Anupama Parameswaran:అనుపమ పరమేశ్వరన్..ఈ ముద్దుగుమ్మ తాజాగా క్రేజీ కల్యాణం తో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెల్సిందే.అయితే ఈ భామ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.
సినిమాలతో బిజీగా ఉంటూనే, తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన చిన్న చిన్న మూమెంట్స్ ని ఫాన్స్ తో పంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.ఇక ఈ క్రమంలోనే ఈ బ్యూటీ పెట్టిన “Hey you”అనే ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
“Hey you” అనే క్యాప్షన్ ఇపుడు మరోసారి వైరల్
సాధారణంగా సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా పోస్టులతో అభిమానులకు దగ్గరవుతుంటారన్న సంగతి తెల్సిందే.కానీ అనుపమ మాత్రం కొన్నిసార్లు చాలా చిన్న క్యాప్షన్లతోనే తన ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లలో క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఈసారి కూడా ఆమె పెట్టిన “Hey you” అనే క్యాప్షన్ ఇపుడు మరోసారి వైరల్ అవుతుంది.
ఈ ఫొటో విషయానికి వస్తే అనుపమ ఆలివ్ గ్రీన్ కలర్ టాప్, బ్లూ డెనిమ్ జీన్స్‌తో సింపుల్‌గా కనిపిస్తూనే తనదైన స్టైల్‌తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. కర్లీ హెయిర్, న్యాచురల్ ఎక్స్‌ప్రెషన్స్ తో కనిపించిన అనుపమని చూసి సో క్యూట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్.
అనుపమ పరమేశ్వరన్ కెరీర్ విషయానికి వస్తే
ఇక అనుపమ పరమేశ్వరన్ కెరీర్ విషయానికి వస్తే ప్రేమమ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, ‘అ ఆ’ సినిమాతో మరింత పాపులర్ అయిపొయింది. ఆ తర్వాత ‘శతమానం భవతి’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురు ప్రేమ కోసమే’ వంటి సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
ముఖ్యంగా ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ కొట్టేసింది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల పై చిలుకు వసూల్లని కొల్లగొట్టడం విశేషం. ఇక ఇందులో అనుపమ చేసిన ముగ్ధ పాత్ర కి ముగ్ధులైపోయారు ఆడియన్స్. అలాగే ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా ట్రెండీ లుక్ లో కనబడి ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేసింది.
త్వరలో ఏమైనా రివీల్ చేస్తుందేమో !
ఇక అలా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే, సోషల్ మీడియాలోనూ అభిమానులతో టచ్‌లో ఉండటం అనుపమకు అలవాటు. షూటింగ్ అప్‌డేట్స్, ఫొటోషూట్స్, పర్సనల్ మూమెంట్స్ కి సంబంధించిన పోస్టులతో సందడి చేసే అనుపమ తాజాగా పెట్టిన “Hey you” పోస్ట్ మాత్రం ఎవరిని టార్గెట్ గా చేసి పెట్టిందో స్వయంగా చెబితే కాని తెలిసేలా లేదు .చూడాలి మరి త్వరలో ఏమైనా రివీల్ చేస్తుందేమో !