Useful Android Apps| టెక్నాలజీ వేగంగా మారుతోంది. మన రోజువారీ జీవితం, పని, సమయ నిర్వహణను డిజిటల్ పరికరాలు ప్రభావితం చేస్తున్నాయి. చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లను సరిగ్గా ఉపయోగించడం రాదు. కానీ సరైన యాప్‌లు తెలిస్తే రోజువారీ పనులు త్వరగా, సులభంగా, సక్రమంగా చేస్తాయి. ఈ 5 ఆండ్రాయిడ్ యాప్‌లు మీ జీవితాన్ని చాలా సులభం చేస్తాయి.
TickTick అనేది పవర్‌ఫుల్ టాస్క్ మేనేజ్‌మెంట్ యాప్. రోజువారీ పనులకు సులభంగా టు-డు లిస్ట్‌లు తయారు చేయవచ్చు. డెడ్‌లైన్‌లు సెట్ చేసి రిమైండర్లు పెట్టుకోవచ్చు. హ్యాబిట్ ట్రాకింగ్ ఫీచర్ ఉంది. దీంతో మంచి అలవాట్లను కొనసాగించవచ్చు. ఇంకా పోమోడోరో టైమర్ ఉంది. దీంతో ఏకాగ్రతతో పని చేసి, చిన్న బ్రేక్‌లు తీసుకోవచ్చు. టాస్క్‌లు, అలవాట్లు, ఫోకస్.. అన్నీ ఒకే యాప్‌లో ఉంటాయి.
Motion అనేది AI ఆధారంగా ప్లానింగ్ చేసే యాప్. మీ టాస్క్‌లు, మీటింగ్‌ల ఆధారంగా రోజు షెడ్యూల్‌ను ఆటోమాటిక్‌గా తయారు చేస్తుంది. ప్రాధాన్యత, డెడ్‌లైన్, సమయం చూసి ఆర్డర్ చేస్తుంది. కొత్త టాస్క్ వచ్చినప్పుడు పాప్-అప్ రిమైండర్ ఇస్తుంది. మీరు పని చేసే గంటలు, వీకెండ్ రిలాక్స్ సమయం సెట్ చేయవచ్చు. AI ఆ రూల్స్ పాటిస్తుంది. ఇలా వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితం బ్యాలెన్స్‌లో ఉంటుంది.
Google Keep చాలా సింపుల్, ఉపయోగకరమైన నోట్ టేకింగ్ యాప్. త్వరగా నోట్స్, రిమైండర్లు, చెక్‌లిస్ట్‌లు తయారు చేయవచ్చు. ఫోటోలు, డ్రాయింగ్‌లు, వాయిస్ రికార్డింగ్‌లు జోడించవచ్చు. వాయిస్ టు టెక్స్ట్ ఫీచర్ ఉంది. మాట్లాడితే ఆటోమాటిక్‌గా రాసేస్తుంది. అన్ని డివైస్‌లలో సింక్ అవుతుంది. లొకేషన్ బేస్డ్ రిమైండర్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మీరు కిరాణా షాపు సమీపంలో వచ్చినప్పుడు యాప్ మీకు కావాల్సిన గ్రాసరీ రిమైండ్ చేస్తుంది.
Notion అనేది ఆల్-ఇన్-వన్ ప్రొడక్టివిటీ యాప్. నోట్స్, టాస్క్‌లు, డేటాబేస్‌లు, ప్లానింగ్.. అన్నీ ఒకే చోట ఉంటాయి. టెక్స్ట్, ఇమేజ్‌లు, వీడియోలు, డాక్యుమెంట్లు స్టోర్ చేయవచ్చు. ఫ్లెక్సిబుల్ బ్లాక్‌లతో మీకు నచ్చిన విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్స్ ప్రాజెక్ట్‌లు, గోల్స్ ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తారు. స్టూడెంట్స్ స్టడీ నోట్స్, రీసెర్చ్, ప్రాజెక్ట్ ప్లానింగ్‌కు ఉపయోగిస్తారు.
Also Read: వాట్సాప్‌లో యాడ్స్‌తొ విసిగిపోతున్నారా? ఇలా బ్లాక్ చేయండి
Todoist చాలా క్లీన్, సింపుల్ టాస్క్ మేనేజ్‌మెంట్ యాప్. సులభంగా టాస్క్‌లు జోడించవచ్చు. నేచురల్ లాంగ్వేజ్ ఫీచర్ ఉంది. సాధారణ భాషలో టైప్ చేస్తే డేట్, టైమ్ ఆటోమాటిక్‌గా గుర్తిస్తుంది. AI వాయిస్ ఎంట్రీ ఉంది. మాట్లాడితే టాస్క్‌గా మారుస్తుంది. ఇంటర్‌ఫేస్ సింపుల్ కాబట్టి ఎవరైనా సులభంగా వినియోగించవచ్చు.
సరైన యాప్‌లతో స్మార్ట్‌ఫోన్ ఒక పవర్‌ఫుల్ టూల్ అవుతుంది. TickTick, Motion, Google Keep, Notion, Todoist వంటి యాప్‌లు మీ టాస్క్‌లు, హ్యాబిట్స్, ఐడియాలు, ప్లానింగ్ సులభం చేస్తాయి. ఇవి రెగ్యులర్‌గా ఉపయోగిస్తే… జీవితం ఆర్గనైజ్డ్‌గా, ఎఫిషియెంట్‌గా, స్ట్రెస్ లేకుండా ఉంటుంది.