E-Paper
Advertisement

సాయి దుర్గ తేజ్ బర్తడే స్పెషల్.. అమ్మవారి మొక్క నాటిన నాగబాబు!

సాయి దుర్గ తేజ్ బర్తడే స్పెషల్.. అమ్మవారి మొక్క నాటిన నాగబాబు!
Advertisement

Sai durga Tej: మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ (Sai Durga Tej) పుట్టినరోజు కావడంతో ఈయనకు స్పెషల్ గిఫ్ట్ అందిస్తూ తన సోదరుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో పోల్చుతూ నాగబాబు (Nagababu) రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా మెగా కుటుంబంలో పిల్లలను మొదలుకొని పెద్దవాళ్ల వరకు ఎవరి పుట్టిన రోజు జరిగినా సరే వారి పుట్టినరోజు జ్ఞాపకంగా ఒక మొక్క నాటుతూ.. వారి పేరు మీద దాని రక్షణ బాధ్యతలు నాగబాబు తీసుకుంటున్న విషయం తెలిసిందే.. మొన్నటికి మొన్న తన మనవడు వాయువ్ తేజ్, తన సోదరులు పవన్ కళ్యాణ్ , చిరంజీవి పేర్ల మీద మొక్కలు నాటి అందరిని ఆకట్టుకున్న నాగబాబు.. నేడు తన మేనల్లుడు సాయి దుర్గా తేజ్ పుట్టినరోజు కావడంతో ఒక అరుదైన మొక్కను సాయి దుర్గ తేజ్ పేరు మీద నాటడమే కాకుండా ఆయన వ్యక్తిత్వాన్ని పవన్ కళ్యాణ్ తో పోల్చుతూ ప్రశంసలు కురిపించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మేనల్లుడికి స్పెషల్ బర్తడే గిఫ్ట్..

“నా ప్రియమైన తేజు బాబు.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ జీవితంలో ప్రతి దశలోనూ నీకు అంతులేని విజయం, శాంతి, ఆనందం కలగాలని కోరుకుంటున్నాను. నీ ముందున్న ప్రయాణం నీ హృదయంలో అందంగా, నీ స్ఫూర్తి స్ఫూర్తిదాయకంగా సాగాలి. ఎదుగుతూ ఉండు..ప్రకాశిస్తూ ఉండు లవ్ యు మై బాయ్” అంటూ క్యాప్షన్ జోడించిన నాగబాబు.. ఒక వీడియో కూడా జోడించారు. పవన్ కళ్యాణ్ గారి లాగా తేజు కూడా మంచి భక్తుడు. ఆయనలాగే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు.. అందుకే అమ్మవారి చెట్టు అయినా కదంబవాసి మొక్కను మొన్న చిరంజీవి గారి కోసం నాటాను . నేడు సాయి దుర్గా తేజ కోసం మళ్లీ నాటాను.

మేనల్లుడి పేరు మీద కదంబవాసి మొక్క నాటిన నాగబాబు..

Advertisement

నువ్వు కూడా నీ అభిమానులకు, నిన్ను ఇష్టపడే వారికి.. ఇలాగే మొక్కలు నాటి పెంచేటటువంటి కాన్సెప్ట్ ను డెవలప్ చెయ్యి. నువ్వు చాలా మంచోడివి..నీలాంటి మంచి వాడికి అంతా మంచే జరుగుతుంది. ఈ చెట్టును నీ పేరు మీద నాటితే.. ఎంతమందికి నీడ ఇస్తుందో మనం ఊహించలేము. అంత అద్భుతమైన మొక్క ఇది. దీనికి టెన్నిస్ బాల్ లాంటి పువ్వులు వస్తాయి. వీటితో డైరెక్ట్ గా అమ్మవారికి పూజ చేస్తారు. ఈ ఒక్క చెట్టు నిన్ను ఆశీర్వదిస్తుంది. అలాగే నువ్వు కూడా అందర్నీ ప్రోత్సహించి మొక్కలు నాటేటువంటి పని మొదలు పెట్టు బాబు” అంటూ వీడియో విడుదల చేశారు నాగబాబు. మొత్తానికి అయితే తన మేనల్లుడి పేరుమీద కదంబవాసి మొక్కను నాటి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు.

కదంబవాసి మొక్క ఉపయోగాలు ఏంటి?

కదంబవాసి.. కదం లేదా బర్ ఫ్లవర్ చెట్టు అని కూడా పిలుస్తారు. ఇది వేగంగా పెరిగే మొక్క. దీనికి ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. దీని నుంచి వచ్చే బెరడు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. జ్వరాన్ని తగ్గించడానికి, జీర్ణ సమస్యలు, విరోచనాలు, పెద్దప్రేగు వాపు, నోటిపూతల చికిత్సలకు ఉపయోగిస్తారు. ముఖ్యంగా దీని బెరడు పేస్టును చర్మ సమస్యలు, మొటిమలు, గాయాలపై కూడా పూస్తారు. దీని యొక్క ఆకులు.. వాపు లేదా మంటను తగ్గించడానికి ఉపయోగిస్తారు.

Advertisement

ALSO READ: భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి’ బయోపిక్ పై రజినీకాంత్ కామెంట్స్!

ఆయుర్వేదంలో ప్రత్యేక గుర్తింపు..

అధిక రుతుస్రావాన్ని నియంత్రించడానికి ఈ ఆకుల రసాన్ని ఉపయోగిస్తారట. అంతేకాదు దీని పండ్లు తీపి – పులుపు రుచులు కలిగి ఉంటాయి. ఈ పండ్ల రసాన్ని జ్వరం సమయంలో తాగడం వల్ల అధిక దాహాన్ని తీర్చుకోవచ్చట. అలాగే పాలిచ్చే స్త్రీలలో తల్లిపాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఈ పండ్లు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క వేర్ల కషాయాలను మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల్లో రాళ్లు కరిగించడానికి ఉపయోగిస్తారట. అదేకాదు వీటి పువ్వులను పెర్ఫ్యూమ్లలో ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

?utm_source=ig_web_copy_link&rpxt=NTc4MTIwNjQ2YQ==

Related News

భార్య అంటే ఉచితంగా వచ్చే పనిమనిషా?- అనుపమ కామెంట్స్ వైరల్!

తన జీవిత గాథ అలానే ముగియాలి..తన బయోపిక్ మూవీ పై సల్మాన్ ఖాన్ కామెంట్స్!

బోల్డ్ ఫోటోషూట్ తో రచ్చ చేస్తున్న అక్కినేని కోడలు.. టార్గెట్ చేసిన సమంత ఫ్యాన్స్!

మొదటసారి రష్మికతో కలసి పుట్టపర్తి వచ్చిన విజయ్ దేవరకొండ!

‘ భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి’ బయోపిక్ పై రజినీకాంత్ కామెంట్స్!

నానా పటేకర్ చనిపోలేదా.. హాట్ బాంబు పేల్చిన నటి!

ఆ ఒక్క క్షణమే పునీత్ ప్రాణం తీసిందా..ఇన్నేళ్ళకి బయటపడ్డ నిజం!

Big Stories

Advertisement
×