Superhero Action Movie: సూపర్ హీరోగా ప్రజల ప్రాణాలు కాపాడిన వ్యక్తి… చివరికి వాళ్ల దృష్టిలోనే నేరస్థుడిగా మారితే అతడి జీవితం ఎలా తలకిందులవుతుందో చూపించే సినిమానే ‘లెజెండ్ ఆఫ్ ది వైట్ డ్రాగన్’ (Legend of the White Dragon). ఒకప్పుడు మాస్క్ వేసుకుని శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన హీరో, ఇప్పుడు తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. తనపై పడిన నిందను తొలగించుకోవడంతో పాటు, తన జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్న అసలు శత్రువు ఎవరో కనిపెట్టేందుకు రంగంలోకి దిగుతాడు. మరి ఈ పోరాటంలో అతడికి ఎదురయ్యే సవాళ్లు ఏంటి ? అసలు ఈ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడ అంటే…
ఎరిక్ రీడ్ ఒకప్పుడు వైట్ డ్రాగన్ గా గుర్తింపు పొందిన హీరో. కానీ కొన్ని పరిణామాల తర్వాత అతడు ప్రజల కళ్లకు దూరంగా, తనను తాను దాచుకుంటూ జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. అతడి గతం, అతడిపై ఉన్న ఆరోపణలు అతడి జీవితాన్ని వెంటాడుతుంటాయి. తన కుటుంబంతో తిరిగి కలవాలంటే ముందుగా తనపై పడిన మచ్చను తుడిచేయాలని ఎరిక్ భావిస్తాడు. అయితే అతడి ప్రయాణం అంత సులభంగా సాగదు.
ఎరిక్ తిరిగి తన జీవితాన్ని సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో, అతడిని పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్న ఓ రహస్య విలన్ రంగంలోకి దిగుతాడు. వైట్ డ్రాగన్ అనే గుర్తింపును చెరిపేయడమే అతడి లక్ష్యంగా కనిపిస్తుంది. దీంతో ఎరిక్ తన గతాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. తనను ఎవరు ఇరికించారు ? తనపై ఉన్న ఆరోపణల వెనుక ఏదైనా కుట్ర ఉందా ? కుటుంబాన్ని కాపాడుకోవడానికి, తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఎవరితో పోరాడాలి ? అనేది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
సూపర్‌హీరో కథల్లో సాధారణంగా హీరోకు ప్రత్యేక శక్తులు, ఆయుధాలు లేదా ప్రత్యేకమైన గుర్తింపు ఉంటాయి. కానీ ఆ గుర్తింపే అతడికి ప్రమాదంగా మారితే పరిస్థితి విచిత్రంగా మారిపోతుంది. ఎరిక్ తన గతాన్ని దాచుకుని ఉండాలా, లేక మళ్లీ వైట్ డ్రాగన్‌గా మారి శత్రువులను ఎదుర్కోవాలా అనే సంఘర్షణలో చిక్కుకుంటాడు. అతడి కుటుంబంతో ఉన్న బంధం కూడా ఈ పోరాటానికి భావోద్వేగ కోణాన్ని జోడిస్తుంది. తనను వెంబడిస్తున్న వ్యక్తిని ఎదుర్కొనే క్రమంలో ఎరిక్ తనపై ఉన్న ఆరోపణలను తొలగించుకోవడమే కాకుండా, తన జీవితాన్ని తిరిగి నిర్మించుకోవాల్సి వస్తుంది.
‘లెజెండ్ ఆఫ్ ది వైట్ డ్రాగన్’ లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play)లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. భారతదేశంలో తెలుగు వెర్షన్ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే లిస్టింగ్ ఉంది. ఈ చిత్రంలో జేసన్ డేవిడ్ ఫ్రాంక్ (Jason David Frank), ఆరోన్ షోయెన్‌కే (Aaron Schoenke), జేసన్ ఫాంట్ (Jason Faunt), రాచెల్ బ్రూక్ స్మిత్ (Rachele Brooke Smith), మైఖేల్ మాడ్సెన్ (Michael Madsen), డేవిడ్ రామ్‌సే (David Ramsey) తదితరులు నటించారు. ఆరోన్ షోయెన్‌కే, సీన్ షోయెన్‌కే దర్శకత్వం వహించారు. యాక్షన్, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో అంశాలు కలగలిసిన ఈ చిత్రం యాక్షన్ మూవీ లవర్స్ కు మంచి వీకెండ్ ఆప్షన్.