్జీలను 319 పౌండ్ల నుంచి 340 పౌండ్లకు పెంచింది. స్థిరనివాసం, పౌరసత్వం కోసం అప్లై చేసుకున్న వారి వీసాలు కూడా ఖరీదుకానున్నాయి. నిరవధికంగా నివసించడానికి 3,029 నుండి 3,226 పౌండ్ల రుసుము చెల్లించాలి. బ్రిటిష్ పౌరసత్వం పొందడానికి ఖర్చు 1,605 పౌండ్ల నుంచి 1,709 పౌండ్లకు పెరిగింది. పిల్లల పౌరసత్వ నమోదుకు మినహాయింపు ఇచ్చారు. ఆ రుసుమును 1,214 పౌండ్ల నుంచి 1,000కు తగ్గించారు.

స్పాన్సర్లపై భారం

టూరిస్టులు, విద్యార్థులు, శాశ్వత నివాసం, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే అనేక వర్గాల ప్రజలు ముందుగా చెల్లించాల్సిన ఖర్చులు భారీగా పెరగనున్నాయి. వీసా ఫీజులు పెంచడంతో స్పాన్సర్‌లకు కూడా ఖర్చులు పెరగనున్నాయి. స్పాన్సర్‌షిప్ ఫీజులో ఎలాంటి మార్పు చేయనప్పటికీ, విదేశీ కార్మికులను నియమించుకునే కంపెనీలు, స్పాన్సర్‌షిప్‌ను నిర్వహించే సంస్థలు ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వచ్చే లైసెన్స్ ఫీజులను భరించాల్సి ఉంటుంది.
(ఒక పౌండ్=125.32 రుపాయలు)

Advertisement

Also Read:  H–1B వీసాలపై టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలక నిర్ణయం

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×