E-Paper
Advertisement

Anurag Crash: సూసైడ్ అటెంప్ట్ చేసిన యూట్యూబర్ అనురాగ్ డోభాల్ పరిస్థితి విషమం..

Anurag Crash: సూసైడ్ అటెంప్ట్ చేసిన యూట్యూబర్ అనురాగ్ డోభాల్ పరిస్థితి విషమం..
Advertisement

Anurag Crash: ప్రముఖ యూట్యూబర్, ‘బిగ్ బాస్ 17’ కంటెస్టెంట్ అనురాగ్ డోభాల్ (UK07 Rider) ఘజియాబాద్‌ సమీపంలో జరిగిన భీకర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో సుమారు 80,000 మంది వీక్షకులు చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదరి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అనురాగ్ డోభాల్ తన టయోటా ఫార్చ్యూనర్ కారులో ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆయన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో తన ఫాలోవర్లతో మాట్లాడుతున్నారు. కారు సుమారు 140 నుండి 150 కి.మీ. వేగంతో వెళుతూ.. తను సూడైడ్ చేసుకుంటున్నానని.. చెప్పారు. తర్వాత కొంత సేపటికే కారు రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.

Read also-Romantic fantasy Drama : ప్రేమ కథలో విస్తుపోయే క్లైమాక్స్… వయసు పెరిగినా తగ్గని తగ్గని జోరు… ఆస్కార్ విన్నింగ్ మూవీ

Advertisement

ప్రమాదానికి ముందు అనురాగ్ చాలా భావోద్వేగానికి లోనయ్యారు. లైవ్ వీడియోలో మాట్లాడుతూ.. “నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. అమ్మ, వచ్చే జన్మలోనైనా నన్ను ప్రేమించు. నా అన్న నన్ను చాలా బాధపెట్టాడు” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ మాటలు విన్న నెటిజన్లు ఆయన ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నారని గ్రహించి కామెంట్ బాక్స్‌లో వారించే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే ప్రమాదం జరిగి లైవ్ కట్ అయిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఆయనను మీరట్‌లోని సుభార్తి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అనురాగ్ ఐసీయూ (ICU)లో చికిత్స పొందుతున్నారు. ఆయన తలకి తీవ్ర గాయాలయ్యాయని, అలాగే శరీరంలో పలు చోట్ల ఎముకలు విరిగాయని వైద్యులు తెలిపారు. ఆయన మేనేజర్ రోహిత్ పాండే స్పందిస్తూ.. “అనురాగ్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది కానీ అబ్జర్వేషన్‌లో ఉంచారు. దయచేసి ఆయన కోలుకోవాలని ప్రార్థించండి” అని కోరారు.

Read also-Useful Android Apps: మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.. ఇల్లు, ఆఫీస్ రెండింటికీ ఉపయోగకరం

Advertisement

గత కొంతకాలంగా అనురాగ్ తన కుటుంబ సభ్యులతో గొడవలు పడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన తండ్రి, సోదరుడు తనను మానసికంగా వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మానసిక ఒత్తిడి కారణంగానే ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో దాదాపు ఎనభై వేల మంది ఉండటం గమనార్హం.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అతని మేనేజర్ చెబుతున్నా.. పరిస్థితి మాత్రం చాలా సిరియస్ గా ఉందని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాలంటే మరి కొంత సమయం ఆగాల్సిందే.

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×