E-Paper
Advertisement

కిరణ్ అబ్బవరం ‘భజగోవిందం’ సాంగ్ పై ఏపీ సీఎం ప్రశంసలు.. రియాలిటీ పై పెరిగిన బజ్!

కిరణ్ అబ్బవరం ‘భజగోవిందం’ సాంగ్ పై ఏపీ సీఎం ప్రశంసలు.. రియాలిటీ పై పెరిగిన బజ్!
Advertisement

Bhaja Govindam Song: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా నిర్మాతగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఒకరు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం నిర్మాతగా కూడా వరుస సినిమాలను నిర్మిస్తూ ఉన్నారు. అయితే త్వరలోనే ఈయన తన స్వీయ దర్శకత్వంలో రియాలిటీ(Reality) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా నుంచి భజగోవిందం అనే పాట విడుదల చేసిన సంగతి తెలిసిందే.

భజగోవిందం బ్రతికే కోలాహలం..

భీమ్స్ సిసిరోలియో సంగీత సారథ్యంలో ప్రముఖ గాయని వైకోమ్ విజయలక్ష్మి పాడిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.‘భజ గోవిందం… బ్రతుకే కోలాహలం’ పాట మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారికి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పాలి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ పాటపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(AP C.M.NaraChandrababuNaidu) కూడా స్పందించడంతో ఈ పాటకు విపరీతమైన బజ్ ఏర్పడింది. ఎంతోమంది ఇప్పటికే ఇంస్టాగ్రామ్, యూట్యూబ్లో పెద్ద ఎత్తున రీల్స్ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

ఇది స్విట్జర్లాండ్ కాదు.. మన ఆంధ్రప్రదేశ్

Advertisement

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ అందాలను అద్భుతంగా చిత్రీకరిస్తూ ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఈ వీడియోకి భజగోవిందం బ్యాక్గ్రౌండ్ సాంగ్ సెట్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో పై ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందిస్తూ.. ఇది స్విట్జర్లాండ్ కాదు.. మన ఆంధ్రప్రదేశ్ అంటూ నారా చంద్రబాబునాయుడు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోని రీ పోస్ట్ చేశారు.

Advertisement

ఇలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ వీడియో పై స్పందించడంతో సదురు ఇన్ఫ్లుయెన్సర్ ఏపీ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రియాలిటీ సినిమాలోని ఈ పాటకు భారీ హైప్ క్రియేట్ అయిందని చెప్పాలి. ఇలా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించడంతో రియాలిటీ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వరుస అప్డేట్స్ తెలియజేస్తూ ప్రమోషన్లను మొదలుపెట్టారు. మరి సీఎం చంద్రబాబు నాయుడు స్పందన పట్ల కిరణ్ అబ్బవరం రియాలిటీ చిత్ర బృందం రియాక్షన్ ఏంటనేది తెలియాల్సి ఉంది. కిరణ్ అబ్బవరం బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఒకవైపు హీరోగా సక్సెస్ అందుకుంటున్న మరోవైపు నిర్మాతగా కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. మరి డైరెక్టర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారు అనేది తెలియాల్సి ఉంది..

Also Read: వామ్మో ఆసిన్ కుమార్తెకు ఇలాంటి టాలెంట్ ఉందా? సూపర్ కిడ్ అంటూ!

Related News

మా సంతోషాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారు.. విజయ్ స్ట్రాంగ్ కౌంటర్!

భార్యకు సర్జరీ వెక్కి వెక్కి ఏడ్చిన అలీ..అసలేం జరిగిందంటే?

వామ్మో ఆసిన్ కుమార్తెకు ఇలాంటి టాలెంట్ ఉందా? సూపర్ కిడ్ అంటూ!

విజయ్ పై భారీ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రష్మిక!

ఏందయ్యా స్వామి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్.. విరోష్ కెమిస్ట్రీ అదుర్స్!

ఏంటీ.. ఆదర్శ కుటుంబం మూవీలో వెంకటేష్ దొంగా? సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందంటే?

ప్రాణభయంతో సొంత ఇంటిని అమ్మేసిన టైగర్ ష్రాఫ్.. ఎన్ని కోట్లంటే?

Big Stories

Advertisement
×