E-Paper
Advertisement

భార్య అంటే ఉచితంగా వచ్చే పనిమనిషా?- అనుపమ కామెంట్స్ వైరల్!

భార్య అంటే ఉచితంగా వచ్చే పనిమనిషా?- అనుపమ కామెంట్స్ వైరల్!
Advertisement

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran).. ఒకప్పుడు హోమ్లీ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈమె.. ఆ తరువాత కొంతకాలం గ్యాప్ ఇచ్చి మళ్లీ బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కిష్కిందపురి, పరదా అంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. తాజాగా క్రేజీ కల్యాణం అనే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. థియేటర్లలో అక్టోబర్ 16వ తేదీన గ్రాండ్గా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను పంచుకుంటుంది.

పెళ్లి కాకపోయినా.. పిల్లల్ని కంటాను..

ఈ క్రమంలోనే.. సమాజంలో వివాహం, కుటుంబం బంధాలు, మహిళల పాత్రపై ఉన్న మూస ధోరణిలను ప్రశ్నిస్తూ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడిన అనుపమ.. అటు వివాహ వ్యవస్థ పై, ఇటు పిల్లల్ని కనడంపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చర్చకు దారితీసాయి. వివాహ బంధం పై అనుపమ మాట్లాడుతూ..” పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు కానీ పిల్లల్ని కనండి అని నరేష్ గారు ఇటీవల చెప్పారు కదా.. అయితే మా ఇంట్లో కూడా మా అమ్మ నాతో ఎప్పుడూ ఇదే అంటూ ఉంటుంది. నిజానికి నాకు పెళ్లికి ముందే ఒక బిడ్డను కనాలనే కోరిక ఉండేది. భవిష్యత్తులో నాకసలు పెళ్లవుతుందో లేదో అనే స్పష్టత నాకే లేదు. కానీ ఒక పాపనో.. బాబునో పెంచుకోవాలనే కోరిక మాత్రం చాలా బలంగా ఉంది. అది అడాప్షన్ ద్వారా లేదా ఐవీఎఫ్ ద్వారానో ఎలాగైనా సరే సాధ్యమే కదా” అంటూ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్. మొత్తానికి అయితే పిల్లల్ని కనడానికి పెళ్లెందుకు అనే రేంజ్ లో తన అభిప్రాయాలను పంచుకుంది.

తోడుగా నిలిచే భాగస్వామ్యం దొరకాలి..

Advertisement

అలాగే దాంపత్య జీవితంలో భార్యాభర్తల సమానత్వంపై కూడా అనుపమ తన అభిప్రాయాలను పంచుకుంది. వైవాహిక బంధంలో..” పెళ్లి చేసుకోవడం అంటే ఉచితంగా వచ్చే పనిమనిషి కోసం కాదు.. ఆడపిల్లల బాధ్యత కేవలం వంటింటికే పరిమితం కాకూడదు.. ముఖ్యంగా భార్యాభర్త బయటకు వెళ్లి పనులు చేసి.. అలసిపోయి ఇంటికి వచ్చాక మహిళ ఒకటే వంటింట్లోకి వెళ్లి వంట చేయాల్సిన రావడం .. పురుషులు విశ్రాంతి తీసుకోవడం సరైన పద్ధతి కాదు.. ఇంట్లో పనులను కూడా ఇద్దరు సమానంగా పంచుకోవాలని, కనీసం ఆమెకు తోడుగా నిలిచే భాగస్వామ్యం దొరకాలి ” అంటూ తన ఆలోచనలను నిర్మొహమాటంగా బయటపెట్టింది అనుపమ మొత్తానికైతే అటు వైవాహిక బంధం పై ఇటు దాంపత్య జీవితంపై అనుపమ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ALSO READ: సాయి దుర్గ తేజ్ బర్తడే స్పెషల్.. అమ్మవారి మొక్క నాటిన నాగబాబు!

రేపే థియేటర్లలోకి అనుపమ క్రేజీ కళ్యాణం..

Advertisement

ప్రముఖ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరో అఖిల్ రాజ్, వీకే నరేష్ తదితరులు ప్రధాన పాత్రలో అనుపమ హీరోయిన్ గా అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానున్న చిత్రం క్రేజీ కళ్యాణం. సరైన బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అనుపమ ఈ క్రేజీ కళ్యాణంతో మంచి హిట్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. జైలర్ 3 పై అఫీషియల్ అప్డేట్!

తన జీవిత గాథ అలానే ముగియాలి..తన బయోపిక్ మూవీ పై సల్మాన్ ఖాన్ కామెంట్స్!

సాయి దుర్గ తేజ్ బర్తడే స్పెషల్.. అమ్మవారి మొక్క నాటిన నాగబాబు!

బోల్డ్ ఫోటోషూట్ తో రచ్చ చేస్తున్న అక్కినేని కోడలు.. టార్గెట్ చేసిన సమంత ఫ్యాన్స్!

మొదటసారి రష్మికతో కలసి పుట్టపర్తి వచ్చిన విజయ్ దేవరకొండ!

‘ భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి’ బయోపిక్ పై రజినీకాంత్ కామెంట్స్!

నానా పటేకర్ చనిపోలేదా.. హాట్ బాంబు పేల్చిన నటి!

Big Stories

Advertisement
×